MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Silver Price: ఏకంగా లక్ష రూపాయలు పడిపోయిన వెండి, అదే దారిలో బంగారం కూడా

Silver Price: ఏకంగా లక్ష రూపాయలు పడిపోయిన వెండి, అదే దారిలో బంగారం కూడా

Silver Price: వెండి, బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలను భయపెట్టేసాయి. ఇప్పుడు ఒక్కసారిగా తగ్గిపోతూ ఆశ్చర్యపెడుతున్నాయి. వెండి ధరల్లో ఒక్కసారిగా భారీ పతనం చోటుచేసుకుంది. బంగారం కూడా అలాగే తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 01 2026, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వెండ ధరలు ఢమాల్
Image Credit : Getty

వెండ ధరలు ఢమాల్

మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా చూసుకుంటే బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరుగుతూ వచ్చాయి. రికార్డ్ స్థాయిలో ట్రేడ్ అవుతూ విలువైన లోహాలుగా మారిపోయాయి. దీంతో ఎంతో మంది వీటిపై పెట్టుబడి పెట్టారు. అకస్మాత్తుగా వెండి ధరలు అత్యంత వేగంగా భారీ పతనాన్ని చూసాయి. ఏకంగా లక్ష రూపాయలు కిందకు పడిపోయాయి. దీంతో వాటిపై పెట్టుబడి పెట్టిన వారంతా కుదేలైపోయారు. ఇప్పుడు వెండి ధర కిలో ఏకంగా లక్ష రూపాయల వరకు పడిపోయింది. ఇలా భారీ పతనాన్ని వెండి చూడడం ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వెండి ధరల దారిలోనే బంగారం కూడా నడుస్తుందని ఎంతోమంది ఆశిస్తున్నారు.

24
ధరలు ఎందుకు తగ్గాయి
Image Credit : Getty

ధరలు ఎందుకు తగ్గాయి

వెండి ధరలు.. బంగారంతో పోలిస్తే ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. ఎందుకు అంతగా భారీ పతనానికి గురి అయ్యాయో చాలామందికి అర్థం కాలేదు. దీనికి నిపుణులు అనేక కారణాలు చెబుతున్నారు. వెండి ధరలు అత్యధికంగా పెరగడం వల్ల పెట్టుబడిదారులు భారీ లాభాలను పొందారు. ఇప్పుడు ఆ లాభాలను క్యాష్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున అమ్మకాలు చేపట్టారు. ఇక రెండో కారణం వెండికి ఉన్న ఇండస్ట్రియల్ డిమాండ్. వెండిని కేవలం పెట్టుబడి కోసం మాత్రమే కాదు .. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానల్స్, బ్యాటరీలు వంటి పరిశ్రమల్లో కూడా అధికంగా వాడతారు. పరిశ్రమల డిమాండ్ తగ్గుతుందేమోనన్న అంచనాలు, ఆర్థిక వృత్తిపై అనిశ్చితి ఏర్పడడం అనేది వెండి ధరలపై ప్రభావం పడింది. అలాగే వెండి మార్కెట్ పరిమాణం బంగారంతో పోలిస్తే చాలా చిన్నది. అమ్మకాలు ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ధరలు పెరిగి.. పడిపోవడం సహజమేనని నిపుణులు చెబుతున్నారు. అలాగే అమెరికన్ డాలర్ బలపడడం కూడా వెండి ధరల పతనానికి కారణం కావచ్చు అని అంటున్నారు. ఎప్పుడైతే డాలర్ బలంగా ఉంటుందో బంగారం, వెండి వంటి లోహాలపై పెట్టుబడులు తగ్గిపోతాయి.

Related Articles

Related image1
Gas Prices: బడ్జెట్‌కు ముందే షాకిచ్చిన గ్యాస్ ధరలు, ఏకంగా 50 రూపాయల పెంపు
Related image2
Viral news: ఉల్లిపాయ వెల్లుల్లి తిననని బెట్టు చేసిన భార్య.. విడాకులిచ్చిన కోర్టు
34
బంగారంపై పదివేల రూపాయలు
Image Credit : Getty

బంగారంపై పదివేల రూపాయలు

ఇక బంగారం విషయానికి వస్తే బడ్జెట్ వేళ బంగారం ధరలు కూడా దాదాపు పతనమయ్యాయని చెప్పాలి. నిన్న లక్షా అరవై వేల రూపాయల దగ్గర ఉన్న బంగారం ఈరోజు లక్షా నలభై అయిదు వేల రూపాయలకు పడిపోయింది. 10 గ్రాముల బంగారంపై ఏకంగా 10 వేల రూపాయలకు పైగా పడిపోయింది. ఇలాగే కొనసాగితే బంగారం, వెండి రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది. ఇలా తగ్గితే మళ్ళీ సామాన్య ప్రజలకు ఈ రెండు లోహాలు అందుబాటులోకి రావచ్చు.

44
ప్రస్తుతం బంగారం ధరలు
Image Credit : Getty

ప్రస్తుతం బంగారం ధరలు

ప్రస్తుతం బంగారం ధరలు 22 క్యారెట్ల గోల్డ్ 14,720 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర 16,058 రూపాయలుగా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.12044 గా ఉంది. వీటి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. అలా తగ్గితే సామాన్య ప్రజలు బంగారం తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
బంగారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
Gas Prices: బడ్జెట్‌కు ముందే షాకిచ్చిన గ్యాస్ ధరలు, ఏకంగా 50 రూపాయల పెంపు
Recommended image2
Viral news: ఉల్లిపాయ వెల్లుల్లి తిననని బెట్టు చేసిన భార్య.. విడాకులిచ్చిన కోర్టు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved