పాక్ సైనిక స్థావరాలపై భారత్ ప్రతీకార దాడులు చేసిందని కల్నల్ సోఫియా ఖురేషి స్పష్టం చేసారు. బాలిస్టిక్ క్షిపణులను పాక్ పై ప్రయోగిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది.
India Pakistan War: పాకిస్తాన్ వివిధ ఆయుధాలతో వరుస దాడులు చేసిందని సోఫియా ఖురేషి తెలిపారు. శ్రీనగర్, ఉధంపూర్, పఠాన్‌కోట్, ఆదంపూర్ వంటి సైనిక స్థావరాలపై దాడులు జరిగాయని తెలిపారు... ఇందుకు భారత్ కూడా తగిన రీతిలో కౌంటర్ ఇచ్చిందన్నారు. పాక్ పై దాడులకు బాలిస్టిక్ క్షిపణులు ఉపయోగిస్తున్నామని వెల్లడించారు,
జనావాసాలే టార్గెట్ గా పాకిస్తాన్ దాడులు చేసిందని.. కానీ భారత్ అలా చేయడంలేదన్నారు... కేవలం పాక్ సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు చేసింది. లాహోర్ నుండి బయలుదేరిన పౌర విమానాల ముసుగులో పాకిస్తాన్ ఈ దాడులు చేసిందని సోఫియా ఖురేషి చెప్పారు.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోఫియా ఖురేషీ శుక్రవారం రాత్రి జరిగిన పరిణామాలను వివరించారు. పాకిస్థాన్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కల్నల్ సోఫియా ఇండియా కూడా ఇక వారికి తగిన గుణపాఠం చెప్పడానికే సిద్దమయ్యిందని హెచ్చరించారు.
S-400 క్షిపణి స్థావరం, బ్రహ్మోస్ కేంద్రం ధ్వంసం చేశామని పాకిస్తాన్ చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమని సోఫియా స్పష్టం చేసారు. ఉద్రిక్తతల మరింత పెంచుతూ పాకిస్తాన్ సరిహద్దుల్లో సైన్యాన్ని పెంచిందన్నారు. టెరిటోరియల్ ఆర్మీతో సహా భారత్ అప్రమత్తంగా ఉందన్నారు.
పాకిస్తాన్ యుద్ధ విమానాలు, క్షిపణులను భారత్ పై దాడికి ఉపయోగించిందన్నారు. యుకాబ్, డ్రోన్లు, యుద్ధ విమానాలతో పాకిస్తాన్ దాడులు చేసిందన్నారు. డ్రోన్ల నుండి భారీ క్షిపణుల వరకు ఉపయోగిస్తోందని తెలిపారు. భారత వైమానిక స్థావరాలకు స్వల్ప నష్టం జరిగిందని తెలిపారు. అన్ని దాడులనూ భారత్ తిప్పికొట్టిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పత్రికా సమావేశంలో తెలిపింది.
