MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Whatsapp: వాట్సాప్‌లో మెసేజ్ ట్రాన్స్‌లేష‌న్ ఫీచ‌ర్‌.. ఎలా ప‌నిచేస్తుందంటే.?

Whatsapp: వాట్సాప్‌లో మెసేజ్ ట్రాన్స్‌లేష‌న్ ఫీచ‌ర్‌.. ఎలా ప‌నిచేస్తుందంటే.?

Whatsapp: ప్ర‌పంచంలో ఎక్కువ మంది ఉప‌యోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొద‌టి వ‌రుస‌లో ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొంగొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకొస్తుంది కాబ‌ట్టే వాట్సాప్‌కు ఇంత క్రేజ్ ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా వాట్సాప్ కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది. 

1 Min read
Author : Narender Vaitla| ANI
Published : Sep 24 2025, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వాట్సాప్‌లో మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచ‌ర్
Image Credit : Generated by google gemini AI

వాట్సాప్‌లో మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచ‌ర్

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇది వరకే వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్‌గా మార్చే సదుపాయాన్ని ప్రవేశపెట్టిన వాట్సాప్, ఇప్పుడు సందేశాలను యూజర్ కోరిన భాషలో చదివే అవకాశం కూడా ఇవ్వ‌నుంది. వాట్సాప్ బ్లాగ్ ప్రకారం, ఈ ఫీచర్ భాష అంతరాలను తొలగించడానికి ప్రత్యేకంగా రూపొందించిన‌ట్లు తెలిపింది.

25
ఏ సందర్భాల్లో ఉపయోగించవచ్చు?
Image Credit : Getty

ఏ సందర్భాల్లో ఉపయోగించవచ్చు?

ఈ ఫీచర్ వ్యక్తిగత చాట్స్, గ్రూప్ సందేశాలు, అలాగే ఛానల్స్‌లో వచ్చే మెసేజ్‌లకు కూడా వర్తిస్తుంది. ఆండ్రాయిడ్, iOS యూజర్లకు ప్ర‌స్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచ‌ర్‌ను త్వ‌ర‌లోనే ఇత‌ర యూజర్లకు అందుబాటులోకి తీసుకున్నారు. ఆండ్రాయిడ్‌లో ప్రస్తుతానికి ఇంగ్లిష్, హిందీ, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్, అరబిక్ భాషలకు స‌పోర్ట్ చేస్తుండ‌గా.. iOS యూజర్లు మొత్తం 19 భాషలలో అనువాదం పొందగలుగుతారు.

Related Articles

Related image1
Gemini AI: మీక్కూడా ఇలాంటి ఫొటోలు కావాలా.? దుర్గా పూజ లుక్స్ కోసం ఏఐ ప్రాంప్ట్స్ ఇవే.
Related image2
Dasara: 15 కిలోల గొర్రె, బ్లెండర్ స్ప్రైడ్ ఫుల్ బాటిల్.. దసరా పండక్కి కిక్కిచ్చే లక్కీ డ్రా. ఎక్కడంటే?
35
మెసేజ్‌ను ట్రాన్స్‌లేట్ చేసే విధానం
Image Credit : Getty

మెసేజ్‌ను ట్రాన్స్‌లేట్ చేసే విధానం

వాట్సప్‌లో మెసేజ్ ట్రాన్స్‌లేట్ చేయాల‌నుకుంటే ముందుగా మీరు ఆ మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి. అప్పుడు “Translate” అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఎంచుకుని మీరు కావలసిన భాషను సెలెక్ట్ చేస్తే, ఆ సందేశం వెంటనే ట్రాన్స్‌లేట్ అవుతుంది. ఆండ్రాయిడ్ యూజర్లకు “Auto-Translation” సదుపాయం కూడా ఉంది, దీన్ని ఎంచుకుంటే వచ్చే ప్రతి సందేశం ఆటోమేటిక్‌గా మీకు న‌చ్చిన భాష‌లోకి మారుతుంది.

45
గోప్యతకు పెద్ద పీట
Image Credit : Getty

గోప్యతకు పెద్ద పీట

ఈ ట్రాన్స్‌లేష‌న్‌ ప్రక్రియ డివైజ్‌లోనే జరుగుతుంది. అంటే, మీ సందేశాలను సర్వర్‌లోకి పంపి చదవడం జరుగదు. వాట్సాప్ AI సదుపాయాలతో ఈ ఫీచర్ రూపొందించినందున, భవిష్యత్‌లో మరిన్ని భాషలకు స‌పోర్ట్ చేసే విధంగా ల‌క్ష్యంగా పెట్టుకుంది.

55
భవిష్యత్ ప్రణాళికలు
Image Credit : Asianet News

భవిష్యత్ ప్రణాళికలు

వాట్సాప్ ఈ ఫీచర్ ద్వారా భాషా అవరోధాలను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. యూజ‌ర్లు వివిధ భాషల్లో వచ్చిన సందేశాలను తక్షణమే అర్థం చేసుకోవడం ద్వారా చాట్ అనుభవం మరింత సులభం అవుతుంది. అలాగే AI ఆధారిత ఫీచర్ల ద్వారా, భవిష్యత్‌లో మరిన్ని భాషలకు, అంతర్జాతీయ వినియోగదారులకు కూడా ఈ సదుపాయం విస్తరించబడే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphone Tricks : మీ ఫోన్‌లో వైరస్ ఉందా..? ఈ లక్షణాలతో వెంటనే కనిపెట్టేయండి
Recommended image2
AI కాదు ఇక ఆంత్రోపిక్ ఏఐ .. అంటే ఏమిటి..? ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
Recommended image3
Indias Sarvam AI : తగ్గేదే లే.. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినిని మడతపెట్టేసిన మన సర్వం ఏఐ !
Related Stories
Recommended image1
Gemini AI: మీక్కూడా ఇలాంటి ఫొటోలు కావాలా.? దుర్గా పూజ లుక్స్ కోసం ఏఐ ప్రాంప్ట్స్ ఇవే.
Recommended image2
Dasara: 15 కిలోల గొర్రె, బ్లెండర్ స్ప్రైడ్ ఫుల్ బాటిల్.. దసరా పండక్కి కిక్కిచ్చే లక్కీ డ్రా. ఎక్కడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved