TVS iQube: కొత్త అప్‌డేట్‌లతో రానున్న టీవీఎస్ ఫ్యామిలీ స్కూటర్ ఐక్యూబ్
TVS iQube: టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్ ఫ్యామిలీ స్కూటర్‌గా మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు ఐక్యూబ్ కొత్త అప్ డేట్స్ తో మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐక్యూబ్ లో కొత్త ఫీచర్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందామా?

టీవీఎస్ కంపెనీ నుంచి వచ్చిన ఐక్యూబ్ స్కూటర్ దేశంలోనే ఎక్కువ అమ్ముడయ్యే స్కూటర్లలో టాప్ లో ఉంది. చిన్న ఫ్యామిలీ హాయిగా ప్రయాణించగలిగే ఫెసిలిటీస్ అన్నీ ఇందులో ఉండటంతో ఎక్కువ మంది ఈ స్కూటర్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే టీవీఎస్ కంపెనీ కూడా మరికొన్ని కొత్త అప్ డేట్స్ తో మార్కెట్ లోకి న్యూ వెర్షన్ ను తీసుకు వస్తుందని సమాచారం. లేదా కొత్త మోడల్ నే రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
TVS తన ఎలక్ట్రిక్ ఫ్యామిలీ స్కూటర్ అయిన ఐక్యూబ్ అమ్మకాలలో ముందంజలో ఉండటంతో దీన్ని అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది రాబోయే ఏదైనా పండుగ సీజన్‌లో భారతదేశంలో విడుదల కానుందని తెలుస్తోంది. ఇందులో రెండు ఆప్షన్స్ కు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐక్యూబ్ స్కూటర్ లోనే కొన్ని అప్‌డేట్స్ ఉండవచ్చని లేదా కొత్త ఫీచర్స్ తో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకు రావచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ఐదు వేరియంట్లలో ఐక్యూబ్
రాబోయే ఐక్యూబ్ అప్‌డేట్ ఫీచర్లతో మార్కెట్ లోకి రావచ్చు. లేదా కొత్త వేరియంట్‌గా విడుదల కావచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం టీవీఎస్ భారతదేశంలో ఐక్యూబ్ ఐదు వేరియంట్‌లను విక్రయిస్తోంది. ఏప్రిల్ 2025 అమ్మకాల ప్రకారం ఈ విభాగంలో అమ్మకాలలో ముందంజలో ఉంది.
ST వేరియంట్
నివేదికల ప్రకారం రానున్న అప్‌డేటెడ్ ఐక్యూబ్ స్కూటర్.. ఈ సంవత్సరం ప్రారంభంలో భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఎస్టీ వేరియంట్‌ను పోలి ఉంటుందని సమాచారం. స్కూటర్ నీలం రంగులో, కాన్సెప్ట్ డిజైన్ ను కలిగి ఉంటుంది.
ఎక్కువ రేంజ్
రానున్న ఐక్యూబ్ స్కూటర్ పవర్‌ట్రెయిన్‌లో కొన్ని మార్పులు కూడా ఉంటాయి. ఇది మరింత సమర్థవంతంగా ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణించే రేంజ్ ను కలిగి ఉంటుంది. ఫీచర్ల జాబితాలో కూడా మార్పులు ఉండవచ్చు. TVS ఇంకా అధికారిక వివరాలను వెల్లడించలేదు. రాబోయే రోజుల్లో, అప్‌డేట్ చేయబడిన వెర్షన్ టెస్టింగ్ పూర్తవుతుందని, స్కూటర్ గురించి అదనపు వివరాలను తెలుస్తాయని టీవీఎస్ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.