చాలా మంది మహిళలకు కాళ్లకు పట్టీలు ధరించడం అంటే చాలా ఇష్టం. కేవలం ఇవి అందానికి మాత్రమే కాదు.. దీని వెనక చాలా సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి.
పట్టీల గజ్జెల సవ్వడి ఇంట్లో పాజిటివిటీని తెస్తుందని నమ్ముతారు. మీరు కూడా ఇలాంటి చైన్ డిజైన్ ఉన్న పట్టీలను ఎంచుకోవచ్చు. దీనికి 5 గజ్జెల చొప్పున గుత్తులుగా అమర్చారు.
సుమారు 8 నుంచి 10 గ్రాముల వెండిలో మీరు ఇలాంటి లేయర్డ్ పట్టీలను చేయించుకోవచ్చు. ఇందులో సన్నని చైన్‌లతో లేయర్స్ ఇచ్చారు. కింద ముత్యాల డిటైలింగ్, అటూ ఇటూ రెండు గజ్జెలు కూడా ఉన్నాయి.
రోజూ పెట్టుకోవడానికి ఇలాంటి డిజైన్లు కూడా చాలా మన్నికగా ఉంటాయి. ఇందులో కాస్త మందంగా ఉండే వెండి బ్యాండ్ స్టైల్ పట్టీపై రంగురంగుల పూల డిటైలింగ్ ఇచ్చారు.
ఈ రోజుల్లో ఇలాంటి పట్టీలు చాలా మోడ్రన్, ట్రెండీ లుక్‌ను ఇస్తాయి. దీని మధ్యలో బ్రోచ్ స్టైల్‌లో ఒక పువ్వు ఉంది. కింద డ్రాప్‌లెట్, అటూ ఇటూ పూసల చైన్ ఇచ్చారు.
వెండి చైన్ పట్టీలకు బదులుగా మీరు ఇలాంటి గుండ్రని పూసల పట్టీలను కూడా ఎంచుకోవచ్చు. దీని మధ్యలో పచ్చలు, కెంపు రాళ్లతో చేసిన బ్రోచ్ ఉంది. పక్కన గజ్జెలు కూడా ఇచ్చారు.
ఇలాంటి సంప్రదాయ డిజైన్ ఉన్న పట్టీలు కాళ్లకు అందాన్ని ఇవ్వడమే కాకుండా, ఏళ్ల తరబడి మన్నుతాయి కూడా. ఇందులో వెండి బ్యాండ్‌కు కింద మొత్తం గజ్జెలతో డిటైలింగ్ చేశారు.