MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • School Holidays : జూన్ సగం వేసవి సెలవులే.. మిగతా రోజుల్లో వచ్చే హాలిడేస్ ఇవే

School Holidays : జూన్ సగం వేసవి సెలవులే.. మిగతా రోజుల్లో వచ్చే హాలిడేస్ ఇవే

వేసవి సెలవులు ముగుస్తున్నాయని బాధ పడుతున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. వేసవి సెలవులు ముగిసినా జూన్ లో మరికొన్ని సెలవులు వస్తున్నాయి. ఆ సెలవుల లిస్ట్ ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 24 2025, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వేసవి సెలవుల తర్వాత వచ్చే హాలిడేస్ ఇవే
Image Credit : our own

వేసవి సెలవుల తర్వాత వచ్చే హాలిడేస్ ఇవే

Holidays : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 24న ప్రారంభమైన సెలవులు మే మొత్తం కొనసాగి జూన్ 11న ముగియనున్నాయి. జూన్ 12న ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్నాయి. అంటే మరో పదిహేను ఇరవై రోజుల్లో విద్యార్థులంతా స్కూల్ బాట పడతారు. నెల నెలన్నర రోజులు హాయిగా వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు ఒక్కసారిగా స్కూల్ కి వెళ్లాలంటే బారంగా భావిస్తారు.

అయితే విద్యార్థులకు జూన్ లో సగంరోజులు వేసవి సెలవులతోనే ముగుస్తాయి. మిగతా రోజుల్లో ఆదివారాలు, రెండో శనివారం, కొన్ని ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. ఇలా ఐదారు రోజులు విద్యాసంస్థలకు సెలవులు వస్తున్నాయి. కాబట్టి జూన్ లో వేసవి సెలవులు ముగిసాక స్కూల్ కి వెళ్ళడానికి బాధపడే విద్యార్థులకు ఈ సెలవులు కాస్త ఊరట ఇస్తాయి.

25
జూన్ లో సెలవులే సెలవులు
Image Credit : our own

జూన్ లో సెలవులే సెలవులు

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని విద్యాసంస్థలన్ని జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే జూన్ నెల ప్రారంభంనుండే జూనియర్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. వారికి జూన్ 7న బక్రీద్ సెలవు కలిసిరానుంది. ఈ పండగ సందర్భంగా జూన్ లో మొదటి శనివారం సెలవు వస్తోంది... ఆ తర్వాత ఆదివారం సాధారణ సెలవే. ఇలా వరుసగా రెండ్రోజులు ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు ఉద్యోగులకు సెలవు వస్తోంది. స్కూల్ విద్యార్థులకు మాత్రం ఇది వేసవి సెలవుల్లో కలిసిపోతుంది.

Related Articles

Related image1
Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే సమాచారం.. సమ్మర్ హాలిడేస్ ముగిసాక కూడా మరో 100 రోజుల సెలవులు
Related image2
Holidays : తెలుగు విద్యార్థులకు తీపికబురు... ఇలా వేసవి సెలవులు ముగియగానే అలా మరిన్ని సెలవులు
35
జూన్ 14, 15 సెలవులు
Image Credit : social media

జూన్ 14, 15 సెలవులు

జూన్ రెండోవారంలో మరోసారి లాంగ్ వీకెండ్ వస్తోంది. వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు ప్రారంభంకాగానే ఇలా సెలవులు వస్తాయన్న వార్త విద్యార్థులను ఖుషీ చేయనుంది. జూన్ 12న తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకుని రెండ్రోజులు నడుస్తాయో లేదో మరో రెండ్రోజులు సెలవులు వస్తాయి. జూన్ 14న రెండో శనివారం విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఇక ఆ తర్వాతిరోజు జూన్ 15 ఆదివారం. ఎలాగూ సాధారణ సెలవు ఉంటుంది. అయితే ఈ ఆదివారం ముస్లింల పర్వదినం ఈద్ ఇ గదీర్ ఉంది... దీంతో తెలంగాణ, ఏపీలో అప్షనల్ హాలిడే ఇచ్చినా ఆదివారంతో కలిసిపోయింది.

45
జూన్ చివర్లో లాంగ్ వీకెండ్
Image Credit : our own

జూన్ చివర్లో లాంగ్ వీకెండ్

ఇక జూన్ 22న ఆదివారం మరో సెలవు వస్తోంది. ఆ తర్వాత జూన్ 27న రథయాత్ర సందర్భంగా ఏపీ, తెలంగాణలో ఐచ్చిక సెలవు ప్రకటించారు. 29న మళ్లీ ఆదివారం సెలవు. అయితే కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు శనివారం కూడా సెలవు ఉంటుంది... వారికి జూన్ 28న కూడా సెలవే అన్నమాట. అంటే కొందరు విద్యార్థులకు జూన్ 27, 28, 29 మూడ్రోజులు సెలవు ఉండే అవకాశాలున్నాయి. 

55
జూన్ లో వర్షాల సెలవులు ఉంటాయా?
Image Credit : our own

జూన్ లో వర్షాల సెలవులు ఉంటాయా?

ఇక జూన్ మొదటివారంలోనే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటాయి. ఇవి ఇరు రాష్ట్రాల్లో విస్తరించడంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయి. ఈ వర్షాలు, వరద పరిస్థితుల కారణంగా కూడా విద్యాసంస్ధలకు సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
విద్య

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?
Recommended image2
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image3
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Related Stories
Recommended image1
Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే సమాచారం.. సమ్మర్ హాలిడేస్ ముగిసాక కూడా మరో 100 రోజుల సెలవులు
Recommended image2
Holidays : తెలుగు విద్యార్థులకు తీపికబురు... ఇలా వేసవి సెలవులు ముగియగానే అలా మరిన్ని సెలవులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved