జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు వెంట పాకిస్థాన్ తరఫు నుంచి డ్రోన్లు భారత భూభాగంలోకి చొచ్చుకువస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. తాజా దాడులతో పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

అంతర్భాగంగా పాక్ డ్రోన్లు నియంత్రణ రేఖ (LoC) వద్ద గస్తీ నిర్వహిస్తున్న ప్రాంతాలపై విస్తృతంగా కనిపించడంతో భద్రతా అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఉగ్రదాడులకు ఆస్కారం ఉండొచ్చన్న అనుమానంతో సరిహద్దు గ్రామాల్లో బ్లాక్‌అవుట్ ప్ర‌క‌టించారు. ప్రజల భద్రత దృష్ట్యా సైర‌న్ మోగించారు. 

ఈ పరిస్థితుల్లో భారత సైన్యం వెంటనే స్పందించి డ్రోన్లకు సంబంధించిన సమాచారాన్ని రాడార్‌ల ద్వారా గుర్తించి, చర్యలకు దిగింది. ఇటీవల కాలంలో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మందుపట్టులు తరలించే పాకిస్తాన్ ఉగ్రవాదుల యత్నాలు పెరిగిన విషయం తెలిసిందే. 

Scroll to load tweet…

రాజౌరీ, పూంఛ్, కుప్వారా, కతువా వంటి సున్నిత ప్రాంతాల్లో నైట్ విజన్ డివైజ్‌లతో పాటు స్పెషల్ ఫోర్స్ యూనిట్లను మోహరించారు. డ్రోన్ల కదలికలపై గగనతల నిఘాను పెంచారు. పాక్ ఉగ్ర గుంపులు భారత్‌లో చొరబాటుకు యత్నిస్తున్నాయన్న నేప‌థ్యంలో ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. 

ఇంటిని నుంచి బయటకు రావొద్దు

జమ్ముతో పాటు చుట్టుపక్కల ప్రజలకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా విజ్ఞ‌ప్తి చేశారు. దయచేసి కొద్ది గంటల పాటు వీధుల్లోకి రావద్దు. మీ ఇంట్లోనే లేదా మీరు సురక్షితంగా ఉండగలిగే దగ్గర్లోనే ఉండండి. పుకార్లను విశ్వసించకండి, నిర్ధారణ లేని వార్తలను పంచుకోకండి అని చెప్పుకొచ్చారు. 

Scroll to load tweet…