పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు సరైనదే అని ఆ దేశ యువతే ఒప్పుకుంటోంది. ముందుకు పాక్ దాడి మొదలుపెట్టింది... ఇప్పుడు ఇండియా దాడి చేస్తే శాంతి కావాలంటే ఎలా? 26 మంది చనిపోయినప్పుడు శాంతి ఎక్కడ ఉంది? అని ఓ పాక్ యువకుడు ప్రశ్నించాడు.  

India Pakistan War : పెహల్గాం దాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. అమాయకులపై ఉగ్రవాద దాడికి ఇండియా ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతిస్పందించింది. కానీ ఇండియాపై పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేస్తోంది. సరిహద్దుల్లో అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ దాడి చేస్తోంది. దీనికి ఇండియా తగిన సమాధానం చెప్పింది. పాకిస్తాన్‌కి నష్టం జరగడం మొదలవగానే, శాంతి కావాలని అంటోంది. ఇండియా రెచ్చగొడుతోందని అంతర్జాతీయ వేదికలపై చెబుతోంది. ఈ కపట నాటకాన్ని పాకిస్తాన్ యువకుడు బయటపెట్టాడు. ఆపరేషన్ సింధూర్‌కి మద్దతు కూడా ఇచ్చాడు.

వీడియోలో ఏం చెప్పాడు?
అభయ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో పోస్ట్ చేసిన యువకుడు తాను పాకిస్తాన్ వాడినని చెప్పాడు. ఇండియాకి ప్రతిదాడి చేసే హక్కు ఉంది... ముందు మీరు (పాకిస్తాన్) వాళ్ళ పౌరులపై దాడి చేశారన్నాడు. ఇండియా ప్రతిదాడి మొదలుపెట్టగానే శాంతి గురించి మాట్లాడుతున్నారు... మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డాడు.

 26 మంది చనిపోయినప్పుడు ఇదేమీ లేదు... ఇప్పుడు బాధితుల్లా నటిస్తున్నారని మండిపడ్డాడు. ఎవరికీ యుద్ధం వద్దు... ఇండియాకీ వద్దు, పాకిస్తాన్‌కీ వద్దు. కానీ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే ప్రతిదాడి తప్పదని హెచ్చరించాడు మీ జనం చనిపోతే శాంతి కావాలంటారు.... ఇండియా దీన్ని మొదలుపెట్టలేదు... మీరు (పాకిస్తాన్) మొదలుపెట్టారు.. మీ దాడికి ఇండియా ప్రతిస్పందించింది... ఇది యుద్ధం కాదు, న్యాయం అని ఆ యువకుడు చెప్పాడు.

View post on Instagram

సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడులకు ప్రతిఘటన
సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడులు చేస్తోంది. ఇండియా నగరాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. కానీ ఇండియా తగిన సమాధానం చెప్పింది. పాకిస్తాన్ ఫైటర్ జెట్‌ను కూల్చివేసింది. క్షిపణులను, డ్రోన్లను అడ్డుకుంది. దాడులు విఫలమవ్వడంతో పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఈ దాడిలో 15 మంది చనిపోయారు.

150 మంది ఉగ్రవాదుల హతం
ఆపరేషన్ సింధూర్‌లో 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు. పాకిస్తాన్‌కి ఉగ్ర స్థావరాలపై దాడి జరిగినప్పుడే తెలిసింది. దానికి ముందు ఇండియా దాడిని పాకిస్తాన్ రాడార్‌లు గుర్తించలేదు. ఈ దాడిలో 150 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు.