పాకిస్తాన్ ఆరోపణలపై భారత్ సమాధానంగా సిర్సా, సూరత్‌గఢ్ వైమానిక స్థావరాల తాజా ఫొటోలు విడుదల చేసింది.

పాకిస్తాన్ చేసిన ఆరోపణలపై స్పందనగా భారత ప్రభుత్వం తాజా ఫోటోలను విడుదల చేసింది. టైమ్ స్టాంప్‌తో కూడిన ఈ చిత్రాలు దేశం లోని హర్యానా,రాజస్థాన్ వైమానిక స్థావరాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లు స్పష్టంగా చూపిస్తున్నాయి.ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రకటనలో ఈ రెండు స్థావరాలను తమ లక్ష్యంగా ఎంచుకున్నట్లు పేర్కొంది. అయితే, భారత్ దీన్ని తప్పుపడుతూ అసలైన పరిస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా ఆధారాలతో సహా వివరించింది.

హర్యానా, సూరత్‌గఢ్ లో ఉన్న ఈ కీలకమైన వైమానిక స్థావరాలు దేశ రక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. పాకిస్తాన్ చేసిన దాడుల ప్రయత్నాలపై గమనించి, భారత్ స్పందనను సూటిగా ఇవ్వడం గమనార్హం. రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఫోటోలు ఈ స్థావరాలపై ఎలాంటి దెబ్బ తగలకపోవడం, అవి ఇప్పటికీ తమ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.వాస్తవాలను వక్రీకరించేలా పాకిస్తాన్ చేసిన ప్రకటనలపై భారత్ క్లారిటీ ఇవ్వడం ద్వారా ప్రజల్లో అనవసర ఆందోళనను నివారించడానికి ప్రయత్నించింది. అంతేగాక, అంతర్జాతీయంగా కూడా నిజమైన సమాచారాన్ని అందిస్తూ తమ వైపు నుండి ఏకపక్ష ప్రచారం లేదని రుజువు చేసింది.