Rahu Transit: రాహువు వల్ల ఈ 4 రాశుల వారికి కోటీశ్వర యోగం
Rahu Transit: జ్యోతిషశాస్త్రం చెబుతున్న ప్రకారం రాహువు సంచారం వల్ల 4 రాశుల వారికి అదృష్టం దక్కుతుంది. రాహువు అనుగ్రహం వీరిపై ఉంటుంది. ఈ రాశుల వారి కష్టాలన్నీ తీరి ధన వర్షం కురుస్తుంది. ఏ రాశుల వారికి ఇది కలిసివస్తుందో తెలుసుకోండి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఇది బాగా కలిసొచ్చే సమయం. రాహువు ఆశీస్సులతో వీరికి డబ్బు ప్రవాహం పెరుగుతుంది. అనుకోని మార్గాల నుంచి వీరికి డబ్బు రావడంతో వీరి బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. వ్యాపారం, ఉద్యోగం వంటి విషయాల్లో కొత్త అవకాశాలు ఎదురవుతాయి. కుటుంబంలో ఉన్న గొడవలు తీరిపోతాయి. మనసుకు శాంతిగా ఉంటుంది. సొంత ఇల్లు లేదా ఆస్తి కొనాలనుకుంటున్న మీ కల నెరవేరుతుంది. ఈ రాశి వారికి రెట్టింపు ఆదాయం దక్కుతుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి రాహువు వల్ల మంచి రోజులు మొదలవుతాయి. రాహువు ప్రభావంతో సమాజంలో హోదా పెరుగుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వీరికి కీలకమైన బాధ్యతలు కూడా వస్తాయి. వ్యాపారం, వృత్తిలో లాభాలు రెట్టింపు అవుతాయి. విదేశీ వ్యాపారం చేసేవారికి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఉంది. రాహు సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ రాశి వారికి ఇదే అనుకూల సమయం.
ధనూ రాశి
నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వానికి ధనుస్సు రాశి వారు ఉదాహరణ. పాత పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుతాయి. వీరు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. ధైర్యంగా కొత్త పనులు మొదలుపెట్టవచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఇది అద్భుతమైన కాలం. ఈ రాశి వారికి ఊహించని అభివృద్ధని తీసుకొస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఈ రాశి వారి జీవిత గమనాన్ని మారుస్తుంది. ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. చేతిలో డబ్బు పెరుగుతుంది. కుటుంబంలో శాంతి, వ్యాపారంలో అపారమైన లాభం పొందుతారు.

