MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Face Glow: రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క క్రీమ్ రాసినా.. మీ అందం రెట్టింపు అవ్వడం పక్కా

Face Glow: రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క క్రీమ్ రాసినా.. మీ అందం రెట్టింపు అవ్వడం పక్కా

 అందంగా కనపడటానికి ఉదయం పూట స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వడం ఎంత ముఖ్యమో, రాత్రి పూట నైట్ టైమ్ స్కిన్ కేర్ రోటీన్ ఫాలో అవ్వడం కూడా అంతే ముఖ్యం. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 28 2025, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
face cream
Image Credit : Getty

face cream

అందంగా కనిపించాలనే కోరిక లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? రోజు రోజుకీ తమ అందం రెట్టింపు కావాలనే కోరుకుంటారు. దాని కోసం ఎవరికి వారు తమకు తోచిన ఏవేవో క్రీములు రాసేస్తూ ఉంటారు. కానీ, మార్కెట్లో దొరికే క్రీములు కాకుండా..సహజంగా దొరికే వాటిని వాడి కూడా మన అందాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా రెండు పదార్థాలతో తయారు చేసిన ఒక క్రీమ్ ని రాత్రి పూట ముఖానికి రాయడం వల్ల చర్మ సమస్యలు అన్నీ తగ్గి.. అందం రెట్టింపు అవుతుంది. మరి, అదేంటి? దానిని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

అందంగా కనపడటానికి ఉదయం పూట స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వడం ఎంత ముఖ్యమో, రాత్రి పూట నైట్ టైమ్ స్కిన్ కేర్ రోటీన్ ఫాలో అవ్వడం కూడా అంతే ముఖ్యం.

25
 నైట్ క్రీమ్ ఎలా తయారు చేయాలి..?
Image Credit : Getty

నైట్ క్రీమ్ ఎలా తయారు చేయాలి..?

మీరు నైట్ క్రీమ్ తయారు చేయడానికి మీకు కొబ్బరి నూనె, స్పటిక ఉంటే సరిపోతుంది. ఈ రెండూ మీ చర్మాన్ని అందంగా మార్చడానికి సహాయపడతాయి. ఈ రెండింటినీ కలిపి మంచి పేస్టులా తయారు చేయాలి. అంతే, నైట్ క్రీమ్ తయారైనట్లే.

ఈ నైట్ క్రీమ్ ఎలా ఉపయోగించాలి..?

ఈ నైట్ క్రీమ్ ఉపయోగించడానికి ముందు ముఖాన్ని మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, అదేవిధంగా మెడకు అప్లై చేయాలి. ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. వరసగా 15 రోజులు ఈ క్రీమ్ రాస్తే.. మీ ముఖం అందంగా, మెరుస్తూ కనపడుతుంది.

Related Articles

Related image1
Face Glow: బొప్పాయిలో ఇదొక్కటి కలిపి రాస్తే పది నిమిషాల్లో ముఖం మెరిసిపోతుంది..!
Related image2
Beauty Tips: ముఖానికి రాయడం కాదు, రోజూ బీట్ రూట్ నీరు తాగితే, మీ ఫేస్ లో వచ్చే మార్పులు ఇవే
35
 కొబ్బరి నూనె ప్రయోజనాలు
Image Credit : Getty

కొబ్బరి నూనె ప్రయోజనాలు

కొబ్బరి నూనె చర్మాన్ని తేమ చేస్తుంది. ఈ కొబ్బరి నూనె రాయడం వల్ల చర్మం అందంగా మారుతుంది. మృదువుగా చేస్తుంది. చిన్న పిల్లల స్కిన్ లా స్మూత్ గా కనపడుతుంది.

స్పటిక ప్రయోజనాలు...

స్పటిక మనకు మార్కెట్లో సులభంగా లభిస్తుంది. దీని పొడిని మన చర్మానికి వాడటం వల్ల చర్మం అందంగా మారుతుంది. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. దీని వల్ల యవ్వనంగా కనపడేలా చేస్తుంది. మొటిమల సమస్య ఉండదు. ఆల్రెడీ మొటిమలు ఉన్నా.. అవి కూడా పూర్తిగా మచ్చలతో సహా పోతుంది.

45
ఈ నైట్ క్రీమ్ వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Image Credit : Getty

ఈ నైట్ క్రీమ్ వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

క్లీన్ ఫేస్: ఈ క్రీమ్ రాసే ముందు ముఖాన్ని సబ్బుతో కడగడం కాకుండా, మైల్డ్ క్లీన్సర్ లేదా రోస్ వాటర్ తో శుభ్రం చేయడం ఉత్తమం.

అలెర్జీ టెస్ట్: మీకు కొత్త పదార్థాలు అయితే, మొదట చేతిపై తక్కువ మొత్తంలో అప్లై చేసి, 24 గంటల తర్వాత సమస్యలేమీ లేనప్పుడు ముఖానికి వాడండి.

స్టోరేజ్: ఈ క్రీమ్‌ను గాజు సీసాలో స్టోర్ చేయండి. ఫ్రిడ్జ్‌లో నిల్వ చేస్తే ఎక్కువ రోజుల పాటు నాణ్యత కోల్పోదు.

కొబ్బరి నూనె ఎంపిక: వర్జిన్ కొబ్బరి నూనె (cold pressed) వాడటం ఉత్తమం. ప్రాసెస్ చేయని నూనె వాడటం ఉత్తమం.

మీ స్కిన్ టైప్ ఆధారంగా : ఆయిలీ స్కిన్ ఉన్నవారు కొబ్బరి నూనె కొద్దిగా మాత్రమే వాడాలి. డ్రై స్కిన్ ఉన్నవారికి ఇది ఎక్స్‌ట్రా మాయిశ్చరైజింగ్ లా పని చేస్తుంది.

55
స్పటికను మాస్క్‌గా వాడొచ్చా?
Image Credit : stockPhoto

స్పటికను మాస్క్‌గా వాడొచ్చా?

ఈ స్పటికను మనం ఫేస్ మాస్క్ గా కూడా వాడొచ్చు. స్పటిక పొడిని తులసి రసం లేదా రోజ్ వాటర్‌తో కలిపి మాస్క్ లా అప్లై చేసినా చర్మానికి మంచి ఫలితం వస్తుంది. ఇది మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది. వారానికి ఒక్కసారి ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఈ నైట్ క్రీమ్‌ను వరుసగా 15 రోజులపాటు వాడిన తర్వాత మీరు మీ ముఖంలో తేడా గమనించగలుగుతారు. ప్రకృతి లో భాగమైన ఈ పదార్థాలతో మీరు అందాన్ని మెరుగు పరచుకోవచ్చు. ఖరీదైన ప్రాడక్ట్స్ అవసరం లేకుండా, ఇంట్లోనే అందాన్ని సంరక్షించుకోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: 2 గ్రాముల్లో అదిరిపోయే ఇయర్ రింగ్స్
Recommended image2
Toe Rings: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే మెట్టెలు
Recommended image3
Silver Rings: కళ్లు చెదిరే డిజైన్ లో వెండి ఉంగరం.. ఓ లుక్కేయండి
Related Stories
Recommended image1
Face Glow: బొప్పాయిలో ఇదొక్కటి కలిపి రాస్తే పది నిమిషాల్లో ముఖం మెరిసిపోతుంది..!
Recommended image2
Beauty Tips: ముఖానికి రాయడం కాదు, రోజూ బీట్ రూట్ నీరు తాగితే, మీ ఫేస్ లో వచ్చే మార్పులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved