Headache: తలనొప్పి వెంటనే తగ్గాలంటే ఇలా చేయండి..
Headache: తలనొప్పి వివిధ కారణాల వల్ల వస్తుంది. కారణమేదైనా తలనొప్పి మాత్రం మనల్ని కుదురుగా ఉండనివ్వదు. అయితే దీన్ని తొందరగా తగ్గించే ఉపాయాలు కొన్ని ఉన్నాయి.

పని ఒత్తిడి, ఫోన్ లేదా ల్యాప్ టాప్ వంటి స్క్రీన్లను ఎక్కువ సేపు చూడటం వల్ల తలనొప్పి రావడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే తలనొప్పిని త్వరగా తగ్గించే చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూసేయండి.
మసాజ్ (Massage)
మసాజ్ ద్వారా కూడా తలనొప్పిని చిటికెలో తగ్గించుకోవచ్చు. మసాజ్ వల్ల తలనొప్పికి కారణమయ్యే శరీరంలోని ఏభాగం ఒత్తిడిని లేదా కండరాల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇది తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.
ఐస్ ప్యాక్ (Ice pack)
ఐస్ ప్యాక్ కూడా తలనొప్పిని తొందరగా తగ్గిస్తుంది. ఇందుకోసం ఐస్ ప్యాక్ ను రుమాలు లేదా టవల్‌తో చుట్టి నొప్పిగా ఉండే చోట కాసేపు పెట్టండి. ఇది మీకు తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది.
లావెండర్ ఆయిల్ (Lavender oil) ను ఉపయోగించండి
అరోమాథెరపీ కూడా మీ తలనొప్పిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీకు విశ్రాంతినిచ్చేందుకు సహాయపడే ఏదైనా ఇతర సువాసనను ఉపయోగించినా తలనొప్పి చిటికెలో తగ్గుతుంది.
నీళ్లు తాగండి
డీహైడ్రేషన్ కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. అందుకే అలాంటి సమయంలో నీళ్లన ఎక్కువగా తాగండి. అలాగే కొబ్బరి నీళ్లు లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రోలైట్ కలిగిన పానీయాన్ని తాగండి. ఇవి మిమ్మల్ని తొందరగా తలనొప్పి నుంచి బయటపడేస్తాయి.
శ్వాస వ్యాయామాలు (Breathing exercises)
తలనొప్పి వచ్చినప్పుడు నెమ్మదిగా.. లోతుగా శ్వాస పీలుస్తూ.. నెమ్మదిగా వదులుతూ ఉండాలి. ఇది మీ తలనొప్పికి కారణమయ్యే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడానికి సహాయపడుతుంది.
కాసేపు పడుకోండి
నిద్రలేకపోవడం వల్ల కూడా తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది. అందుకే మీ నిద్ర షెడ్యూల్ ను మార్చకండి. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. నిద్రతోనే ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయి.
టీ
చమోమిలే లేదా అల్లం వంటి స్టీమింగ్ కప్ హెర్బల్ టీలో తలనొప్పిని తగ్గించే ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ టీలను తాగితే తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం కలుగుతుంది.