స్కూటర్ కొనాలంటే ఇదే మంచి టైం: సుజుకి వాహనాలపై అదిరిపోయే సమ్మర్ ఆఫర్లు
Suzuki Summer Offers: సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కంపెనీ తన 2025 స్కూటర్లు, బైక్‌లపై ప్రత్యేకమైన సమ్మర్ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో రూ.5,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ఉచిత 10 సంవత్సరాల వారంటీ వంటి అనేక ఆఫర్లు ఉన్నాయి. అంతేకాకుండా సింపుల్ ఫైనాన్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

సుజుకి, మోటార్ సైకిల్ ఇండియా తన 2025 స్కూటర్లు, బైక్‌లపై కొత్త సమ్మర్ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో యాక్సెస్ 125, అవెనిస్, బర్గ్‌మాన్ స్ట్రీట్, జిక్సర్ ఎస్ఎఫ్ వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్ వంటివి ఉన్నాయి. ఈ పరిమిత కాల ఆఫర్‌లను సుజుకి అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రకటించింది.
క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు, సింపుల్ ఫైనాన్స్ పథకాలు వంటి ఆఫర్‌లను కంపెనీ అందిస్తోంది. మీరు గాని కొత్త స్కూటర్ కొనడానికి, లేదా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇదే మంచి టైం.
ఎక్స్ఛేంజ్ బోనస్, ఫ్రీ వారంటీ
సమ్మర్ ఆఫర్‌లో భాగంగా సుజుకి తమ పాత వాహనాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకునే కస్టమర్‌లకు రూ.5,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. అదనంగా కొనుగోలుదారులకు రూ.2,299 విలువైన 10 సంవత్సరాల వారంటీ ప్యాకేజీ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది.
ఈ వారంటీ 2 సంవత్సరాల ప్రామాణిక ప్లాన్, 8 సంవత్సరాల పొడిగించిన వారంటీని కలిగి ఉంటుంది. ఇది కస్టమర్‌లకు దీర్ఘకాలిక హామీ, నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఆఫర్లు
ఫైనాన్సింగ్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సుజుకి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ పథకం కింద కస్టమర్లు ఐడీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఈఎంఐలో స్కూటర్‌ను కొనుగోలు చేస్తే 5% లేదా రూ.5,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఎలాంటి తనఖా అవసరం లేకుండా 100% లోన్ మంజూరుకు కూడా అవకాశం ఉంది. అయితే ఈ ఆఫర్‌లు నిబంధనలకు లోబడి ఉంటాయి. సిటీ, డీలర్‌షిప్‌ను బట్టి మారవచ్చు.
యాక్సెస్ 125 మోడల్
సుజుకి అన్ని మోడళ్లలో అత్యంత ప్రజాదరణ పొందిన, అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా యాక్సెస్ 125 నిలుస్తుంది. ఇది దాని సమర్థవంతమైన పనితీరు, మెరుగైన మైలేజ్, ప్రయాణీకుల సౌకర్యం కోసం ప్రసిద్ధి చెందింది. కొత్త మోడల్ ఇప్పుడు యూరో 5+ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంది.
బ్లూటూత్ ఎనేబుల్డ్ డిజిటల్ కన్సోల్‌తో వస్తుంది. దీని ధర రూ.83,800 (ఎక్స్-షోరూమ్). యాక్సెస్ 125 స్టాండర్డ్, స్పెషల్ ఎడిషన్, రైడ్ కనెక్ట్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.
రంగులు, స్మార్ట్ ఫీచర్లు
యాక్సెస్ 125 సాలిడ్ ఐస్ గ్రీన్, పెర్ల్ షైనీ బీజ్, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నం.2 అనే ఐదు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. దాని స్టైలిష్ లుక్, అధునాతన ఫీచర్లు, ప్రస్తుత సమ్మర్ ఆఫర్‌లతో యాక్సెస్ 125 అమ్మకాల్లో ముందుంటుందని కంపెనీ భావిస్తోంది. కస్టమర్‌లు తమ సమీప సుజుకి డీలర్‌షిప్‌ను సందర్శించి ఈ సమ్మర్ బెనిఫిట్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకొని వెహికల్ కొనుక్కోండి.