- Home
- Astrology
- Venus Blessings: శుక్రుడి దయతో ఈ 4 రాశులవారికి ధన యోగం మొదలు, ఆరోజు వరకు వీరికి తిరుగే ఉండదు
Venus Blessings: శుక్రుడి దయతో ఈ 4 రాశులవారికి ధన యోగం మొదలు, ఆరోజు వరకు వీరికి తిరుగే ఉండదు
Venus Blessings: శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించాడు. దీని వల్ల మాళవ్య రాజయోగం ఏర్పడింది. ఏప్రిల్ 19 నుంచి మే 14 వరకు ఈ రాజయోగం ఉంటుంది. ఈ సమయంలో 4 రాశుల వారికి ధన యోగం పట్టబోతోంది. ఆ రాశులేవో చూసుకోండి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్రుడి వల్ల మంచి సమయం వచ్చేసింది. ఏప్రిల్ 19 నుంచి మే 14 వరకు వీరికి ఆపడం ఎవరితరం కాదు. ఈ కాలం చాలా శక్తివంతమైనది. ఈ రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వీరికి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. పెరుగుతున్న ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుని లాభాలు పొందుతారు. హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ లేదా నగల వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
శుక్రుడి సంచారం కర్కాటక రాశి వారికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు దాదాపు పరిష్కారమవుతాయి. ఈ రాశి వారికి ఊహించని ఆదాయం వస్తుంది. ఎంతో కాలంగా ఆగిపోయిన లాభాలు ఇప్పుడు మళ్లీ రావడం మొదలవుతుంది. వీరికి తెలివి పెరుగుతుంది. పెట్టుబడుల గురించి తెలివిగా ఆలోచించి లాభాలను పెంచుకుంటారు. విదేశీ వాణిజ్యం లేదా ఆన్లైన్ వ్యాపారం చేసే వారికి పెద్ద డీల్స్ వచ్చే అవకాశం ఉంది.
కన్య రాశి
శుక్రుని సంచారం కన్యా రాశి వారికి ఆర్థిక పురోగతి అందుతుంది. సృజనాత్మక రంగాల్లో విజయాన్ని అందిస్తుంది. ఈ రాశిలోని ఉద్యోగులకు ప్రమోషన్లు లేదా బోనస్లు పొందే అవకాశాలు ఉన్నాయి. వీరికి పనిభారం ఉన్నప్పటికీ ఈ రాశి వారు అదనపు బాధ్యతలు తీసుకుంటారు. అయినా వీరికి మంచి ఫలితాలు దక్కుతాయి. వీరికి సరైన గుర్తింపు లభిస్తుంది. కళ, డిజైనింగ్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారు తమ ప్రతిభను ఉపయోగించి మంచి ఆదాయం సంపాదించగలరు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఊహించని ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. స్టాక్ మార్కెట్ లేదా స్పెక్యులేటివ్ పెట్టుబడులు పెట్టేవారు మంచి లాభాలు పొందుతారు. ఈ రాశి వారు తమ దూరదృష్టికి ఇప్పుడు మరింత పదును పెడతారు. వీరు గతంలో కంటే లోతుగా ఆలోచిస్తారు. కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్నారు.

