MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Venus Transit: త్వరలో శుక్రుడి సంచారం.. ఈ 3 రాశులకు లక్ష్మీ యోగం.. పట్టిందల్లా బంగారమే!

Venus Transit: త్వరలో శుక్రుడి సంచారం.. ఈ 3 రాశులకు లక్ష్మీ యోగం.. పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం మన జీవితంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. త్వరలో శుక్రుడి సంచారం జరగనుంది. శుక్రుడి రాశిమార్పు మూడు రాశులవారి భావోద్వేగాలు, సంబంధాలు, సంపాదనపై బలమైన ప్రభావం చూపనుంది. మరి ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందామా.. 

2 Min read
Author : Kavitha G
Published : Oct 12 2025, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శుక్రుడి సంచారం
Image Credit : Getty

శుక్రుడి సంచారం

నవంబర్ నెల చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో రాక్షసుల గురువు శుక్రుడు ఐదుసార్లు తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. నవంబర్ 2న శుక్రుడు తన సొంత రాశి అయిన తుల రాశిలో సంచరిస్తాడు. 7న స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. 13న విశాఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. 26న వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. 29న అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడి ఈ సంచారం మూడు రాశులవారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేయనుందో ఇక్కడ తెలుసుకుందాం.

24
వృషభ రాశి
Image Credit : getty

వృషభ రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడి సంచారం మన జీవితాల్లో ఆకర్షణ, ప్రేమ సంబంధాలు, కళల పట్ల ఆసక్తి, ఆర్థిక ఆవిష్కరణలు మొదలైన వాటిని ప్రభావితం చేస్తుంది. కొన్ని రాశుల వారికి ఇది వరమైతే, మరికొందరికి పరీక్షగా మారుతుంది. నవంబర్ నెలలో శుక్రుడు వృషభ రాశివారిపై ప్రత్యేక అనుగ్రహం చూపిస్తాడు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. భవిష్యత్తులో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు కేసుల్లో విజయం దక్కుతుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి వస్తుంది

Related Articles

Related image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం!
Related image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు చిన్నవయసులోనే ధనవంతులవుతారు..!
34
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహ రాశివారికి నవంబర్ నెలలో అదృష్టం కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విదేశాల్లో పనిచేసే అవకాశం లభించవచ్చు. విదేశీ పౌరసత్వం కూడా పొందే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందుతారు. వ్యాపారాల్లో గతంలో చూడని లాభాలు చూస్తారు. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

44
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశివారికి నవంబర్ నెల శుభప్రదంగా ఉంటుంది. మీ హోదా, ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. భూమి, ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ సమయం శుభప్రదం. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. పిల్లల చదువు, ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. పిల్లల పట్ల మీ బాధ్యతను నెరవేర్చగలుగుతారు. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఈ సమయం శుభప్రదం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image2
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Recommended image3
Mangal Gochar: రాహువుతో కుజుడు కలయిక.. ఈ మూడు రాశులకు అనుకోని సమస్యలు
Related Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం!
Recommended image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు చిన్నవయసులోనే ధనవంతులవుతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved