MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • గిల్, హార్దిక్ రీఎంట్రీ.. స్టార్లకు షాక్.. సౌతాఫ్రికా T20 సిరీస్‌కు టీమిండియా ఇదే

గిల్, హార్దిక్ రీఎంట్రీ.. స్టార్లకు షాక్.. సౌతాఫ్రికా T20 సిరీస్‌కు టీమిండియా ఇదే

Team India Squad : సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. శుభ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చారు. రింకూ సింగ్, నితీశ్‌ కుమార్ రెడ్డిలకు జట్టులో చోటు లభించలేదు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 03 2025, 07:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కు 15 మందితో భారత జట్టు
Image Credit : X/BCCI

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కు 15 మందితో భారత జట్టు

దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం అధికారికంగా భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న ఈ స్క్వాడ్‌లో కీలక ఆటగాళ్ల రీఎంట్రీలు, కొన్ని ఆశ్చర్యకర మార్పులు జరిగాయి.

ముఖ్యంగా గాయాల నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా, యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులో చేరుతున్నారు. అయితే తమ ఫామ్‌తో ఆకట్టుకుంటున్న రింకూ సింగ్, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిలకు స్క్వాడ్‌లో చోటు దక్కకపోవడం అభిమానుల్లో నిరాశను కలిగించింది.

25
గిల్, హార్దిక్ తిరిగి జట్టులోకి.. కానీ చిన్న ట్విస్ట్
Image Credit : Getty

గిల్, హార్దిక్ తిరిగి జట్టులోకి.. కానీ చిన్న ట్విస్ట్

గత నెల టెస్టు సిరీస్‌లో మెడ నొప్పి కారణంగా గిల్ మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా ఫిట్‌నెస్ మెరుగుపడడంతో సెలెక్టర్లు అతన్ని టీ20 జట్టులో చేర్చారు. అయితే అతడు నిజంగా ఆడతాడా? లేదా అనేది బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నుండి వచ్చే ఫిట్‌నెస్ రిపోర్టుపైనే ఆధారపడి ఉంటుంది.

హార్దిక్ పాండ్యా విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆసియా కప్ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తిరిగి మైదానంలో అడుగు పెట్టి ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో తిరిగి జట్టులోకి రావడానికి మార్గం సుగమమైంది.

Related Articles

Related image1
సౌతాఫ్రికాను రాయ్‌పూర్‌లో రప్ఫాడించిన రుతురాజ్‌ గైక్వాడ్
Related image2
విరాట్ కోహ్లీ విధ్వంసం: సఫారీలపై వరుసగా 3వ సెంచరీ.. వన్డేల్లో రికార్డుల సునామీ
35
రింకూ సింగ్, నితీశ్ రెడ్డి ఔట్ తో అభిమానుల్లో అసంతృప్తి
Image Credit : Getty

రింకూ సింగ్, నితీశ్ రెడ్డి ఔట్ తో అభిమానుల్లో అసంతృప్తి

మిడిల్ ఆర్డర్‌లో కీలక అవకాశాలు అందుకున్నప్పుడల్లా మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన రింకూ సింగ్ ఈసారి స్క్వాడ్‌లో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా రీఎంట్రీ కోసం రింకూనే పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

అలాగే, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా పర్యటనకు ఎంపిక కాలేదు. ఈ ఇద్దరిని జట్టులోకి తీసుకోకపోవడం పై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.

45
బుమ్రా, సంజూ, జితేశ్‌లతో మరింత బలంగా భారత్
Image Credit : Getty

బుమ్రా, సంజూ, జితేశ్‌లతో మరింత బలంగా భారత్

ప్రస్తుతం వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, పూర్తి ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్లు సంజూ శాంసన్, జితేశ్ శర్మలను స్క్వాడ్‌లో కొనసాగించారు. అక్షర్ పటేల్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి యంగ్ టాలెంట్‌తో జట్టు బ్యాలెన్స్‌గా కనిపిస్తోంది.

2026 టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లో ప్రదర్శన కీలకమని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన స్క్వాడ్‌నే వరల్డ్ కప్ జట్టుగా తీసుకెళ్లే అవకాశాలున్నాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

55
IND vs SA T20 : పూర్తి స్క్వాడ్, టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే
Image Credit : ANI

IND vs SA T20 : పూర్తి స్క్వాడ్, టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, శివమ్ దూబే, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.

ఇండియా vs సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్

  1. డిసెంబర్ 9 కటక్
  2. డిసెంబర్ 11 ముల్లాన్‌పూర్
  3. డిసెంబర్ 14 ధర్మశాల
  4. డిసెంబర్ 17 లక్నో
  5. డిసెంబర్ 19 అహ్మదాబాద్

భారత జట్టు ఈ సిరీస్‌ విజయంతో 2026 వరల్డ్ కప్ ప్రయాణాన్ని ప్రారంభించాలని చూస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎలా చూడొచ్చు.? రీఛార్జ్ ఆప్ష‌న్స్ ఇవే
Recommended image2
T20 World Cup : రెండుసార్లు టీమిండియాను టీ20 విజేతగా నిలిపిన తోపు ప్లేయర్.. ధోని, కోహ్లీ కాదు, మరెవరు?
Recommended image3
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Related Stories
Recommended image1
సౌతాఫ్రికాను రాయ్‌పూర్‌లో రప్ఫాడించిన రుతురాజ్‌ గైక్వాడ్
Recommended image2
విరాట్ కోహ్లీ విధ్వంసం: సఫారీలపై వరుసగా 3వ సెంచరీ.. వన్డేల్లో రికార్డుల సునామీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved