MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • IRCTC: బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇవ్వండి బాస్‌.. త‌క్కువ ధ‌ర‌లో థాయ్‌లాండ్ టూర్‌, లైఫ్ టైమ్ మెమోరీస్ ఖాయం

IRCTC: బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇవ్వండి బాస్‌.. త‌క్కువ ధ‌ర‌లో థాయ్‌లాండ్ టూర్‌, లైఫ్ టైమ్ మెమోరీస్ ఖాయం

IRCTC: ప్ర‌తీ రంగంలో ఒత్తిడి కామ‌న్‌గా మారింది. దీంతో చాలా మంది రిలాక్సేష‌న్‌ను కోరుకుంటున్నారు. ఇందుకోసం మెజారిటీ ట్రావెలింగ్‌పై దృష్టి సారిస్తున్నారు. అలాంటి వారి కోస‌మే ఐఆర్‌సీటీసీ (IRCTC) ఆకర్షణీయమైన థాయ్‌లాండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 12 2026, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ట్రెజ‌ర్స్ ఆఫ్ థాయ్‌లాండ్ పేరుతో..
Image Credit : Gemini AI

ట్రెజ‌ర్స్ ఆఫ్ థాయ్‌లాండ్ పేరుతో..

థాయ్‌లాండ్ అందాలను చూడాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ “Treasures of Thailand” పేరుతో 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో బ్యాంకాక్, పట్టాయా వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ టూర్ ఫిబ్రవరి 26న ప్రారంభమవుతుంది. విమాన ప్రయాణంతో పాటు హోటల్ వసతి, కొన్ని ప్రధాన దర్శనాలు, భోజనాలు వంటి సదుపాయాలు ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.

25
టూర్ షెడ్యూల్ ఇదే
Image Credit : Gemini AI

టూర్ షెడ్యూల్ ఇదే

మొద‌టి రోజు – హైదరాబాద్ నుంచి బ్యాంకాక్

ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాలి. చెక్-ఇన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఉదయం 11:05 గంటలకు విమానం బయల్దేరుతుంది. సాయంత్రం 4:10 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో బస ఏర్పాటు ఉంటుంది.

రెండో రోజు – సఫారీ వరల్డ్, మెరైన్ పార్క్

ఉదయం టిఫిన్ చేసిన త‌ర్వాత సఫారీ వరల్డ్, మెరైన్ పార్క్ సందర్శన ఉంటుంది. అడవి జంతువులు, డాల్ఫిన్ షోలు వంటి ఆకర్షణలు వీక్షించవచ్చు. మధ్యాహ్న భోజనం అనంతరం షాపింగ్‌కు సమయం ఉంటుంది. రాత్రికి బ్యాంకాక్‌లోనే బస.

మూడో రోజు – బుద్ధ దేవాలయాలు, అల్కజార్ షో

మూడో రోజు గోల్డెన్ బుద్ధ, మార్బుల్ బుద్ధ ఆలయాలు సందర్శిస్తారు. సాయంత్రం పట్టాయాకు ప్రయాణం ఉంటుంది. అక్కడ ప్రసిద్ధ అల్కజార్ షోను ఆస్వాదించవచ్చు. ఇండియన్ రెస్టారెంట్‌లో భోజనం తరువాత పట్టాయాలో బస.

నాలుగో రోజు – కోరల్ ఐలాండ్, నాంగ్ నూచ్ గార్డెన్

ఉదయం కోరల్ ఐలాండ్ టూర్ ఉంటుంది. సముద్ర తీరంలో సమయం గడపవచ్చు. మధ్యాహ్నం భోజనం అనంతరం నాంగ్ నూచ్ ట్రాపికల్ గార్డెన్ సందర్శన ఉంటుంది. సాయంత్రం డిన్నర్ అనంతరం పట్టాయాలోనే బస.

ఐదో రోజు – తిరుగు ప్రయాణం

ఉదయం బ్యాంకాక్‌కు బయల్దేరి, సాయంత్రం 5:10 గంటలకు విమానం ఎక్కాలి. రాత్రి 7:35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో పర్యటన ముగుస్తుంది.

Related Articles

Related image1
OTT: రేపు జరగబోయేది ఈరోజే న్యూస్ పేపర్లో వస్తే.. ఊహకందని ట్విస్టులు బాబోయ్. ఈ వెబ్ సిరీస్ చూశారా.?
Related image2
Health: చికెన్‌లో ఈ పార్ట్స్ అస్స‌లు తిన‌కండి.. ఆరోగ్యానికి మంచిది కాదు.
35
టూర్ ప్యాకేజీలో ఉండే సదుపాయాలు
Image Credit : Gemini AI

టూర్ ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

* రౌండ్ ట్రిప్ విమాన టికెట్లు

* 4 రాత్రుల హోటల్ వసతి

* ప్రతిరోజు టిఫిన్‌

* ఎంపిక చేసిన ప్రదేశాల దర్శనం

* కొంతమేర భోజన సదుపాయం

* గైడ్ సర్వీస్

విదేశీ టూర్ ప్లాన్ చేసుకునే వారికి ఒకే చోట అన్ని ఏర్పాట్లు ఉండటం ఈ ప్యాకేజీ ప్రత్యేకత.

45
టికెట్ ధరలు
Image Credit : Gemini AI

టికెట్ ధరలు

ఈ థాయ్‌లాండ్ టూర్ ధరలు ఇలా ఉన్నాయి:

* ట్రిపుల్ షేరింగ్ – ఒక్కరికి రూ. 53,800

* డబుల్ షేరింగ్ – ఒక్కరికి రూ. 54,200

* సింగిల్ షేరింగ్ – రూ. 62,100

వసతి రకం ఆధారంగా ధరల్లో తేడా ఉంటుంది. ముందుగా బుకింగ్ చేసుకుంటే సీట్లు కాన్ఫామ్‌ చేసుకోవచ్చు.

55
బుకింగ్ విధానం, మరిన్ని వివరాలు
Image Credit : Gemini AI

బుకింగ్ విధానం, మరిన్ని వివరాలు

ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, షరతులు, అందుబాటులో ఉన్న సీట్లు తెలుసుకోవాలంటే ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ చేసి సీటు బుక్ చేసుకోవచ్చు. విదేశీ పర్యటనను తక్కువ ఖర్చుతో, భద్రంగా, సౌకర్యంగా ఎక్స్‌పీరియ‌న్స్ చేయాల‌నుకునే వారికి ఈ ప్యాకేజీ మంచి అవకాశం. కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్ అందాలను ఆస్వాదించాలనుకుంటే ఇది సరైన సమయం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రయాణం
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : ఇక తెలంగాణలో వర్షాలు.. ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఇదే..
Recommended image2
Hyderabad: 72 ఏళ్ల మ‌హిళ‌కు అరుదైన ఆప‌రేష‌న్‌.. సికింద్రాబాద్ వైద్యుల అద్భుతం
Recommended image3
ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో క‌లిసిపోవ‌డం ఖాయం.. ఈరోజు కొంటే, రేపు మీ పంట పండిన‌ట్లే
Related Stories
Recommended image1
OTT: రేపు జరగబోయేది ఈరోజే న్యూస్ పేపర్లో వస్తే.. ఊహకందని ట్విస్టులు బాబోయ్. ఈ వెబ్ సిరీస్ చూశారా.?
Recommended image2
Health: చికెన్‌లో ఈ పార్ట్స్ అస్స‌లు తిన‌కండి.. ఆరోగ్యానికి మంచిది కాదు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved