టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరీ కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తుంది.
టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆయన గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది. టాలీవుడ్లో దర్శకుడిగా రాణించారు ఏఎస్ రవికుమార్ చౌదరి. బాలకృష్ణ, గోపీచంద్, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలతో ఆయన మూవీస్ చేశారు.
ఏఎస్ రవికుమార్ చౌదరి మృతి పట్ల చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి
ప్రస్తుతం దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన హఠాన్మరణం తెలుగు చిత్ర పరిశ్రమని కలచి వేస్తుంది. ఆయన మృతిపట్ల ఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. అయితే గత కొంత కాలంగా ఏఎస్ రవికుమార్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీలో గొడవలు ఉన్న నేపథ్యంలో చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్నారు.
డిప్రెషన్లో దర్శకుడు
గతేడాది ఆయన రాజ్ తరుణ్‌తో `తిరగబడరా సామీ`అనే చిత్రాన్ని రూపొందించారు. ఇది డిజాస్టర్ అయ్యింది. ఈ క్రమంలోనే దర్శకుడు డిజాప్పాయింట్‌లో ఉన్నట్టు సమాచారం.
సక్సెస్ లేకపోవడంతో చాలా కాలంగా ఒత్తిడిలో ఉన్నారని, కొంత మద్యానికి కూడా బానిసైనట్టు తెలుస్తోంది. ఇక దర్శకుడి మృతి పట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.
అయితే రవికుమార్ చౌదరి నిజంగానే గుండెపోటుతో మరణించారా? సూసైడ్ చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన సినిమాలు
దర్శకుడు ఏఎస్ రవికుమార్.. గోపీచంద్ హీరోగా వచ్చిన `యజ్ఞం` చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత బాలకృష్ణతో `వీరభద్ర` మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక సాయి ధరమ్ తేజ్ తో `పిల్లా నువ్వు లేని జీవితం` మూవీని రూపొందించారు. ఇది బాగానే ఆడింది. ఆ తర్వాత నితిన్‌తో `ఆటాడిస్తా` సినిమా చేశారు. ఇది కూడా డిజాస్టర్ అయ్యింది.
దీంతో దర్శకుడిగా చాలా గ్యాప్ వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత రాజ్ తరుణ్‌తో `తిరగబడరా సామీ`ని రూపొందించగా, ఇది కూడా ఆడలేదు. దీంతో ఆయన మానసికంగా కుంగిపోయినట్టు సమాచారం.
