MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Glowing Face: ఈ ఐదు రాస్తే.. ముఖం అందంగా, కాంతివంతంగా మారడం పక్కా!

Glowing Face: ఈ ఐదు రాస్తే.. ముఖం అందంగా, కాంతివంతంగా మారడం పక్కా!

ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ముఖ్యంగా ఆడవాళ్లు. చర్మ సౌందర్యం కోసం వారు పాటించని చిట్కాలు ఉండవు. వాడని ప్రోడక్టులు ఉండవు. కానీ అందమైన ముఖం కోసం ఖరీదైన క్రీములకు బదులు ఈ 5 పదార్థాలు వాడితే చాలంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jun 05 2025, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వేప :

వేప :

వేపను ఆయుర్వేదంలో "సర్వరోగ నివారిణి" గా పిలుస్తారు. చర్మ ఆరోగ్యానికి వేప ఒక వరం. వేపలోని నింబిడిన్, అజాడిరక్టిన్ వంటి సమ్మేళనాలు మొటిమలు, ఎక్జిమా, తామర వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఇందుకు వేప ఆకులను పేస్ట్ లా నూరి ముఖానికి రాసుకోవచ్చు. వేప నూనెను మొటిమలపై రాసుకోవచ్చు. వేప పొడిని ఫేస్ మాస్క్‌లలో కలుపుకోవచ్చు. వేపను ఉపయోగించడం వల్ల చాలా తక్కువ టైంలో మంచి ఫలితాలను పొందవచ్చు.

25
అశ్వగంధ :

అశ్వగంధ :

అశ్వగంధను "ఇండియన్ జిన్సెంగ్" అంటారు. ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఒత్తిడి తగ్గించడం ద్వారా చర్మ కాంతిని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని కాపాడుతాయి. ముందస్తు వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. అశ్వగంధ పొడిని పాలు లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఫేస్ మాస్క్‌లలో కూడా దీన్ని వాడచ్చు.

35
కలబంద :

కలబంద :

కలబందను శతాబ్దాల నుంచి ఔషధంగా వినియోగిస్తున్నారు. ఇది చర్మానికి మంచి మాయిశ్చరైజర్. కలబంద పొడి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఎండ దెబ్బ, కాలిన గాయాలు, దురదలను తగ్గిస్తుంది. మొటిమలను కలిగించే బాక్టీరియాను అడ్డుకుంటుంది. కలబంద జెల్‌ను నేరుగా చర్మానికి రాసుకోవచ్చు. ఫేస్ మాస్క్‌లు, మాయిశ్చరైజర్లు, లోషన్లలో కూడా కలుపుకోవచ్చు.

45
పసుపు :

పసుపు :

పసుపు.. భారతీయ వంటకాలు, సంప్రదాయ వైద్యంలో ముఖ్యమైంది. పసుపులో అందాన్ని పెంచే గుణాలను ఉండటం వల్ల దీన్ని"ఇండియా గోల్డెన్ స్పైస్" అంటారు. పసుపులోని కర్కుమిన్ చర్మ సమస్యలను నివారిస్తుంది. బాక్టీరియాను అడ్డుకుని, మొటిమలు, ఇతర చర్మ సమస్యలను నయం చేస్తుంది. పసుపు పొడిని పాలు, శనగపిండి లేదా తేనెతో కలిపి ఫేస్ మాస్క్‌లా వాడవచ్చు.

55
చందనం :

చందనం :

చందనం.. దాని సువాసన, చల్లని గుణాలకు ప్రసిద్ధి. ఇది చర్మానికి మంట నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కాంతినిస్తుంది. చర్మానికి చల్లదనాన్ని ఇచ్చి.. దురద, ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. మచ్చలు, మొటిమలను తగ్గిస్తుంది. చందనం పొడిని రోజ్ వాటర్ లేదా పాలతో కలిపి ముఖానికి రాసుకోవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సౌందర్యం
మహిళలు
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Anklet: ఆఫీసుకు వెళ్లే మహిళలకు బెస్ట్ పట్టీలు
Recommended image2
Gold Earrings: 2 గ్రాముల్లో అదిరిపోయే ఇయర్ రింగ్స్
Recommended image3
Toe Rings: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved