MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Telangana Rains : ఈ మూడు జిల్లాల ప్రజలు బిఅలర్ట్... నేడు కుండపోత వానలకు ఛాన్స్

Telangana Rains : ఈ మూడు జిల్లాల ప్రజలు బిఅలర్ట్... నేడు కుండపోత వానలకు ఛాన్స్

జులై 9 బుధవారం అంటే నేడు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఓ మూడు జిల్లాల్లో కుండపోత వానలకు ఛాన్స్ ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ చేసింది. కాబట్టి ఆ జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త.. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 09 2025, 09:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలంగాణలో నేడు భారీ వర్షాలు
Image Credit : Getty

తెలంగాణలో నేడు భారీ వర్షాలు

Telugu States Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకైతే ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. జూన్ లో లోటు వర్షపాతం నమోదవగా జులైలో అయినా వరుణుడు కరుణిస్తాడని తెలుగు ప్రజలు భావించారు. భారత వాతావరణ శాఖ (IMD) కూడా ఈ నెలంతా భారీ వర్షాలుంటాయి తెలిపింది. కానీ జులైలో కూడా తొమ్మిదో రోజుకు చేరుకున్నాం... కానీ ఇప్పటివరకు ఒకట్రెండుసార్లు భారీ వర్షాలు కురిసాయి.. అదికూడా కొన్నిచోట్ల మాత్రమే.

ఇప్పటివరకు అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసిందే లేదు. దీంతో జులై కూడా జూన్ లాగే లోటువర్షపాతంలో షాకిస్తుందా అన్న కంగారు ప్రజల్లో మరీముఖ్యంగా తెలుగు రైతుల్లో మొదలయ్యింది.

అయితే ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని... బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో కూడా అల్పపీడనం, ఆవర్తనం, ద్రోణి వంటివి ఏర్పడుతూ వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకోనున్నాయని... తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు... ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

26
ఈ తెలంగాణ జిల్లాల్లో కుండపోతే...
Image Credit : Getty

ఈ తెలంగాణ జిల్లాల్లో కుండపోతే...

జులై 9 అంటే బుధవారం తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కొమ్రంబీ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలకు బలమైన ఈదురుగాలులు తోడయి ప్రమాదాలు సంభవించే అవకాశాలుంటాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Related Articles

Related image1
Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు ... నేడు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Related image2
Rains Alert : ఈ తెలుగు జిల్లాల్లో భారీ వర్షాలు... పోటెత్తుతున్న నీరు, పొంచివున్న వరద ప్రమాదం
36
ఈ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Image Credit : Getty

ఈ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఇక నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల సమయంలో వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉంటుంది... కాబట్టి ఈ జిల్లాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు వర్ష సమయంలో చెట్లకింద, తాత్కాలిక నిర్మాణాల్లో ఉండకూడదని... సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

46
నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
Image Credit : Getty

నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ మూడ్రోజులు (బుధ, గురు, శుక్రవారం) మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలకు ఉరుములు మెరుపులు, బలమైన ఈదురుగాలులు తోడవుతాయని హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని... తీరం వెంబడి ఈ గాలులు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

నేడు(బుధవారం) వర్షాల విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. అలాగే ఏలూరు, ఎన్టిఆర్, గుంటూరు, పల్నాడు. ప్రకాశం, కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఇక మిగతాజిల్లాల్లో వర్షాలు లేకున్నా ఆకాశం మేఘాలతో కమ్మేసి వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

56
 కృష్ణమ్మ పరవళ్ళు
Image Credit : Getty

కృష్ణమ్మ పరవళ్ళు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు లేకున్నా ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదుల్లో భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో ఈ నదులపైని జలాశయాలు నిండుకుండల్లా తలపిస్తున్నాయి... వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం దాదాపు 2 లక్షల క్యూసెక్కుల ఇన్ ప్లో కొనసాగుతోంది. దీంతో జలాశయం నిండిపోవడం నిన్న(మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జలాశయం గేట్లను ఎత్తారు.. ఇలా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్న శ్రీశైలం జలాశయంలోంచి నీటిని దిగువకు వదులుతున్నారు.

66
నిండుకుండల్లా తెలుగు రాాష్ట్రాల్లోని జలాశయాలు
Image Credit : our own

నిండుకుండల్లా తెలుగు రాాష్ట్రాల్లోని జలాశయాలు

జూరాల ప్రాజెక్ట్‌కు కూడా భారీగా వరద చేరుతోంది.... దీంతో 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1.25 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 1.26 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత 317.660 మీటర్లకు చేరుకుంది. అంటే ఇది పూర్తిగా నిండినట్లే.

ఇక నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 60 వేల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో సాగర్‌కు వరద ప్రవాహం మరింత పెరిగింది. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 531.40 అడుగులుగా ఉంది. ఈ నెలాఖరునాటికి పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad: 72 ఏళ్ల మ‌హిళ‌కు అరుదైన ఆప‌రేష‌న్‌.. సికింద్రాబాద్ వైద్యుల అద్భుతం
Recommended image2
ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో క‌లిసిపోవ‌డం ఖాయం.. ఈరోజు కొంటే, రేపు మీ పంట పండిన‌ట్లే
Recommended image3
Telangana Municipal Elections 2026 : ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
Related Stories
Recommended image1
Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు ... నేడు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Recommended image2
Rains Alert : ఈ తెలుగు జిల్లాల్లో భారీ వర్షాలు... పోటెత్తుతున్న నీరు, పొంచివున్న వరద ప్రమాదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved