MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Double Elimination: బిగ్‌ బాస్‌ తెలుగు 9 డబుల్‌ ఎలిమినేషన్‌, 14వ వారం ఈ ఇద్దరు ఔట్‌.. టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే

Double Elimination: బిగ్‌ బాస్‌ తెలుగు 9 డబుల్‌ ఎలిమినేషన్‌, 14వ వారం ఈ ఇద్దరు ఔట్‌.. టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ చివరి వారం అయిన 14 వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో తేలిపోయింది. డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండబోతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 13 2025, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్‌ బాస్‌ తెలుగు 9 14వ వారం ఎలిమినేషన్‌
Image Credit : Youtube/StarMaa

బిగ్‌ బాస్‌ తెలుగు 9 14వ వారం ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ 14వ వారం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. టికెట్‌ టూ ఫినాలేలో కళ్యాణ్‌ పడాల విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌ తొలి ఫైనలిస్ట్ గా కళ్యాణ్‌ నిలిచారు. ఈ వారం సెకండ్‌ ఫైనల్‌కి సంబంధించిన టాస్క్ లు జరిగాయి. ఇందులో ఇమ్మాన్యుయెల్‌ విన్నర్‌గా నిలిచారు. ఆయన రెండో ఫైనలిస్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు టాప్‌ 5 కంటెస్టెంట్లు ఎవరు? ఇప్పటికే ఇద్దరు కన్ఫమ్‌ అయిన నేపథ్యంలో మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేవారెవరనేది కూడా క్యూరియాసిటీగా మారింది. 

25
ఈ వారం నామినేషన్‌లో ఉన్నది వీరే
Image Credit : youtube/@starmaa

ఈ వారం నామినేషన్‌లో ఉన్నది వీరే

 ఈ వారం కళ్యాణ్‌ తప్ప తనూజ, ఇమ్మాన్యుయెల్‌, భరణి, సుమన్‌ శెట్టి, సంజనా, డీమాన్‌ పవన్‌ నామినేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం టాస్క్ ల్లో విజయం సాధించి ఇమ్ము సేఫ్‌లో ఉన్నాడు. డీమాన్‌ పవన్‌కి కూడా మంచి ఓటింగ్‌ పడుతుంది. దీంతో సంజనా, భరణి, సుమన్‌ శెట్టిల మధ్యనే ఎలిమినేషన్‌ ఉండబోతుందని అంతా భావించారు. ఈ క్రమంలో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యింది ఎవరనేది ఓ క్లారిటీ వచ్చింది. అదే సమయంలో టాప్‌ 5 కంటెస్టెంట్లు కూడా ఫైనల్‌ అయినట్టు సమాచారం. ఎలిమినేట్‌ అయ్యింది ఎవరో తెలిస్తే, ఆటోమెటిక్‌గా ఫైనలిస్ట్ కూడా ఎవరనేది తేలుస్తుంది. 

Related Articles

Related image1
Venkatesh Top 10 Movies: తప్పక చూడాల్సిన వెంకటేష్‌ టాప్‌ 10 మూవీస్‌.. ఇలాంటి రికార్డు ఉన్న ఒకే ఒక్క హీరో
Related image2
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?
35
ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌
Image Credit : youtube/@JioHotstarTelugu

ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌

ఇక ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండబోతుంది. బిగ్‌ బాస్‌ షోకి ఇదే చివరి వారం కావడంతో ప్రస్తుతం హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్న నేపథ్యంలో ఇద్దరిని ఎలిమినేట్‌ చేయాల్సి వస్తుంది. అందుకే మొదటగా సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌ అయినట్టు సమాచారం. చాలా రోజులుగా సుమన్‌ శెట్టికి తక్కువ ఓటింగ్‌ పడుతుంది. ఆయన గేమ్స్, టాస్క్ ల్లోనూ యాక్టివ్‌గా కనిపించడం లేదు. డల్‌గా ఉంటున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా చేయడం లేదు. దీంతో ఆయనకు పడే ఓటింగ్‌ భారీగా పడిపోయినట్టు సమాచారం. అందులో భాగాంగానే ఈ వారం మొదటి ఎలిమినేషన్‌ సుమన్‌ శెట్టి అని తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఇది కన్ఫమ్‌ అయినట్టు సమాచారం.

45
రెండో ఎలిమినేషన్‌ భరణి ?
Image Credit : youtube/@JioHotstarTelugu

రెండో ఎలిమినేషన్‌ భరణి ?

ఇక  మరో ఎలిమినేషన్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. సంజనా, డీమాన్‌ పవన్‌, భరణిల మధ్యనే ఈ ఎలిమినేషన్‌ ఉంటుందని భావిస్తున్నారు. అయితే తెలుస్తోన్న లేటెస్ట్ సమాచారం మేరకు డబుల్‌ ఎలిమినేషన్‌గా భరణి అని టాక్‌. ఆయన టాప్‌ 5లో ఉంటారనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఎందుకంటే ఆ మధ్య నాగార్జుననే నిహారికతో చెప్పిన మాటలు లీక్‌ అయ్యాయి. ఆయన చెప్పినదాన్ని ప్రకారం భరణిని టాప్‌ 5లో ఉంచుతారని అనుకున్నారు. కానీ ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌లో భాగంగా ఆయన్ని ఎలిమినేట్‌ చేసినట్టు సమాచారం.

55
టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరేనా?
Image Credit : youtube/@JioHotstarTelugu

టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరేనా?

తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ వారం సుమన్‌ శెట్టి, భరణి  హౌజ్‌ని వీడబోతున్నారట. ఇది కాకుండా ఏదైనా లీస్ట్ కేసులో సంజనాగానీ, డీమాన్‌ పవన్‌లో ఒకరిని ఎలిమినేట్‌ చేసే అవకాశం ఉంది. కానీ 99శాతం దీనికి స్కోప్‌ లేదని టాక్‌. ఈ లెక్కన ఇప్పుడు కళ్యాణ్‌ పడాల, ఇమ్మాన్యుయెల్‌, తనూజ, డీమాన్‌ పవన్‌, సంజనా టాప్‌ 5 కంటెస్టెంట్లుగా ఎంపిక కాబోతున్నట్టు సమాచారం. ఇక వీరి మధ్యనే టైటిల్‌ పోరు సాగనుంది. ఈ సారి ఇమ్మాన్యుయెల్‌ని విన్నర్‌ని చేయబోతున్నారని సమాచారం. లీస్ట్ కేసులో కళ్యాణ్‌ పడాలకు ఉంటుందని టాక్‌. ఏం జరుగుతుందో మరో వారంలో తేలిపోనుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్ కంటే వయసులో చిన్నదైనా.. ఆయనకు తల్లిగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
SuperStar Krishna కి చుక్కలు చూపించిన వెంకటేష్‌.. `సంక్రాంతి` దెబ్బకి అడ్రస్‌ లేకుండా పోయిన సినిమాలివే
Recommended image3
సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
Related Stories
Recommended image1
Venkatesh Top 10 Movies: తప్పక చూడాల్సిన వెంకటేష్‌ టాప్‌ 10 మూవీస్‌.. ఇలాంటి రికార్డు ఉన్న ఒకే ఒక్క హీరో
Recommended image2
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved