MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు పరమ పిసినారులు

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు పరమ పిసినారులు

న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టినవారు పరమ పిసినారులు. వారు ఇతరుల కోసమే కాదు.. తమ కోసం  రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడతారు.  

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 04 2025, 06:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Birth Date
Image Credit : Gemini

Birth Date

న్యూమరాలజీ మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మనం పుట్టిన తేదీ ఆధారంగా మన భవిష్యత్తు మాత్రమే కాదు..  వ్యక్తి స్వభావం, గుణం, ఇష్టాయిష్టాలు, అలవాట్లు వంటివి కూడా తెలుసుకోవచ్చు. కాగా, కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారు పిసినారి సంఘానికి అధ్యక్షులు అవుతారట. మరి, ఆ తేదీలేంటో చూద్దామా…

25
రూపాయి కూడా ఖర్చు చేయరు..
Image Credit : Gemini

రూపాయి కూడా ఖర్చు చేయరు..

కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారు డబ్బు విషయంలో చాలా కరెక్ట్ గా ఉంటారు. రూపాయి ఖర్చు పెట్టాలన్నా వంద సార్లు ఆలోచిస్తారు. తమ కోసం తాము ఎదైనా కొనుక్కోవాలన్నా వారికి మనసు రాదు. ఇక వేరే వాళ్ల కోసం అయితే… ప్రాణం పోయినా కూడా రూపాయి ఖర్చు పెట్టరు. మరీ తప్పదు అంటే తప్ప.. జేబులో నుంచి రూపాయి బయటకు తీయరు. 

వీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికీ లెక్క వేసుకుంటారు. ప్లాన్ ప్రకారం మాత్రమే ఖర్చు చేస్తారు.  సంపాదించిన ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు.  అయితే.. వీరి మనసు మాత్రం చాలా మంచిది. డబ్బు సహాయం తప్ప.. వేరే ఏ సహాయం అయినా ఇతరులకు చేయడానికి ముందుకు వస్తారు.

సంపాదించిన డబ్బు ఎంత ఎక్కువ దాచి పెట్టాం అనేదే వీరి జీవిత ఆశయం గా జీవిస్తూ ఉంటారు. పిసినారి అంటూ ఇతరులు ఏడిపించినా వీరు పెద్దగా పట్టించుకోరు

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన ఒక్క ఫ్రెండ్ ఉన్న చాలు.. మీ లైఫ్ మారిపోతుంది!
Related image2
Zodiac signs: ఈ రాశులవారు ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే.. అందులో తిరుగుండదు..!
35
వారు పుట్టిన తేదీ ఎప్పుడంటే...
Image Credit : Gemini

వారు పుట్టిన తేదీ ఎప్పుడంటే...

జ్యోతిష్యం, numerology ప్రకారం 4, 8, 13, 17, 22, 26, 31 తేదీల్లో పుట్టినవాళ్ళు పిసినారులు. జీవితంలో ఏదైనా ఖర్చు పెట్టాలంటే ప్లాన్ చేసుకుంటారు. అనవసర ఖర్చు అంటే వీళ్ళకి నచ్చదు. ఇతరులు ఖర్చు పెడితే కొందరికి అసూయ కూడా కలుగుతుంది. ముఖ్యంగా శని ప్రభావం ఉన్న 8, 17, 26 తేదీల్లో పుట్టినవాళ్ళు డబ్బు విషయంలో చాలా కంట్రోల్ గా ఉంటారు.

45
అతి జాగ్రత్త..
Image Credit : Gemini

అతి జాగ్రత్త..

ఈ తేదీల్లో పుట్టినవాళ్ళు Earth Element లేదా Saturn Influence కలిగి ఉంటారు. వీళ్ళ జీవితంలో ఏదీ సులువుగా రాదు. ప్రతిదానికీ కష్టపడాలి. అందుకే వీళ్ళు ఎక్కువగా భద్రతా భావంతో ఉంటారు. జాగ్రత్తగా ఉండటంలో తప్పు లేదు. కానీ.. వీళ్లు అతి జాగ్రత్తతో ఉంటారు.  'ఈ రోజు ఉంది, రేపు ఉండదేమో' అనే భయం వీళ్ళలో ఉంటుంది. అందుకే.. వీరి ప్రతి ఆలోచనా రేపటి కోసం మాత్రమే ఉంటుంది. ఈ రోజు కష్టపడినా.. రేపు ఇబ్బంది పడకూడదు అనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది.

వీళ్ళు పిసినారులంటే అసలు ఖర్చు పెట్టరని కాదు. వాళ్ళు అద్దె, EMI, పెట్టుబడుల విషయంలో మంచి ప్రణాళిక కలిగి ఉంటారు. అప్పులు చేయడం ఇష్టపడరు. నష్టాలు వచ్చే చోట్లను గుర్తించి దూరంగా ఉంటారు. పొదుపు ఆధారంగా వ్యాపారంలో రాణిస్తారు.

55
సంతోషాలను పక్కన పెడతారు..
Image Credit : istocks

సంతోషాలను పక్కన పెడతారు..

ఖర్చుల కంట్రోల్ లో సుఖాన్ని మర్చిపోతారు. కఠిన నియంత్రణ వల్ల జీవితం కష్టమవుతుంది. సంతోషాన్ని వాయిదా వేసే అలవాటు ఉంటుంది. కుటుంబానికి దగ్గరగా ఉండడంలో ఇబ్బంది పడతారు.

మీ చెెప్పిన తేదీల్లో మీరు కూడా పుట్టి ఉంటే.. డబ్బు విషయంలో మీకు  కంట్రోల్, ప్లానింగ్, పొదుపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది మంచిదా, చెడ్డదా అనేది మీ దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. పిసినారితనం తప్పు కాదు. కానీ జీవితంలో కొన్ని సంతోషాలు ఖర్చులలోనే ఉంటాయని మర్చిపోకండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన ఒక్క ఫ్రెండ్ ఉన్న చాలు.. మీ లైఫ్ మారిపోతుంది!
Recommended image2
Zodiac signs: ఈ రాశులవారు ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే.. అందులో తిరుగుండదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved