Health Tips: రోజూ పరగడుపున ఒక లవంగం తింటే.. ఏం జరుగుతుందో తెలుసా?
Cloves Benefits: లవంగం.. మసాలా దినుసుల్లో ముఖ్యమైన దినుసు. ఇందులో ఎన్నో ఔషధగుణాలున్నాయి. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని లవంగాలు నమిలితే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

లవంగం – ఆరోగ్యానికి అద్భుత ఔషధం
లవంగం.. విలువైన సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. అనేక ఔషధ గుణాలతో కూడిన ఒక అద్భుతమైన పదార్థం. దీని ప్రత్యేక రుచి, సువాసన మాత్రమే కాకుండా దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక లవంగం నమిలితే.. ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో మాంగనీస్, విటమిన్ K, విటమిన్ C, ఫైబర్, అలాగే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అయిన యూజెనోల్ పుష్కలంగా ఉంటాయి. యూజెనోల్ అనే పదార్థమే లవంగానికి ఔషధ గుణాలు కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
నోటి ఆరోగ్యాన్ని మేలు
లవంగాలు సహజంగా యాంటీసెప్టిక్, యాంటీబాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. రోజూ ఉదయాన్నే లవంగం నమిలితే, నోటిలోని హానికర బ్యాక్టీరియా నశించి, దుర్వాసన తగ్గుతుంది. ఇది దంత నొప్పి, చిగుళ్ల వాపు, ఇతర నోటి ఇన్ఫెక్షన్లకు సహజ నివారణగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో లవంగాలను నోటి ఆరోగ్యానికి ముఖ్యమైన ఔషధంగా విరివిగా వినియోగిస్తారు.
జీర్ణక్రియ మెరుగుదల :
లవంగాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి, ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. దీనివల్ల అజీర్తి, మలబద్ధకం, గ్యాస్, వికారం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉదయాన్నే లవంగాలు నమిలితే జీర్ణవ్యవస్థ రోజంతా చురుగ్గా ఉంటుంది.
రోగనిరోధక శక్తి మెరుగుదల
లవంగాల్లో ఉండే విటమిన్ C , యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ వ్యాధుల నుండి రక్షణ కలిగించడమే కాదు. శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కూడా పెంచుతాయి.
చక్కెర స్థాయి నియంత్రణ
పలు అధ్యయనాల ప్రకారం.. లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాడు. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. అయితే.. డయాబెటిస్ ఉన్నవారు లవంగాలు తినే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.
సహజ నొప్పి నివారణ
లవంగాల్లోని యూజెనోల్ సహజమైన నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. ఇది తలనొప్పి, దంత నొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. లవంగాన్ని నమిలి దాని రసాన్ని నెమ్మదిగా మింగడం వల్ల ఈ నొప్పులకు సహజంగా తక్షణ ఉపశమనం పొందవచ్చు.
ఒత్తిడి, వాపును తగ్గిస్తుంది
లవంగంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించి, కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అలాగే.. దీర్ఘకాలిక వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
తక్షణ ఉపశమనం
లవంగాలు.. జ్వరం, కఫ నివారిణిగా పనిచేస్తుంది. అలాంటి గొంతు నొప్పి తగ్గించడంలో, శ్వాసకోశంలో కఫాన్ని తొలగించడంలో సహాయపడతాయి. ఉదయాన్నే రోజూ లవంగాలు నమిలితే.. గొంతు చికాకు, దగ్గు వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. ఇవి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
కాలేయ ఆరోగ్యానికి మేలు
లవంగాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని రక్షించి, దాని పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి కాలేయం నుండి విషపదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి.
ఆరోగ్యం పరిరక్షణ
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే ఖాళీ కడుపుతో ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని నెమ్మదిగా నమలండి. దాని రసాన్ని నెమ్మదిగా మింగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దాని రుచి కొంచెం ఘాటుగా అనిపించవచ్చు.