లైసెన్స్ అక్కర్లేకుండానే నడిపే స్కూటర్ కావాలా? ధర కేవలం రూ.42 వేలే..
తక్కువ బడ్జెట్ లో లైట్ వెయిట్, సింపుల్ గా ఉండే స్కూటర్ కావాలంటే మీరు ఓడిస్సీ సంస్థ రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోండి. ఇది నడపాలంటే మీకు లైసెన్స్ కూడా అవసరం లేదు. హైఫై పేరుతో రిలీజ్ చేసిన ఈ స్కూటర్ ఫీచర్స్, ధర, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ఓడిస్సీ తన కంపెనీ వెహికల్స్ లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ని రిలీజ్ చేసింది. కేవలం రూ.42,000 (ఎక్స్-షోరూమ్) ధరకు లభించే హైఫై స్కూటర్ సింపుల్ ఫీచర్స్ ని కలిగి ఉంది. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లు, ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా మే 10, 2025 నుండి హైఫై స్కూటర్ అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది. మీరు కావాలంటే ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని ఓడిస్సీ సంస్థ తెలిపింది.
హైఫై స్పెసిఫికేషన్లు & ఫీచర్లు
ఓడిస్సీ సంస్థ ఎలక్ట్రిక్, ఎలక్ట్రిక్ V2 అనే 2 స్కూటర్లను అందిస్తుంది. రెండు స్కూటర్లలో 250 వాట్ మోటార్ అమర్చారు. ఇది గంటకు 25 కి.మీ వేగంతో నడుస్తుంది. అంటే, వాటిని నడపడానికి లైసెన్స్ అవసరం లేదు. ఈ హైఫై స్కూటర్ 48V, 60V బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. చూడ్డానికి చాలా చిన్నదిగా, నగరాల్లో, లోకల్ గా తిరగడానికి వీలుగా ఉంటుంది. ఇందులో అధునాతన లిథియం-అయాన్, గ్రాఫేన్ బ్యాటరీని ఉపయోగించారు.
ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 నుండి 89 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 4-8 గంటలు పడుతుంది.
అయిదు రంగుల్లో హైఫై స్కూటర్
నగర వాతావరణానికి ఈ స్కూటర్ చాలా అనుకూలం. తేలికైన, కాంపాక్ట్ డిజైన్, రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో సులభంగా నావిగేట్ చేయవచ్చు. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, LED డిజిటల్ మీటర్, రోజువారీ అవసరాలను తీర్చడానికి తగినంత బూట్ స్పేస్ ఉన్నాయి. ఈ స్కూటర్ ఐదు విభిన్న రంగులలో లభిస్తుంది. అవి రాయల్ మ్యాట్ బ్లూ, సిరామిక్ సిల్వర్, అరోరా మ్యాట్ బ్లాక్, ఫ్లేర్ రెడ్ మరియు జేడ్ గ్రీన్.
హైఫై లో V2 స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. అయితే V2+ ఒక్క ఛార్జ్‌తో 150 కి.మీ వరకు వెళతుందని కంపెనీ ప్రకటించింది. అయితే, రెండు స్కూటర్లు ఫుల్ ఛార్జింగ్ ఎక్కడానికి 3.5 గంటల సమయం తీసుకుంటాయి.
హైఫై స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 215 mm. ఈ స్కూటర్ బరువు కేవలం 88 కిలోలు. అందువల్ల ఆడవాళ్లు, యువత కూడా దీన్ని ఈజీగా నడపొచ్చు.
V2, V2+ మధ్య ప్రధాన తేడా ఏమిటంటే.. V2 1.3kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. V2+ 2.6kWh బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉంది. ఇక ప్రత్యేకంగా కీలెస్ ఆపరేషన్, ఆల్ అరౌండ్ LED లైటింగ్, రివర్స్ మోడ్ ఉన్నాయి.
ఈ స్కూటర్ చిన్నదైనా డిస్క్ బ్రేకులు కూడా కలిగి ఉంది. అందువల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ల కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.