MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Vegetable price today: హైద‌రాబాద్‌లో కిలో బీన్స్ ఎంతో తెలుసా.? ధ‌ర తెలిస్తే ద‌డ పుట్టాల్సిందే..

Vegetable price today: హైద‌రాబాద్‌లో కిలో బీన్స్ ఎంతో తెలుసా.? ధ‌ర తెలిస్తే ద‌డ పుట్టాల్సిందే..

మార్కెట్ వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిత్య‌వ‌స‌ర ధ‌ర‌లు చుక్కలు చూపిస్తున్నాయి. రానున్న వారాల్లో ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంత‌కీ కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయంటే.. 

1 Min read
Author : Narender Vaitla
| Updated : Jul 15 2025, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వర్షాభావం కారణంగా సాగు తగ్గుదల
Image Credit : Google Gemini AI

వర్షాభావం కారణంగా సాగు తగ్గుదల

రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభమవ్వాల్సిన జూన్ నెలలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కూరగాయల సాగు ప్రభావితమైంది. ముఖ్యంగా టమాటా, బెండకాయ, కాకర, గోరుచిక్కుడు, దోసకాయ వంటి వాటి పంటలు దెబ్బతిన్నాయి. ఈ సీజన్‌లో 6 లక్షల ఎకరాల్లో సాగు జ‌ర‌గాల్సి ఉండగా, వాస్తవంగా కేవలం 4.2 లక్షల ఎకరాలకే పరిమితమైంది.

25
దిగుబడి త‌గ్గ‌డంతోనే
Image Credit : our own

దిగుబడి త‌గ్గ‌డంతోనే

పంటలు తక్కువ రావడంతో మార్కెట్లలో సరఫరా కొరత ఏర్పడింది. ఫలితంగా డిమాండ్‌కి తగ్గ ఉత్ప‌త్తి లేక‌పోవ‌డంతో కూరగాయలు లభించక, ధరలు భారీగా పెరిగాయి. జూన్ నెలలోనే ఈ ప్రభావం మొదలైపోయింది. తాజాగా జూలైలో ధరలు మరింత ఎగబాకుతున్నాయి.

Related Articles

Related image1
WI vs AUS: ఇదెక్క‌డి మ్యాచ్‌రా మామా.! 15 బాల్స్‌లో 5 వికెట్లు, 27 ప‌రుగుల‌కే ఆలౌట్
Related image2
Business Idea: రూ. లక్ష పెట్టుబ‌డితో నెల‌కు రూ. 2 ల‌క్ష‌లు సంపాదించే అవ‌కాశం.. ఎప్ప‌టికీ డిమాండ్ త‌గ్గ‌ని బిజినెస్ ఐడియా
35
నెల రోజుల్లోనే 60% దాకా ధరల పెరుగుదల
Image Credit : Getty

నెల రోజుల్లోనే 60% దాకా ధరల పెరుగుదల

రైతు బజార్లలో కొన్ని ముఖ్యమైన కూరగాయల ధరలు గత నెలతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. రూ. 55 ఉన్న కిలో బీన్స్ ధ‌ర ప్ర‌స్తుతం ఏకంగా రూ. 90 దాటేసి సెంచ‌రీ దిశ‌గా దూసుకెళ్తోంది. ఇక రూ. 55గా ఉన్న కిలో క్యాప్సికం ధ‌ర రూ. 80కి చేరింది. కిలో చిక్కుడు ధ‌ర రూ. 75, ప‌చ్చి మిర్చి ధ‌ర రూ. 60, బ‌జ్జీమిర్చి ధ‌ర రూ. 55, బెండ‌కాయ ధ‌ర రూ. 45కి చేరింది. కేవ‌లం నెల రోజుల్లోనే ధ‌ర‌లో భారీగా పెరుగుద‌ల క‌నిపించింది.

45
జిల్లాలవారీగా త‌గ్గిన సాగు
Image Credit : our own

జిల్లాలవారీగా త‌గ్గిన సాగు

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో 30 శాతం వరకు కూరగాయల సాగు తగ్గిపోయింది. ఇవి ప్రధానంగా పండించే ప్రాంతాలు కావడంతో మొత్తం రాష్ట్ర స్థాయిలో సరఫరా తక్కువగా ఉంది. దీంతో పరిస్థితిని సమతుల్యం చేయడానికి ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ కారణంగానే ధరలు పెరిగినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

55
ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతున్న తెలంగాణ
Image Credit : Asianet News

ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతున్న తెలంగాణ

స్థానికంగా పంటలు తక్కువగా రావడంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వ్యాపారులు దిగుమతులు చేసుకుంటున్నారు. ఈ దిగుమతుల కారణంగా మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. కాగా రానున్న శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కూరగాయ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Recommended image2
Now Playing
Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Recommended image3
Holiday: ఫిబ్ర‌వ‌రి 11న సెల‌వు.. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థ‌ల‌న్నీ బంద్‌. ఎందుకంటే.?
Related Stories
Recommended image1
WI vs AUS: ఇదెక్క‌డి మ్యాచ్‌రా మామా.! 15 బాల్స్‌లో 5 వికెట్లు, 27 ప‌రుగుల‌కే ఆలౌట్
Recommended image2
Business Idea: రూ. లక్ష పెట్టుబ‌డితో నెల‌కు రూ. 2 ల‌క్ష‌లు సంపాదించే అవ‌కాశం.. ఎప్ప‌టికీ డిమాండ్ త‌గ్గ‌ని బిజినెస్ ఐడియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved