- Home
- Business
- Top 5 Electric Vehicles: ఒక్కసారి ఛార్జ్ చేస్తే వందల కి.మీ. దూసుకుపోయే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Top 5 Electric Vehicles: ఒక్కసారి ఛార్జ్ చేస్తే వందల కి.మీ. దూసుకుపోయే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Top 5 Electric SUVs: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకి మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉంది. ఒక్క ఛార్జ్ చేస్తే వందల కి.మీ. దూసుకుపోతాయే కొత్త మోడల్స్ వస్తుండటంతో ఈ రంగం బాగా అభివృద్ధి చెందుతోంది. మీరు గాని ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనే ఆలోచనలో ఉంటే ఇక్కడ టాప్ 5 మోడల్స్ వివరాలు ఉన్నాయి. వీటి ధర, రేంజ్, ముఖ్యమైన ఫీచర్లు, సేఫ్టీ టెక్నాలజీ వివరాలను ఓ సారి పరిశీలించండి.

భారతదేశం ఆటోమొబైల్ రంగంలో దూసుకుపోతోంది. ఇక్కడ ఎలాంటి కార్లకైనా మార్కెట్ ఎక్కువగా ఉండటంతో విదేశాల నుంచి కంపెనీలు వచ్చి ఇక్కడే కార్ల తయారీ యూనిట్లు పెడుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి డిమాండ్ పెరుగుతుండటంతో వివిధ ప్రముఖ కంపెనీలు పోటాపోటీగా డిఫరెంట్ మోడల్స్ ని విడుదల చేస్తున్నాయి.
టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, మహీంద్రా & మహీంద్రా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేశాయి. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్‌తో మొదలైన ట్రెండ్ ఇప్పుడు బాగా పాపులర్ అయింది. మీరు ఎలక్ట్రిక్ SUV కొనాలనుకుంటే ఇక్కడ ఐదు ముఖ్యమైన ఆప్షన్లు ఉన్నాయి. ఓసారి పరిశీలించండి.
1. హ్యుందాయ్ క్రెటా EV
ఆటో ఎక్స్‌పో 2025లో రిలీజ్ అయిన హ్యుందాయ్ క్రెటా EV ఎక్స్ షోరూమ్ ధర రూ. 17.99 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 42 kWh, 51.4 kWh బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. 51.4 kWh మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 473 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. 42 kWh మోడల్ 390 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.
ఈ మోడల్‌లో ఈకో, నార్మల్, స్పోర్ట్స్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇది 168 హార్స్‌పవర్, 255 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొండలెక్కేటప్పుడు హిల్ డ్రైవింగ్ ఎయిడ్స్ ఉపయోగించి సులువుగా ఎక్కొచ్చు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో సహా 52 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
2. ఎంజీ ZS EV
ఎంజీ ZS EV అనేది ఇండియన్ మార్కెట్‌లోకి మొదటిగా వచ్చిన చిన్న ఇ-ఎస్‌యూవీ వెహికల్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.18.98 లక్షల నుంచి రూ. 26.63 లక్షల వరకు ఉంది. పెర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్, 50.3 kWh బ్యాటరీ, 173 హార్స్‌పవర్, 280 Nm టార్క్ కెపాసిటీని కలిగి ఉంది. 50 kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 60 నిమిషాల్లో 80% ఛార్జ్ చేయొచ్చు. పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు తొమ్మిది గంటలు పడుతుంది.
ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. చిన్న కారే అయినా 0 నుంచి 100 kmph వేగాన్ని 8.5 సెకన్లలో అందుకుంటుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, హిల్ డీసెంట్ ఎయిడ్, లేన్ అసిస్టెన్స్, ఫ్రంటల్ కొలిషన్ అవాయిడెన్స్ వంటి 17 లెవెల్-2 ADAS ఫీచర్లు ఉన్నాయి.
3. టాటా నెక్సాన్ EV
టాటా నెక్సాన్ EVలో పది వేర్వేరు మోడల్స్ ఉన్నాయి. దీని ధర రూ. 12.49 లక్షల నుంచి మొదలవుతుంది. టాటా రెండు బ్యాటరీ ఆప్షన్లు ఇస్తోంది. లాంగ్ రేంజ్ 45 kWh బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 489 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. 0 నుంచి 100 kmph వేగాన్ని 8.9 సెకన్లలో అందుకుంటుంది.
30 kWh ప్యాక్‌తో మిడ్-రేంజ్ బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 275 కి.మీ. దూరం వరకు వెళ్తుంది. ఇది 0 నుంచి 100 kmph వేగాన్ని 9.2 సెకన్లలో అందుకుంటుంది. నెక్సాన్ EVలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో ABS, ఆటో హోల్డ్‌తో EPB, ESC, హిల్ డ్రైవింగ్ ఎయిడ్స్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
4. మహీంద్రా BE 6
మహీంద్రా BE 6 ఐదు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 19.40 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ కారులో 59 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది ఇంగ్లో(INGLO) ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. BE 6లో స్టాండర్డ్ గ్లాస్ పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్‌ప్లేలు, వేరియబుల్ గేర్ రేషియో ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రీజెనరేటివ్ బ్రేకింగ్ ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, బ్లైండ్ వ్యూ మానిటర్, 360 డిగ్రీల కెమెరా, రెండో వరుసలో ISOFIX మౌంట్లు, ఐదు రేడార్లు, కెమెరాతో పనిచేసే లెవెల్ 2+ ADAS సూట్ సేఫ్టీ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
5. టాటా కర్వ్ EV
టాటా కర్వ్ EV రూ.17.49 లక్షల ప్రారంభ ధరతో మూడు వేర్వేరు మోడల్స్, రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో మార్కెట్ లో లభిస్తుంది. ఇది 165 హార్స్‌పవర్ ఎలక్ట్రిక్ మోటార్, 45 kWh ప్యాక్‌తో 501 కి.మీ. దూరం వరకు వెళ్తుంది. 55 kWh మోడల్ పూర్తిగా ఛార్జ్ చేస్తే 585 కి.మీ. దూరం వరకు వెళ్తుంది.
కర్వ్ EVలో లైటింగ్ లోగోతో మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉంది. దీని కాక్‌పిట్‌లో 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.2 ఇంచ్ హార్మన్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉన్నాయి. కర్వ్ EVలో అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ఇచ్చారు. సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.