MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Ketu Effects: కేతువు చెడు దృష్టి.. ఈ 4 రాశులవారికి కష్టకాలం మొదలైనట్లే!

Ketu Effects: కేతువు చెడు దృష్టి.. ఈ 4 రాశులవారికి కష్టకాలం మొదలైనట్లే!

జ్యోతిష్య శాస్త్రంలో కేతువు ముఖ్యమైన ఛాయాగ్రహం. కేతువు ఆధ్యాత్మికత, విరక్తి, గత జన్మల ఫలితాలకు ప్రతీక. కేతువు ప్రస్తుతం మఖ నక్షత్రంలో సంచరిస్తోంది. కేతువు చెడు దృష్టి వల్ల 4 రాశులవారికి కష్టాలు తప్పవంటున్నారు పండితులు. మరి ఆ రాశులేవో తెలుసుకుందామా..

2 Min read
Author : Kavitha G
Published : Apr 20 2026, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మఖ నక్షత్రంలో కేతువు సంచారం
Image Credit : Asianet News

మఖ నక్షత్రంలో కేతువు సంచారం

జ్యోతిష్య శాస్త్రంలో పాప గ్రహంగా చెప్పే కేతువు తన సొంత నక్షత్రమైన మఖలో సంచరిస్తోంది. ఈ ఏడాది చివరి వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతుంది. అయితే కేతువు చెడు దృష్టి కారణంగా కొన్ని రాశులవారికి చెడు ఫలితాలు ఉంటాయంటున్నారు జ్యోతిష్య పండితులు. మరి ఆ రాశులేవో, ఏ విషయాల్లో వారు జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

25
మేష రాశి
Image Credit : Getty images

మేష రాశి

మేష రాశివారు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. డబ్బు విషయంలో అస్సలు రిస్క్  తీసుకోవద్దు.  పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు రావచ్చు. విద్యార్థులు విజయం సాధించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది.

Related Articles

Related image1
Vastu Plants: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవే!
Related image2
Weekly Horoscope: ఈ వారం ఈ 4 రాశులవారు ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచి ఫలితాలు!
35
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారు పని, వ్యాపారం లేదా కెరీర్‌లో అకస్మాత్తుగా పతనం చూసే అవకాశం ఉంది. దాని నుంచి కోలుకోవడం చాలా కష్టమవుతుంది. జీవితం అస్తవ్యస్తంగా మారవచ్చు. ఈ సమయంలో జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది. బాధ్యతలు పెరగవచ్చు. మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాలలో పై అధికారులతో విభేదాలు మీకు నష్టాన్ని కలిగించవచ్చు. వ్యాపార పోటీదారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. 

45
కుంభ రాశి
Image Credit : Getty

కుంభ రాశి

కుంభ రాశివారికి ఇప్పటికే ఏలినాటి శని నడుస్తోంది. కేతువు సంచారం ఈ రాశి వారిని మరింత బాధపెడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు మంచిదికాదు. సంబంధాలలో అపార్థాలు తలెత్తవచ్చు. ఇది వైవాహిక జీవితంపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో ఇతరులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. 

55
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

జ్యోతిష్య నిపుణుల ప్రకారం మీన రాశివారికి ప్రస్తుతం ఏలినాటి శని రెండో దశ నడుస్తోంది.కేతువు వీరికి మరింత దుఃఖాన్ని, ఆందోళనను కలిగిస్తాడు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. గాయాలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీన రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల వాహనాన్ని నడపడం మంచిదికాదు. ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండటం మంచిది.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Shani Mahardasha: మొదలైన శని మహర్దశ.. 19ఏళ్ల పాటు ఈ రాశులకు తిరుగులేదు..!
Recommended image2
Venus Blessings: శుక్రుడి దయతో ఈ 4 రాశులవారికి ధన యోగం మొదలు, ఆరోజు వరకు వీరికి తిరుగే ఉండదు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ రాశివారు డబ్బు విషయంలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Related Stories
Recommended image1
Vastu Plants: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవే!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఈ 4 రాశులవారు ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచి ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved