MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad: 72 ఏళ్ల మ‌హిళ‌కు అరుదైన ఆప‌రేష‌న్‌.. సికింద్రాబాద్ వైద్యుల అద్భుతం

Hyderabad: 72 ఏళ్ల మ‌హిళ‌కు అరుదైన ఆప‌రేష‌న్‌.. సికింద్రాబాద్ వైద్యుల అద్భుతం

Hyderabad: సాధార‌ణంగా 72 ఏళ్ల వ‌య‌సున్న వారికి గుండె ప‌రీక్ష‌లు చేయాల్సి వ‌స్తే ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీగా చేస్తుంటారు. అయితే సికింద్రాబాద్ వైద్యులు ఓ మ‌హిళ‌కు వాల్వ్ చికిత్స చేసి అద్భుతాన్ని సృష్టించింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 11 2026, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఓపెన్ సర్జరీ లేకుండానే గుండె వాల్వ్ సమస్యకు పరిష్కారం
Image Credit : Freepik

ఓపెన్ సర్జరీ లేకుండానే గుండె వాల్వ్ సమస్యకు పరిష్కారం

సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో 72 ఏళ్ల మహిళకు ఛాతీ తెరవకుండానే గుండె వాల్వ్ చికిత్స చేసి వైద్య బృందం మరో మైలురాయి సాధించింది. అధిక వయస్సు కారణంగా సాంప్రదాయ ఓపెన్ హార్ట్ ఆపరేషన్ ప్రమాదకరంగా మారే పరిస్థితుల్లో ఈ విధానం ఆశాజనకంగా మారింది.

23
మిట్ర‌ల్ వాల్వ్‌లో లీకేజ్
Image Credit : Asianet News

మిట్ర‌ల్ వాల్వ్‌లో లీకేజ్

కొన్ని నెలలుగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చిన్న‌చిన్న ప‌నుల‌కే తీవ్రమైన ఆయాసం, అలసట వంటి సమస్యలు కనిపించాయి. కుటుంబ సభ్యులు ఇవి వయస్సు ప్రభావమని భావించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే పరిస్థితి మరింత దిగజారి గుండె వైఫల్య లక్షణాలతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. పరీక్షల్లో మిట్రల్ వాల్వ్‌లో తీవ్రమైన లీకేజ్ ఉన్నట్టు తేలింది. వైద్యుల అంచనా ప్రకారం 65 ఏళ్లు దాటిన వారిలో వాల్వ్ సమస్యలు సాధారణమే అయినా, అవగాహన లోపంతో ఆలస్యంగా గుర్తించే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి.

ఓపెన్ హార్ట్ సర్జరీకి బదులుగా ప్రత్యామ్నాయం

ఆమె వయస్సు, ఇతర ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ ప్రమాదకరం అని నిపుణులు భావించారు. దీంతో కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, అనస్తీషియా విభాగాల నిపుణులతో కూడిన హార్ట్ టీమ్ కేసును సమగ్రంగా పరిశీలించింది. రోగి స్థితికి అనుగుణంగా మినిమల్ ఇన్వేసివ్ విధానాన్ని ఎంపిక చేశారు.

Related Articles

Related image1
Numerology: ఈ తేదీలో పుట్టిన వారు ఒక్క‌సారైనా తిరుమ‌ల ఆల‌యాన్ని ద‌ర్శించుకోవాలి.. ఎందుకంటే.?
Related image2
ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో క‌లిసిపోవ‌డం ఖాయం.. ఈరోజు కొంటే, రేపు మీ పంట పండిన‌ట్లే
33
కాథెటర్ ద్వారా ఆధునిక చికిత్స
Image Credit : Asianet News

కాథెటర్ ద్వారా ఆధునిక చికిత్స

డా. ప్రమోద్ కుమార్ కుచులకంటి నేతృత్వంలో డా. సాగర్ చంద్రశేఖర్ భుయార్, డా. ఎన్. శివ ప్రసాద్ నాయుడు, డా. అమరేంద్ర కుమార్ సింగ్, డా. పర్వత్రాజ్ వరుణ్ గౌతమ్, డా. సుబ్రహ్మణ్యం కలిసి ప్రత్యేక విధానంతో చికిత్స నిర్వహించారు. కాలి రక్తనాళం ద్వారా సన్నని ట్యూబ్‌ను గుండె వరకు చేర్చి, ఆధునిక ఇమేజింగ్ పద్ధతుల సహాయంతో వాల్వ్ లీకేజ్‌ను గణనీయంగా తగ్గించారు. ఈ ప్రక్రియలో ఛాతీ తెరవాల్సిన అవసరం లేకపోవడం, రక్తస్రావం తక్కువగా ఉండడం ప్రధాన ప్రయోజనాలు.

రోగిలో స్పష్టమైన మెరుగుదల

చికిత్స అనంతరం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉంది. శ్వాసలో గణనీయమైన మార్పు కనిపించడంతో రోజువారీ పనులను స్వయంగా నిర్వహించగలుగుతున్నారు. డా. ప్రమోద్ కుమార్ కుచులకంటి మాట్లాడుతూ, వృద్ధుల్లో కనిపించే అలసట, శ్వాసకోశ ఇబ్బందులను తేలికగా తీసుకోకూడదన్నారు. ముందస్తు పరీక్షలతో సమస్యను గుర్తిస్తే సురక్షితమైన ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మెడికవర్ ఆసుపత్రి వర్గాలు ఇలాంటి అత్యాధునిక గుండె చికిత్సలను మరింత మందికి చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో క‌లిసిపోవ‌డం ఖాయం.. ఈరోజు కొంటే, రేపు మీ పంట పండిన‌ట్లే
Recommended image2
Telangana Municipal Elections 2026 : పట్టణ ఓటర్ల తీర్పు.. కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
Recommended image3
Weather Update : ఇవేం ఎండల్రా నాయనా..! ఇప్పుడే తెలంగాణలో 34, ఏపీలో 35 డీగ్రీల టెంపరేచర్
Related Stories
Recommended image1
Numerology: ఈ తేదీలో పుట్టిన వారు ఒక్క‌సారైనా తిరుమ‌ల ఆల‌యాన్ని ద‌ర్శించుకోవాలి.. ఎందుకంటే.?
Recommended image2
ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో క‌లిసిపోవ‌డం ఖాయం.. ఈరోజు కొంటే, రేపు మీ పంట పండిన‌ట్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved