Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. తండ్రి జాతకాన్ని మార్చేస్తారు!
సంఖ్యాశాస్త్రం వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపిస్తుందనే విషయం అందరికీ తెలుసు. న్యూమరాలజీ ఆధారంగా వ్యక్తుల భవిష్యత్ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన అబ్బాయిలు తండ్రికి అదృష్టాన్ని మోసుకువస్తారట. ఆ పిల్లల రాకతో తండ్రుల జీవితం ఊహించని విధంగా మారిపోతుందట. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు తండ్రి జీవితాన్ని విలాసవంతంగా మారుస్తారో ఇక్కడ చూద్దాం.

సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ, సమయం ఆధారంగా వ్యక్తుల భవిష్యత్ గురించి తెలుసుకోవచ్చు. కొన్ని శుభ తేదీల్లో పిల్లలు జన్మిస్తే తండ్రికి అదృష్టం కలుగుతుందట. వారి జీవితం ఊహకందని విధంగా మారిపోతుందట. మరి ఏ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు తల్లిదండ్రులకు అదృష్టాన్ని మోసుకువస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ తేదీల్లో పుట్టిన పిల్లలు అదృష్టవంతులు!
సంఖ్యా శాస్త్రం ప్రకారం మూలసంఖ్య 6 కలిగిన మొదటి బిడ్డ తండ్రికి ఆర్థిక లాభం చేకూరుస్తుందట. వారు కోరుకున్నది సాధిస్తారట. ప్రారంభించిన ప్రతి వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుందట. మూలసంఖ్య 6 అంటే ఏ నెలలో అయినా.. 6, 15, 24 తేదీల్లో జన్మించినవారని అర్థం.
తండ్రి జాతకాన్ని మారుస్తారు!
సంఖ్యా శాస్త్రం ప్రకారం 5, 14, 23 జన్మ తేదీలు కూడా తండ్రి జాతకాన్ని మారుస్తాయి. ఈ తేదీల్లో మొదటి బిడ్డ జన్మిస్తే, తండ్రి ఐదు సంవత్సరాల నుంచి ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తవుతాయి అని జ్యోతిష్యులు చెబుతున్నారు.
తండ్రికి ధన లాభం..
న్యూమరాలజీ ప్రకారం 8, 17, 26 తేదీల్లో జన్మించినవారు తమ తండ్రికి ధనప్రాప్తి కలిగిస్తారు. అయితే ప్రారంభంలో వారు తండ్రితో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ తర్వాత కాలంలో తండ్రికి మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.