MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • WI vs AUS: ఇదెక్క‌డి మ్యాచ్‌రా మామా.! 15 బాల్స్‌లో 5 వికెట్లు, 27 ప‌రుగుల‌కే ఆలౌట్

WI vs AUS: ఇదెక్క‌డి మ్యాచ్‌రా మామా.! 15 బాల్స్‌లో 5 వికెట్లు, 27 ప‌రుగుల‌కే ఆలౌట్

క్రికెట్ అంటేనే అద్భుతాలు. ఒక్క బాల్ మ్యాచ్ స్వ‌రూపాన్ని మార్చేస్తుంది. టీ20 హ‌వా న‌డుస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో కూడా టెస్ట్ మ్యాచ్‌ల‌ను క్రికెట్ ల‌వ‌ర్స్ ఆస్వాదిస్తున్నారు. తాజాగా జ‌రిగిన ఓ మ్యాచ్ అస‌లైన టెస్ట్ మ్యాచ్ మ‌జాను చూపించింది.  

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 15 2025, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆస్ట్రేలియా అద్భుత విజ‌యం
Image Credit : AP

ఆస్ట్రేలియా అద్భుత విజ‌యం

జమైకాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా జట్టు వేగం ముందు నిలువలేకపోయిన విండీస్ కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు కావ‌డం విశేషం. దీంతో ఈ మ్యాచ్‌కి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

25
15 బంతుల్లోనే 5 వికెట్లు
Image Credit : Mufaddal Vohra/X

15 బంతుల్లోనే 5 వికెట్లు

ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్, కేవలం 15 బంతుల్లోనే 5 వికెట్లు తీసి కొత్త రికార్డు సృష్టించాడు. ఇలా వేగంగా 5 వికెట్లు తీసిన తొలి ఆస్ట్రేలియన్ బౌలర్‌గా నిలిచాడు. అదే సమయంలో అతను తన టెస్ట్ కెరీర్‌లో 400 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. ప్రస్తుతం అతను ఆస్ట్రేలియాకి అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు.

Related Articles

Related image1
Business Idea: రూ. లక్ష పెట్టుబ‌డితో నెల‌కు రూ. 2 ల‌క్ష‌లు సంపాదించే అవ‌కాశం.. ఎప్ప‌టికీ డిమాండ్ త‌గ్గ‌ని బిజినెస్ ఐడియా
Related image2
Credit card: ఈ క్రెడిట్ కార్డు లిమిట్ అక్ష‌రాల రూ. 10 కోట్లు.. ఏడాది ఛార్జీలే రూ. 2.75 లక్షలు
35
స్కాట్‌ బోలండ్ హ్యాట్రిక్‌
Image Credit : ICC/X

స్కాట్‌ బోలండ్ హ్యాట్రిక్‌

మరోవైపు స్కాట్ బోలండ్ తన బౌలింగ్‌తో హ్యాట్రిక్ సాధించాడు. జస్టిన్ గ్రేవ్స్, షమర్ జోసెఫ్, జోమెల్ వారికన్‌లను వరుసగా ఔట్ చేసి హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన బోలండ్‌ తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

45
1955 తర్వాత రెండో అత్యల్ప స్కోరు
Image Credit : CRICKETNMORE/x

1955 తర్వాత రెండో అత్యల్ప స్కోరు

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అత్యల్ప స్కోరు 1955లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌ను 26 పరుగులకు ఆలౌట్ చేసినప్పుడు నమోదయ్యింది. ప్రస్తుతం విండీస్ చేసిన 27 పరుగులు రెండో అత్యల్ప స్కోరుగా నమోదైంది. విండీస్ జట్టు కేవలం 14.3 ఓవర్లలోనే ఆలౌట్ కావడం ఘోర పరాజయానికి నిదర్శనం.

55
డకౌట్ల పరంపర
Image Credit : CRICKETNMORE/x

డకౌట్ల పరంపర

విండీస్ బ్యాట్స్‌మెన్‌లలో ఏడు మంది డక్ అవుట్‌ అయ్యారు. స్టార్క్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి విండీస్‌ను కుదేలు చేశాడు. చివర్లో జేడెన్ సీల్స్‌ను ఔట్ చేసిన స్టార్క్ ఆ మ్యాచ్‌ను ముగించాడు. దీంతో మొత్తం కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ముగిసింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రీడలు
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Recommended image2
BCCI Central Contracts : డబ్బులు కట్.. గ్రేడ్ కట్.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఊహించని దెబ్బ
Recommended image3
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related Stories
Recommended image1
Business Idea: రూ. లక్ష పెట్టుబ‌డితో నెల‌కు రూ. 2 ల‌క్ష‌లు సంపాదించే అవ‌కాశం.. ఎప్ప‌టికీ డిమాండ్ త‌గ్గ‌ని బిజినెస్ ఐడియా
Recommended image2
Credit card: ఈ క్రెడిట్ కార్డు లిమిట్ అక్ష‌రాల రూ. 10 కోట్లు.. ఏడాది ఛార్జీలే రూ. 2.75 లక్షలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved