MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • విరాట్ కోహ్లీ దెబ్బ.. ఐసీసీ అబ్బ !

విరాట్ కోహ్లీ దెబ్బ.. ఐసీసీ అబ్బ !

Virat Kohli : రాంచీలో దక్షిణాఫ్రికాపై చారిత్రక సెంచరీ సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నాల్గవ స్థానానికి ఎగబాకారు. ఆయన కేవలం 32 రేటింగ్ పాయింట్ల దూరంలోనే అగ్రస్థానంలో ఉన్న రోహిత్ శర్మకు గట్టి పోటీ ఇస్తున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 03 2025, 04:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ గట్టి పోటీ
Image Credit : Getty

రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ గట్టి పోటీ

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ జోరు కొనసాగుతోంది. అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ను దుమ్మేరేపాడు. తాజా ర్యాంకింగ్స్‌లో భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనతో భారీగా ఎగబాకారు. రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో సాధించిన చారిత్రక సెంచరీ కారణంగా ఈ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ దూసుకెళ్లాడు.

మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగుల ఇన్నింగ్స్ ఆడి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్ అనంతరం విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం, కోహ్లీ ప్రస్తుతం నాలుగవ స్థానానికి చేరుకున్నారు. దీంతో ఆయన మళ్లీ వన్డే ఫార్మాట్‌లో బ్యాటింగ్‌లో తన గత టాప్ స్థానాన్ని దక్కించుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.

25
టాప్ ప్లేస్ కు 32 పాయింట్ల దూరంలో కోహ్లీ
Image Credit : X/BCC

టాప్ ప్లేస్ కు 32 పాయింట్ల దూరంలో కోహ్లీ

తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌ ప్రకారం, విరాట్ కోహ్లీ రేటింగ్ పాయింట్లు 751కి పెరిగాయి. ఆయన ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ (783 పాయింట్లు) కంటే కేవలం 32 రేటింగ్ పాయింట్ల దూరంలో ఉన్నారు. దీంతో కోహ్లీ మరోసారి ప్రపంచ నంబర్ వన్ వన్డే బ్యాట్స్‌మెన్‌గా అవతరించే అవకాశాలు బలంగా ఉన్నాయి.

గతంలో, కోహ్లీ మూడు సంవత్సరాలకు పైగా వన్డే బ్యాటింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగాడు. అయితే ఏప్రిల్ 2021లో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజం ఆయనను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు టాప్-5లో స్థానం కోల్పోయిన కోహ్లీ, ఇప్పుడు మళ్లీ అగ్రస్థానం కోసం పోటీలోకి రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ, కోహ్లీ మధ్య కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ రెండో స్థానంలో ఉండగా, అఫ్ఘానిస్తాన్ యువ బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్ మూడవ స్థానంలో ఉన్నాడు.

Related Articles

Related image1
విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం: గంభీర్‌తో విభేదాలు? వన్డే కెరీర్‌ ప్రశ్నార్థకం !
Related image2
యూటర్న్ తీసుకున్న విరాట్ కోహ్లీ.. అభిమానులకు పండగే మరి !
35
శుభ్‌మన్ గిల్‌కు షాక్..
Image Credit : X/BCC

శుభ్‌మన్ గిల్‌కు షాక్..

ఒకరికి లాభం వస్తే, మరొకరికి నష్టం తప్పదు అన్నట్టుగా, కోహ్లీ ర్యాంకింగ్ మెరుగుపడటంతో భారత ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ కు దెబ్బతగిలింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్న గిల్‌, తాజా ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం కోల్పోయి ఐదవ స్థానానికి పడిపోయారు. అయినప్పటికీ, టాప్-10 వన్డే బ్యాటర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు గిల్ కూడా కొనసాగడం భారత క్రికెట్‌కు శుభపరిణామం.

పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం ఒకప్పుడు నంబర్-1 స్థానంలో ఉన్నప్పటికీ, తాజా ర్యాంకింగ్స్‌లో ఆయన ఆరవ స్థానంలోకి పడిపోయాడు. టాప్-10 బ్యాటర్ల జాబితాలో ఆరవ స్థానం నుంచి పదవ స్థానం వరకు ఎటువంటి మార్పులు లేవు.

45
రోహిత్ శర్మ నెంబర్1 కుర్చీకి ప్రమాదం
Image Credit : X/@BCCI

రోహిత్ శర్మ నెంబర్1 కుర్చీకి ప్రమాదం

భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, కోహ్లీ దూకుడుతో ఆయన నంబర్-1 స్థానానికి ప్రమాదం పొంచి ఉంది. దక్షిణాఫ్రికాపై మొదటి వన్డేలో రోహిత్ 57 పరుగుల మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఆయన, కోహ్లీతో కలిసి 136 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. అయినప్పటికీ, కోహ్లీ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి అతి తక్కువ దూరంలో ఉండటంతో, రాబోయే మ్యాచుల ఫలితాలను బట్టి ర్యాంకింగ్స్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

55
బౌలర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్‌కు జంప్
Image Credit : X/@BCCI

బౌలర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్‌కు జంప్

బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మార్పులతో పాటు, వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్, తన నిలకడైన ప్రదర్శనతో వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం ఎగబాకి ఆరవ స్థానానికి చేరుకున్నారు. ఆయన నిలకడైన బౌలింగ్ టీమిండియాకు బలాన్ని అందిస్తోంది.

న్యూజిలాండ్‌కు చెందిన స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఒక స్థానం దిగజారి ఏడవ స్థానానికి చేరుకున్నారు. అఫ్ఘానిస్తాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ నంబర్-1 వన్డే బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్ రెండవ స్థానంలో, దక్షిణాఫ్రికా ఆటగాడు కేశవ్ మహారాజ్ మూడవ స్థానంలో ఉన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
విరాట్ కోహ్లీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : ఐసీసీ దెబ్బకు దారిలోకి వచ్చిన పాక్.. నవ్వులపాలవుతున్న నఖ్వీ డ్రామా
Recommended image2
T20 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎలా చూడొచ్చు.? రీఛార్జ్ ఆప్ష‌న్స్ ఇవే
Recommended image3
T20 World Cup : రెండుసార్లు టీమిండియాను టీ20 విజేతగా నిలిపిన తోపు ప్లేయర్.. ధోని, కోహ్లీ కాదు, మరెవరు?
Related Stories
Recommended image1
విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం: గంభీర్‌తో విభేదాలు? వన్డే కెరీర్‌ ప్రశ్నార్థకం !
Recommended image2
యూటర్న్ తీసుకున్న విరాట్ కోహ్లీ.. అభిమానులకు పండగే మరి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved