MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IPL 2026: ఉప్పల్‌లో సమఉజ్జీల మధ్య పోరు.. కానీ.! SRHకి అదొక్కటే సమస్య..

IPL 2026: ఉప్పల్‌లో సమఉజ్జీల మధ్య పోరు.. కానీ.! SRHకి అదొక్కటే సమస్య..

SRH: ఐపీఎల్ 2026లో వరుసగా రెండు విజయాలతో ఊపు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయం సాధించి.. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 21 2026, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 వరుసగా రెండు విజయాలతో..
Image Credit : SRH Instagram

వరుసగా రెండు విజయాలతో..

ఐపీఎల్ 2026లో వరుసగా రెండు విజయాలతో ఊపు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని ఆరెంజ్ ఆర్మీ పట్టుదలగా ఉంది.

25
బౌలింగ్‌లో పుంజుకున్న హైదరాబాద్
Image Credit : SRH\Instagram

బౌలింగ్‌లో పుంజుకున్న హైదరాబాద్

సీజన్ ఆరంభంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపించింది. అయితే గత రెండు మ్యాచుల్లో బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రఫుల్ హింగే తొలి ఓవర్లోనే వికెట్ తీసి నిప్పులు చెరగగా, చెన్నైతో మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో బౌలర్లు సమష్టిగా రాణించి విజయాన్ని అందించారు. ఈ ప్రదర్శన జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

Related Articles

Related image1
SRH vs CSK : టాప్ 10 నుండి సంజూ శాంసన్ ఔట్..
Related image2
SRH vs RR: ఇషాన్ కిషన్ మాస్ బ్యాటింగ్.. కావ్య పాప రియాక్షన్ చూశారా? వీడియో వైరల్
35
బ్యాటింగ్, ఫినిషింగ్ సమస్యలు
Image Credit : X/SunRisers

బ్యాటింగ్, ఫినిషింగ్ సమస్యలు

హైదరాబాద్ బ్యాటింగ్ విభాగంలో దూకుడు ఉన్నప్పటికీ నిలకడ లేమి కనిపిస్తోంది. టాప్ ఆర్డర్‌లో ఎవరో ఒకరు రాణిస్తున్నా, చివర్లో సరైన ఫినిషింగ్ లేకపోవడం జట్టును ఇబ్బంది పెడుతోంది. మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ఓపెనర్లు కనీసం ఆరేడు ఓవర్ల పాటు వికెట్ పడకుండా జాగ్రత్త పడితే, భారీ స్కోరు సాధించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

45
ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి
Image Credit : DC\Twitter

ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన ఈ సీజన్‌లో మిశ్రమంగా ఉంది. కేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సాంక, ట్రిస్టన్ స్టబ్స్ వంటి సీనియర్ ఆటగాళ్ల నుంచి జట్టు భారీ స్కోర్లు ఆశిస్తోంది. అయితే స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటు. లుంగి ఎంగిడి, ముకేష్ కుమార్, నటరాజన్ ఆ లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా, కుల్దీప్ యాదవ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం ఢిల్లీకి ఆందోళన కలిగిస్తోంది.

55
ఆరు పాయింట్లతో ఉన్నప్పటికీ
Image Credit : SRH Insta

ఆరు పాయింట్లతో ఉన్నప్పటికీ

పాయింట్ల పట్టికలో ఇరుజట్లు సమానంగా ఆరు పాయింట్లతో ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ పరంగా హైదరబాద్ మెరుగ్గా ఉంది. నేటి మ్యాచ్‌లో ఢిల్లీ కంటే హైదరాబాద్‌కే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషణలు చెప్తున్నాయి. హోమ్ గ్రౌండ్‌లో అభిమానుల మద్థతు మధ్య ఆరెంజ్ ఆర్మీ మరో భారీ స్కోరుతో అలరిస్తుందో లేదో చూడాలి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tilak Varma : తిలక్ వర్మ సెంచరీ విధ్వంసంతో నమోదైన 5 అద్భుత రికార్డులు ఇవే !
Recommended image2
Tilak Varma : తిలక్ వర్మ ఊచకోత.. గుజరాత్‌పై మెరుపు సెంచరీతో చరిత్ర సృష్టించిన తెలుగోడు !
Recommended image3
Ruturaj Gaikwad : రుతురాజ్ గైక్వాడ్‌కు ఏమైంది? CSK కెప్టెన్ మైండ్‌లో ఏం నడుస్తోంది?
Related Stories
Recommended image1
SRH vs CSK : టాప్ 10 నుండి సంజూ శాంసన్ ఔట్..
Recommended image2
SRH vs RR: ఇషాన్ కిషన్ మాస్ బ్యాటింగ్.. కావ్య పాప రియాక్షన్ చూశారా? వీడియో వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved