- Home
- Life
- Health
- Monsoon Health Tips: మొలకెత్తిన బంగాళాదుంపలు, బీట్ రూట్ తింటున్నారా ? ఏం జరుగుతుందో తెలుసా?
Monsoon Health Tips: మొలకెత్తిన బంగాళాదుంపలు, బీట్ రూట్ తింటున్నారా ? ఏం జరుగుతుందో తెలుసా?
Sprouted Potato, Beetroot: వర్షాకాలంలో బంగాళదుంపలు, బీట్ రూట్స్ కు త్వరగా మొలకలు వచ్చేస్తాయి. అయితే.. కొంతమంది మొలకలను తీసి ఆ బంగాళా దుంపలు, బీట్ రూట్స్ వండుతారు. అలా వండుకుని తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం..

మొలకెత్తిన బంగాళాదుంప, బీట్ రూట్ తినొచ్చా?
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల దుంప కూరగాయలు త్వరగా మొలకెత్తే అవకాశముంది. బంగాళాదుంప, బీట్రూట్‌లాంటివి సరిగ్గా నిల్వ చేయకపోతే మొలకలు వచ్చి, కుళ్లిపోతాయి. కొందరు వీటిలో పోషకాలు ఉంటాయని భావిస్తే.. మరి కొందరూ వాటిని తినడం హానికరమని భావిస్తారు. ఇంతకీ మొలకెత్తిన కూరగాయలు తినడం సురక్షితమేనా? తింటే ఏం జరుగుతుంది? అనేది తెలుసుకుందాం.
మొలకెత్తిన బంగాళాదుంపల దుష్ప్రభావాలు
వర్షాకాలంలో తేమ అధికంగా ఉండటం వల్ల బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తుతాయి. మొలకలతో పాటు వాటిపై మచ్చలు కూడా ఏర్పడుతాయి. అంతేకాకుండా సోలనిన్ అనే హానికర పదార్థం వృద్ధి చెందుతుంది. ఈ పదార్థం శరీరంలోకి వెళితే అజీర్ణం, వాంతులు, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే మొలకెత్తిన లేదా కుళ్ళిన బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది.
ఆరోగ్య సమస్యలు
వర్షాకాలంలో మొలకెత్తిన బంగాళాదుంపలు తినకూడదు, ఎందుకంటే సోలనిన్ అనే విషపదార్థం ఆరోగ్యానికి హానికరం. బీట్ రూట్ మొలకెత్తినా ప్రమాదం తక్కువే, ఎందుకంటే.. బీట్ రూల్ లో సోలనిన్ అనే విష పదార్థం ఉండదు. కానీ, పోషక విలువలు తగ్గుతాయి. కాబట్టి ఈ కూరగాయల స్థితిని పరిశీలించి వాడాలి. తేమ ఉన్న కాలంలో ఆహార నిల్వపై జాగ్రత్త వహించటం ద్వారా అనారోగ్య సమస్యలు నివారించవచ్చు.
మొలకెత్తిన బీట్ రూట్ తినొచ్చా?
బీట్రూట్ లో సోలనిన్ వంటి హానికర పదార్థం ఉండదు. మొలకెత్తిన బీట్రూట్ పెద్దగా ప్రమాదకరం కాదు, కానీ, దాని పోషక విలువలు, చక్కెరల పరిమాణం, యాంటీఆక్సిడెంట్లు తగ్గుతాయి. రుచి కూడా మారుతుంది, అందువల్ల తినే ముందు పరిస్థితిని పరిశీలించాలి.
అలాంటివి తినకండి
బీట్రూట్ కొద్దిగా మొలకెత్తినా తాజాగా ఉంటే బాగా కడిగి తొక్క తీసి వాడవచ్చు. కానీ మెత్తబడి, వాసన వస్తే లేదా కుళ్ళినట్లు కనిపిస్తే వాడకూడదు.