Parijat Plant: పారిజాత మొక్క వల్ల ఊహించని లాభాలు.. ఏ దిశలో నాటాలో తెలుసా?
Parijat Plant: పారిజాత చెట్టు, పువ్వుల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ చెట్టు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ చెట్టు పువ్వులు కేవలం పూజకే కాాదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పారిజాత పుష్పం, ఆకులు, బెరడు లాభాల గురించి తెలుసుకుందాం.

పారిజాత పుష్ప ప్రాముఖ్యత
పారిజాతం.. అందమైన, ప్రత్యేకమైన పుష్పం. ఈ పువ్వు తెల్లగా, కాడ నారింజ రంగులో ఉంటుంది. ఆకట్టుకునే సువాసన దీని ప్రత్యేకత. సూర్యాస్తమయం తర్వాత వికసించి, తెల్లవారుజామున నేలపై రాలిపోతుంది. ప్రకృతి ప్రేమికులకు దీని వాసనకు మంత్ర ముగ్ధులు కావాల్సిందే. ఈ పుష్పం అందంగానే కాకుండా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
లక్ష్మిదేవి కటాక్షం
హిందూ సంప్రదాయంలో పారిజాతం మొక్కను పవిత్రంగా భావిస్తారు. ఈ చెట్టు పువ్వులతో లక్ష్మీదేవి, శ్రీకృష్ణుడ్ని పూజిస్తే.. శుభప్రదమని భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఈశాన్య లేదా తూర్పు దిశలో పారిజాతం మొక్కను నాటితే లక్ష్మిదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం. సముద్ర మథనంలో వెలిసిన 14 రత్నాలలో ఒకటిగా పౌరాణిక విశ్వాసం ఉంది. అందుకే దీనిని ఇంట్లో నాటడం శుభప్రదంగా భావిస్తారు.
వాస్తు, పౌరాణిక విశిష్టతలు
పారిజాతం మొక్కకు పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చెట్టు ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు తొలగి, సానుకూల శక్తులు వ్యాపిస్తాయని నమ్మకం. ఈ పువ్వుల సువాసన మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, శాంతిని కలిగిస్తుంది. పారిజాతం వల్ల వ్యాధులు రాకుండా, దీర్ఘాయుష్షు లభిస్తుందని నమ్మకం.
పారిజాతం చెట్టును ఏ దిశలో నాటాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం.. పారిజాతం చెట్టును సరైన దిశలో నాటడం చాలా ముఖ్యమైంది. ఈ చెట్టును తూర్పు లేదా ఉత్తర దిశలో, లేదా పశ్చిమ లేదా వాయువ్య దిశలో నాటడం శుభప్రదం. కానీ, ఇంటికి దక్షిణ దిశలో అస్సలు చెట్టు నాటకూడదు. ఎందుకంటే దక్షిణ దిశను యముడి దిశగా పరిగణిస్తారు. చెట్టును ఇంటి ముందు భాగంలో నాటడం వలన శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ఇది ధనం, సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది. పారిజాత చెట్టు ఇంట్లో నాటడం వల్ల వ్యాధులు దరిచేరవని నమ్మకం.
ఆధ్యాత్మికత, ఔషధ లక్షణాలు
పారిజాత చెట్టు.. పొదగా లేదా చిన్న చెట్టులాగా సుమారు 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని పువ్వులు తెల్లగా ఉంటాయి. ఈ చెట్టుకు ఎక్కువ సూర్యకాంతి అవసరం, కనీసం రోజుకు 8 గంటల సూర్యకాంతి ఉండేలి. మంచి సారవంతమైన నేలలో ఇది పెరుగుతుంది. పారిజాత పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీని పువ్వులు, ఆకులు, విత్తనాలు, బెరడును ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.