MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Vida VX2: హీరో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌పై రూ. 15వేల డిస్కౌంట్‌.. రూ. 44 వేల‌కే క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు

Vida VX2: హీరో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌పై రూ. 15వేల డిస్కౌంట్‌.. రూ. 44 వేల‌కే క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు

ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు డిమాండ్ పెరుగుతోంది. బ‌డా ఆటో మొబైల్ కంపెనీలు సైతం ఈవీ వాహ‌నాలు లాంచ్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా హీరో మోటోకార్ప్ ఓ స్కూటీపై భారీ డిస్కౌంట్‌ను ప్ర‌క‌టించింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 11 2025, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ. 44 వేల‌కే స్కూటీ
Image Credit : Hero website

రూ. 44 వేల‌కే స్కూటీ

హీరో మోటోకార్ప్ ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన Vida VX2 ఎలక్ట్రిక్ స్కూటర్‌కి సంబందించిన బేసిక్ వెర్షన్ VX2 Go ప్రారంభంలో రూ. 59,490 (ఎక్స్‌షోరూమ్)గా ప్ర‌క‌టించింది. అయితే కేవలం కొన్ని రోజులకే కంపెనీ దీని ధరను రూ. 15,000 తగ్గించి రూ. 44,990గా మార్చింది. అయితే ఈ ఆఫ‌ర్ కొన్ని రోజులు మాత్ర‌మే ఉంటుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది.

25
రెండు వేరియంట్స్‌లో
Image Credit : Hero website

రెండు వేరియంట్స్‌లో

హీరో Vida VX2ను రెండు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. వీటిలో ఒక‌టి VX2 Go బేసిక్ మోడల్ కాగా, VX2 Plus టాప్ ఎండ్ వెర్ష‌న్. ఈ రెండు మోడళ్ల మధ్య తేడాలు ప్రధానంగా బ్యాటరీ సామర్థ్యం, టాప్ స్పీడ్, రేంజ్, యాక్సిలరేషన్ పరంగా ఉంటాయి. ధ‌ర విష‌యానికొస్తే VX2 Go బేస్ ధ‌ర రూ. 44,990కాగా, VX2 Plus బేస్ ధ‌ర రూ. 58,000గా ఉంది.

Related Articles

Related image1
Business Idea: వేల‌లో పెట్టుబ‌డి రూ. ల‌క్ష‌ల్లో ఆదాయం.. కొబ్బ‌రి చిప్ప‌ల‌తో క‌ళ్లు చెదిరే ఆదాయం
Related image2
Savings Schemes: బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ ఇచ్చే పథకాలు.. అస్స‌లు రిస్క్ ఉండ‌దు.
35
VX2 Go ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే.?
Image Credit : Hero website

VX2 Go ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే.?

VX2 Go మోడల్‌లో 2.2 kWh రిమూవబుల్ బ్యాటరీని అందించారు. ఈ స్కూటీని ఒక్క‌సారి రీఛార్జ్ చేస్తే నాన్‌స్టాప్‌గా 92 కిలోమీట‌ర్లు దూసుకెళ్తుంది. 0 నుంచి 40 కిమీ వేగాన్ని 4.2 సెకన్లలో చేరుతుంది. ఇక ఈ స్కూటీ గ‌రిష్టంగా 70 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్తుంది. 62 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ అవుతుంది.

45
VX2 Plus ఫీచ‌ర్లు
Image Credit : @Vittadhara | X

VX2 Plus ఫీచ‌ర్లు

VX2 Plus ఫీచర్ల విష‌యానికొస్తే ఇందులో 3.4 kWh డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీలను అందించారు. ఈ స్కూటీ ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 142 కిలోమీట‌ర్లు దూసుకెళ్తుంది. కేవ‌లం 3.1 సెకన్ల‌లో 40 కిలో మీట‌ర్ల వేగాన్ని చేరుకుంటుంది. గ‌రిష్టంగా 80 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకుపోతుంది. అలాగే ఇందులో 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే, 27.2 లీటర్ల అండర్‌ సీట్ స్టోరేజ్‌ను అందించారు. ఈ స్కూటీ 62 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ పూర్త‌వుతుంది.

55
ఏడు రంగుల్లో
Image Credit : Hero website

ఏడు రంగుల్లో

అయితే ఈ రెండు స్కూటీలు బ్యాటరీ యాజ్ ఏ సబ్‌స్క్రిప్షన్ (BaaS) మోడల్‌లో లభిస్తున్నాయి. విడా వీఎక్స్ 2 ఏడు రంగులు బ్లూ, బ్లాక్, ఎల్లో, రెడ్, వైట్, ఆరెంజ్, యాష్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. అయితే బ్యాటర్ సబ్‌స్క్రిప్షన్‌తో అయితేనే పైన తెలిపిన ధ‌ర‌లు వ‌ర్తిస్తాయి. ఒక‌వేళ స‌బ్‌స్క్రిప్ష‌న్ లేకుండా అయితే ధ‌ర ఎక్కువ‌గా ఉంటుంది. పూర్తి వివ‌రాల కోసం మీకు స‌మీపంలో ఉన్న షోరూమ్‌ను సంప్ర‌దించండి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
Business Idea: వేల‌లో పెట్టుబ‌డి రూ. ల‌క్ష‌ల్లో ఆదాయం.. కొబ్బ‌రి చిప్ప‌ల‌తో క‌ళ్లు చెదిరే ఆదాయం
Recommended image2
Savings Schemes: బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ ఇచ్చే పథకాలు.. అస్స‌లు రిస్క్ ఉండ‌దు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved