- Home
- Telangana
- Weather Update : చలికి గుడ్ బై.. ముదురుతున్న ఎండలు, ఈ ప్రాంతాల్లోనే హయ్యెస్ట్ టెంపరేచర్స్
Weather Update : చలికి గుడ్ బై.. ముదురుతున్న ఎండలు, ఈ ప్రాంతాల్లోనే హయ్యెస్ట్ టెంపరేచర్స్
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ఇక చలి స్టోరీ ముగిసినట్లే… ఎండాకాలం ప్రారంభమైనట్లే. వేసవి ఆరంభంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఏ ప్రాంతంలో హయ్యెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయంటే..

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో చలి పూర్తిగా తగ్గిపోయింది... ఎండలు ముదురుతున్నాయి. ఉదయం, రాత్రులు కాస్త తక్కువగానే ఉష్ణోగ్రతలుంటున్నాయి... కానీ మధ్యాహ్నం సమయంలో ఎండలు మండిపోతూ ఉక్కపోత సతమతం చేస్తోంది. సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చి నిప్పులుగక్కడం ప్రారంభించాడు... దీంతో ఇప్పుడే ప్రజలు మధ్యాహ్నం రోడ్లపైకి వచ్చే జంకే పరిస్థితి ఉంది.
తెలంగాణ వెదర్ అప్డేట్స్...
ముందుగా తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్ర ప్రజలకు చలి గుడ్ బై చెప్పినట్లే. ఇప్పటివరకు 15 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి... కానీ ఇకపై పరిస్థితి పూర్తిగా మారిపోతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోయెస్ట్ టెంపరేచర్స్ కూడా 15 డిగ్రీలకు పైనే ఉంటాయని... 30 డిగ్రీలకు పైనే హయ్యెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయని హెచ్చరించింది. ఆదిలాబాద్ నుండి జనగాం వరకు అన్ని జిల్లాల్లోనూ ఇదే వాతావరణం ఉంటుందని ప్రకటించింది.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) February 12, 2026
తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే..
నిన్న (ఫిబ్రవరి 12, గురువారం) తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికం భద్రాచలంలో 33 డిగ్రీలు నమోదైంది... ఇక మహబూబ్ నగర్ 32.9, ఆదిలాబాద్ 32.8, నిజామాబాద్ 32.6, ఖమ్మం 32.6, రామగుండం 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ 13.7, మెదక్ లో 13.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఏపీ లో హయ్యెస్ట్ టెంపరేచర్స్
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి... కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు నడి వేసవి స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లా కావలిలో అయితే 35 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది... ఒంగోలు, బాపట్ల, నరసరావుపేట వంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి.
ఏపీ వెదర్ అప్డేట్స్
కోస్తా, యానాంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. రాయలసీమలో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలే ఉంటాయని తెలిపింది. ఉదయం, రాత్రి వేళల్లో కొన్నిచోట్ల పొగమంచు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

