Zodiac signs: ఈ 2 రాశులవారు మే నెలలో జాగ్రత్తగా లేకపోతే.. అంతే సంగతులు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే నెల చాలా ప్రత్యేకమైంది. గ్రహాలు, రాశులు, నక్షత్రాల మార్పుల కారణంగా ఈ నెలలో రెండు రాశుల వారు అశుభ ఫలితాలు, నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. మరి మే నెల అంతా ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలో మార్పు12 రాశి చక్రాలపై ప్రభావం చూపుతుంది. మే నెలలో రెండు రాశులపై చెడు ప్రభావం పడనుంది. జాగ్రత్తగా లేకపోతే భారీ నష్టం జరగవచ్చు. ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారు దురుసుగా ప్రవర్తించి.. అవమానాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. గుండె లేదా రక్తపోటు వ్యాధిగ్రస్తులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారికి కాలికి గాయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. మాటలు, ప్రవర్తనలో దురుసుతనం తగ్గించుకోవడం మంచిదట. ఎవరి ప్రభావానికి లోను కాకుండా లేదా కోపగించుకోకుండా ఉండాలట. ఇతరుల భావాలను గౌరవించడం. వృత్తికి సంబంధించిన ఏ నిర్ణయాన్నైనా తొందరపడి తీసుకోకుండా ఉండటం మంచిదని జ్యోతిష్యం చెబుతోంది.
ఏం చేస్తే మంచిది?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది. ఎప్పుడూ మీ దగ్గర ఒక వెండి నాణెం ఉంచుకోండి. మాదక ద్రవ్యాలు, ఇతర ప్రతికూల విషయాలకు దూరంగా ఉండండి.
వృషభ రాశి
వృషభ రాశి వారు మీ అన్నా చెల్లెళ్ల భావాలను దెబ్బతీయకండి. వాదప్రతివాదాలు, చర్చలు జరగవచ్చు. కాబట్టి, వాటిని నివారించడానికి ప్రయత్నించండి. మీరు అవివాహితులైతే, సంబంధాన్ని కొనసాగించడానికి ఇది మంచి సమయం కాదు. గుండె జబ్బుతో బాధపడుతుంటే లేదా ఏదైనా కంటి సమస్య ఉంటే జాగ్రత్త వహించండి. అనవసర ఖర్చులు, ప్రయాణాలను నివారించండి. ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా, ఎలాంటి రిస్క్ తీసుకోకండి. ఉద్యోగంలో పదోన్నతి వచ్చినా, అహంకారం ప్రదర్శించకండి. వ్యాపార వర్గానికి చెందినవారు ఎవరి మాటలకూ లొంగకూడదు. ఈ నెల ఉద్యోగాలు మారకపోవడం మంచిది. తెలివిగా పెట్టుబడి పెట్టండి లేకపోతే నష్టపోవచ్చు. ఆస్తి లేదా షేర్ మార్కెట్ కు సంబంధించిన ఏ నిర్ణయాన్నైనా చాలా జాగ్రత్తగా తీసుకోండి.
వృషభ రాశి వారు ఎలాంటి నియమాలు పాటించాలి?
ప్రతిరోజూ స్పటిక శ్రీయంత్రాన్ని పూజించండి. లక్ష్మీ అష్టకం లేదా లక్ష్మీ సూక్తం పారాయణం చేసి నెయ్యితో దీపం వెలిగించండి. ప్రతిరోజూ మీ నుదుటిపై కుంకుమ తిలకం పెట్టుకోండి. హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పారాయణం చేయండి. ప్రాణాయామం లేదా యోగా చేయడం మంచిది.