Health tips: తలనొప్పిని తగ్గించే టేస్టీ డ్రింక్స్.. చిటికెలో ఉపశమనం..
Headache Relief Drinks: మనం ఎక్కువగా, తరుచుగా ఎదుర్కొనే ఇబ్బందుల్లో తలనొప్పి ఒకటి. దీనికి ఒత్తిడి, అలసట, విటమిన్ల లోపం, నిద్రలేమి వంటి కారణాలెన్నో ఉన్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఈ టెస్టీ అండ్ హెల్తీ డ్రింక్స్ సహకరిస్తాయట. ఇంతకీ ఆ పానీయాలు ఏంటీ?

ఆరెంజ్ జ్యూస్ :
ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ Cతో పాటు పలు ముఖ్య పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ C ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. డీహైడ్రేషన్, పోషకాహార లోపం వల్ల వచ్చే తలనొప్పికి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
అల్లం టీ :
అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది తలనొప్పి, మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం శరీరంలో ప్రోస్టాగ్లాండిన్ అనే రసాయనం ఉత్పత్తిని తగ్గించడం ద్వారా నొప్పిని నియంత్రిస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో తురిమిన అల్లం వేసి, 5–10 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత దానిని వడకట్టి తాగండి. రుచి కోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలిపి తాగవచ్చు.
ఆకుకూరల రసం :
ఆకుకూరల్లో మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నాడీ వ్యవస్థను శాంతింపజేసి, తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా కీర, సెలెరీ, క్యారెట్ వంటి కూరగాయలతో రసం తయారుచేసుకుని తాగితే.. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. తలనొప్పి తగ్గుతుంది. ఇది సహజమైన, ఆరోగ్యకరమైన పరిష్కారం.