MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gas Prices: బడ్జెట్‌కు ముందే షాకిచ్చిన గ్యాస్ ధరలు, ఏకంగా 50 రూపాయల పెంపు

Gas Prices: బడ్జెట్‌కు ముందే షాకిచ్చిన గ్యాస్ ధరలు, ఏకంగా 50 రూపాయల పెంపు

Gas Prices: కేంద్ర బడ్జెట్‌కు ముందే ఖర్చుల భారం పెరిగింది. గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. అది కూడా సిలిండర్ పై 50 రూపాయలు. కాకపోతే ఇది గృహ వినియోగదారులకు కాదు కమర్షియల్ గా వాడే వారికి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 01 2026, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యాభై రూపాయల పెంపు
Image Credit : Getty

యాభై రూపాయల పెంపు

కేంద్ర బడ్జెట్‌కి ఒక రోజు ముందే గ్యాస్ ధరలు పెరిగాయి. ఫిబ్రవరి 1 నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఒక్కో సిలిండర్ పై 50 రూపాయలు పెంచారు. కాకపోతే ఇది సాధారణ గృహ వినియోగదారులకు కాదు.. హోటల్లో, రెస్టారెంట్, టిఫిన్ సెంటర్లు పెట్టుకొని నడిపే వారికి వర్తిస్తాయి. వీరు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ తీసుకుంటే దాని ధర ఇకపై 50 రూపాయలు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచే ఈ పెంపు అమల్లోకి వచ్చింది. అయితే గృహ వినియోగదారులు వాడే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇది సాధారణ ప్రజలకు ఊరట ఇచ్చే విషయంగానే చెప్పుకోవాలి.

24
ఎంత చెల్లించాలి
Image Credit : Getty

ఎంత చెల్లించాలి

గ్యాస్ సిలిండర్ ధరలు పరిశీలిస్తే ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1740కు చేరుకుంది. అదే ముంబైలో రూ.1690కు పైగా చెల్లించాల్సి వస్తుంది. ఇక చెన్నైలో రూ.1900 కు దగ్గరగా ఉంది. నగరం నగరానికి రవాణా ఖర్చులు, స్థానిక పన్నులు ఆధారంగా ఈ స్వల్ప తేడాలు కనిపిస్తాయి. అలాగే ప్రతినెలా అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు, రూపాయి విలువ, దిగుమతి ఖర్చులను బట్టి ఎల్పీజీ ధరలను ప్రతినెలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సమీక్షించి పెంచడం, తగ్గించడం వంటివి చేస్తాయి.

Related Articles

Related image1
Pistol killed Gandhi: గాంధీని చంపేందుకు గాడ్సే వాడిన తుపాకీ ఇప్పుడు ఎక్కడ ఉంది?
Related image2
Viral news: ఉల్లిపాయ వెల్లుల్లి తిననని బెట్టు చేసిన భార్య.. విడాకులిచ్చిన కోర్టు
34
వీరిపైనే భారం
Image Credit : Getty

వీరిపైనే భారం

ఇప్పుడు పెంచిన గ్యాస్ ధరలు నేరుగా హోటల్, రెస్టారెంట్ రంగంపై పడుతుంది. ఇప్పటికే కూరగాయలు, నూనె, పప్పులు, బియ్యం వంటి నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి వారు అమ్మే టిఫిన్లు, భోజనాలు, టీ కాఫీల ధరలు పెరిగే అవకాశం ఉంది. వీటి భారం మళ్లీ ప్రజల మీదే పడుతుంది. ఇకరోడ్డు పక్కన ఫుడ్ స్టాల్, బండిపై హోటల్ పెట్టుకునే వారికి మాత్రం ఇది పెద్ద భారంగా మారే అవకాశం ఉంది. అయితే ఇంట్లో వంట చేసుకునే వారికి మాత్రం ఎలాంటి ప్రత్యక్ష ప్రభావం ఉండదు.

44
బడ్జెట్ ఏం చెబుతారో?
Image Credit : Getty

బడ్జెట్ ఏం చెబుతారో?

ప్రభుత్వ బడ్జెట్లో గ్యాస్ సబ్సిడీలు, ఇంధన ధరలపై ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకుంటుందో లేదో ఇంకా తేలాల్సి ఉంది. గత కొంతకాలంగా అయితే ఇంట్లో వాడే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా అవి అలాగే ఉంటాయని ఆశాభావం ఎక్కువ మంది ప్రజల్లో ఉంది. మొత్తంగా చూసుకుంటే బడ్జెట్ కు ముందే కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరగడం మాత్రం వ్యాపార వర్గాల్లో కొంచెం కలవరం సృష్టించింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
Pistol killed Gandhi: గాంధీని చంపేందుకు గాడ్సే వాడిన తుపాకీ ఇప్పుడు ఎక్కడ ఉంది?
Recommended image2
Viral news: ఉల్లిపాయ వెల్లుల్లి తిననని బెట్టు చేసిన భార్య.. విడాకులిచ్చిన కోర్టు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved