Credit Score: ఈ ఐదు పనులతో మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది
5 important ways to improve your credit score: కొన్ని పనులతో మీరు మీ క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు. అయితే, దానికంటే ముందు మీరు క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు, వాటి ప్రాముఖ్యత, మెరుగుపరిచే మార్గాలు తెలుసుకోవాలి.

Credit Score improve Tips : క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటో, అది ఎలా పనిచేస్తుందో చాలామందికి పూర్తిగా స్పష్టంగా తెలియకపోయినా, ఇది వ్యక్తి ఆర్థిక స్థితిని మిర్రర్ లాగా చూపించే కీలక సాధనంగా పనిచేస్తుంది. క్రెడిట్ స్కోర్ అనేది ఒక సంఖ్య, ఇది మీరు ఎంతవరకు అప్పు తిరిగి చెల్లించగలరనే నమ్మకాన్ని సూచిస్తుంది. ఇది లోన్ అప్రూవల్, వడ్డీ రేట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
కాబట్టి ఇక్కడ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరిచేందుకు గుర్తుంచుకోవలసిన ఐదు ముఖ్య అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. చెల్లింపుల హిస్టరీ ప్రధానమైన అంశం (Payment History)
మీరు బిల్లులు సమయానికి చెల్లిస్తారా లేదా అనేది క్రెడిట్ స్కోర్‌లో అత్యధిక ప్రాధాన్యత పొందిన అంశం. ఒక్కసారి పేమెంట్ మిస్ అయితే అది సంవత్సరాలపాటు స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆటోమెటిక్ పేమెంట్లు లేదా రిమైండర్లు ఉపయోగించి సమయానికి చెల్లింపులు చేయడం ద్వారా పాజిటివ్ హిస్టరీ వుంటుంది.
2. క్రెడిట్ వినియోగం తక్కువగా ఉంచండి (Credit Utilization)
మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్ మొత్తంలో ఎంత వాడుతున్నారో చూపే శాతం ఇది. 30% లోపు ఉంచడం ఉత్తమం. ఎక్కువగా వినియోగించటం ఆర్థిక ఒత్తిడిని సూచించే అవకాశం ఉంది. ఖర్చులను ట్రాక్ చేయడం, సమయానికి బ్యాలెన్స్ చెల్లించడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు.
3. క్రెడిట్ హిస్టరీ వ్యవధి ముఖ్యం (Length of Credit History) మీరు ఎంతకాలంగా క్రెడిట్ ఉపయోగిస్తున్నారనే అంశం కూడా స్కోర్‌లో భాగం. పాత ఖాతాలను మూసివేయకుండానే, వాటిలో అల్ప స్థాయిలో చలనం కొనసాగించడం ద్వారా పొడవైన క్రెడిట్ చరిత్రను కాపాడుకోవచ్చు.
4. క్రెడిట్ మిక్స్ (Credit Mix)
ఇన్‌స్టాల్మెంట్ లోన్లు, క్రెడిట్ కార్డులు, రిటైల్ ఖాతాలు వంటి వివిధ రకాల అప్పులను సమర్థవంతంగా నిర్వహించగలగటం క్రెడిట్ స్కోర్‌కు లాభకరం. ఇది మీరు విభిన్న రకాల అప్పులను నిర్వహించగలగతారని సూచిస్తుంది.
5. క్రెడిట్ అభ్యర్థనలు పరిమితంగా ఉంచండి (New Credit Inquiries):
కొత్త క్రెడిట్ కోసం చేసిన ప్రతి అప్లికేషన్‌తో క్రెడిట్ నివేదికపై "ఇంక్వైరీ" జరుగుతుంది. 6 నెలల వ్యవధిలో ఎక్కువగా చేస్తే స్కోర్ తక్కువగా మారే అవకాశం ఉంది. అవసరమైనప్పుడు మాత్రమే అప్లై చేయడం మంచిది.
ఈ ఐదు అంశాలను బాగా తెలుసుకుని, వాటిని పాటిస్తే, మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను స్థిరంగా మెరుగుపరుచుకోవచ్చు, తద్వారా ఆర్థికంగా మేలైన అవకాశాలను పొందవచ్చు.