MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Holidays : తెలంగాణ ఉద్యోగులకు బంపరాఫర్... ఏప్రిల్ 23, 29 రెండ్రోజులు సెలవే..!

Holidays : తెలంగాణ ఉద్యోగులకు బంపరాఫర్... ఏప్రిల్ 23, 29 రెండ్రోజులు సెలవే..!

Holidays : తెలంగాణలో పనిచేసే కొందరు ఉద్యోగులు, కార్మికులకు ఏప్రిల్ 23, 29 రెండ్రోజులు ప్రత్యేక సెలవు వస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా చేసింది. ఇంతకూ ఎవరికి ఈ సెలవు వర్తిస్తుందో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 21 2026, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలంగాణలో పనిచేసేవారికి సెలవులే సెలవులు..
Image Credit : Getty

తెలంగాణలో పనిచేసేవారికి సెలవులే సెలవులు..

Holidays : తెలంగాణలోని కొందరు ఉద్యోగులు, కార్మికులకు గుడ్ న్యూస్. ఈ ఏప్రిల్ లో ఊహించని విధంగా సెలవులు వస్తున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 9న కొందరు ఉద్యోగులకు సెలవు ఇచ్చారు... ఇక ఏప్రిల్ 23, 29న మరో రెండు సెలవులు రానున్నాయి. అయితే ఈ సెలవులు అందరికీ కాదు.. కొందరు ఉద్యోగులకు మాత్రమే. అసలు ఈ సెలవులెందుకు..? ఎవరికి వర్తిస్తాయి..? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

24
ఏప్రిల్ 23న సెలవు ఎందుకు..?
Image Credit : Getty

ఏప్రిల్ 23న సెలవు ఎందుకు..?

ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది... ఇలా తమిళనాడులో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 23న కీలకమైన పోలింగ్ జరగనుంది.. అందువల్లే అక్కడ ఉద్యోగులు, కార్మికులకు అధికారిక సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

అయితే తెలంగాణలో కూడా ఉపాధి, ఉద్యోగాల కోసం చాలామంది తమిళులు నివాసముంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో తమిళ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. వీరందరికీ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది రేవంత్ సర్కార్... పోలింగ్ రోజు (ఏప్రిల్ 23) తెలంగాణలోని తమిళ ఉద్యోగులు, కార్మికులకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది.

ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారికే కాదు ప్రైవేట్ రంగంలోని తమిళులకు కూడా ఏప్రిల్ 23న అంటే ఈ గురువారం సెలవు వర్తిస్తుంది. ఇక ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, దుకాణాల్లో పనిచేసే కార్మికులకు కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఇలా తెలంగాణలోని తమిళుల సెలవుపై రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Related Articles

Related image1
Summer Trip : అందమైన దీవులు, చల్లచల్లని బీచ్ లు.. సమ్మర్ ట్రిప్ కు పర్పెక్ట్ డెస్టినేషన్..!
Related image2
Sankranti Holiday Trip : కేవలం రూ.10000 బడ్జెట్ లో హాలిడే ట్రిప్.. చలికాలంలో తప్పకుండా చూడాల్సిన టాప్ 5 స్పాట్స్
34
ఏప్రిల్ 29న సెలవే...
Image Credit : X/tomcom_gmts

ఏప్రిల్ 29న సెలవే...

కేవలం తెలంగాణలోని తమిళులకే కాదు బెంగాలీలకు కూడా ప్రత్యేక సెలవు ఇస్తోంది రేవంత్ సర్కార్. తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ లో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. కాబట్టి తమిళులతో పాటు బెంగాలీలకు కూడా ఈ గురువారం సెలవు వర్తిస్తుంది.

అయితే పశ్చిమ బెంగాల్ లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి... ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరుగనుంది. కాబట్టి ఈరోజు కూడా తెలంగాణలోని బెంగాలీలకు పెయిడ్ హాలిడే ఇస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్ లో వేలాదిమంది బెంగాలీ ఉద్యోగాలు, వివిధ వ్యాపారాలు ఉన్నాయి.. వీరందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది.

44
మలయాళీ, అస్సామీలకు సెలవే..
Image Credit : Getty

మలయాళీ, అస్సామీలకు సెలవే..

ఇటీవల అస్సాం, కేరళలో ఎన్నికలు జరిగాయి... ఈ సమయంలో కూడా తెలంగాణలోని మలయాళీలు, అస్సామీలకు సెలవు ఇచ్చింది ప్రభుత్వం. ఏప్రిల్ 9న కేరళ, అస్సాంలో పోలింగ్ జరిగింది... తెలంగాణలో పనిచేసే వేలాదిమంది మలయాళ నర్సులు, ఇతర ఉద్యోగులు... అస్సాంకు చెందిన కార్మికులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వం పెయిడ్ హాలిడే ఇవ్వండంవల్ల వీళ్లంతా ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
రాజకీయాలు
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఏషియానెట్ న్యూస్
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Revanth Reddy Super Speech: ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్ | TS Congress | Asianet News Telugu
Recommended image2
Now Playing
IMD Rain Alert: Thunderstorms, Hailstorms in These Districts; Orange Alert | Asianet News Telugu
Recommended image3
KCR: ఉట్టి తెగదు పిల్లి కోరిక తీరదు.. కేసీఆర్ చెప్పిన ఈ సామెత అర్థం ఏంటో తెలుసా.?
Related Stories
Recommended image1
Summer Trip : అందమైన దీవులు, చల్లచల్లని బీచ్ లు.. సమ్మర్ ట్రిప్ కు పర్పెక్ట్ డెస్టినేషన్..!
Recommended image2
Sankranti Holiday Trip : కేవలం రూ.10000 బడ్జెట్ లో హాలిడే ట్రిప్.. చలికాలంలో తప్పకుండా చూడాల్సిన టాప్ 5 స్పాట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved