MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • SRH vs CSK : టాప్ 10 నుండి సంజూ శాంసన్ ఔట్..

SRH vs CSK : టాప్ 10 నుండి సంజూ శాంసన్ ఔట్..

ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసులో శుభ్‌మన్ గిల్ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. దీంతో ఈ జాబితాలో మార్పులు చోటుచేసుకున్నాయి. సంజూ శాంసన్ టాప్ టెన్ నుంచి బయటకు వెళ్లగా, విరాట్ కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. పూర్తి జాబితా చూద్దాం... 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 18 2026, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆరెంజ్ క్యాప్ గిల్ దే...
Image Credit : ANI

ఆరెంజ్ క్యాప్ గిల్ దే...

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఈ ఐపిఎల్ సీజన్ 19 లో అదరగొడుతున్నాడు. నిన్న (ఏప్రిల్ 17, శుక్రవారం) హోంగ్రౌండ్ అహ్మదాబాద్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై గుజరాత్ టైటాన్ అద్భుత విజయం సాధించింది... ఇందులో కెప్టెన్ శుభ్ మన్ కీలకపాత్ర పోషించాడు. అతడు కేవలం 50 బంతుల్లో 86 పరుగులు (4 సిక్సర్లు, 8 ఫోర్లు) చేశాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్ జిటిని గెలిపించడమే కాదు గిల్ కు ఆరెంజ్ క్యాప్ అందించింది.

ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లో గిల్ 4 మ్యాచులాడి 251 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ నాలుగిట్లో మూడు హాఫ్ సెంచరీలే ఉన్నాయి. 62.75 సగటు, 154.93 స్ట్రైక్ రేట్ తో గిల్ పరుగులు సాధించాడు.

26
రెండో స్థానానికి పడిపోయిన కోహ్లీ
Image Credit : ANI

రెండో స్థానానికి పడిపోయిన కోహ్లీ

టీమిండియా స్టార్ ప్లేయర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి మరీ గిల్ ఆరెంజ్ క్యాప్ సాధించాడు. కోహ్లీ ఐదు మ్యాచ్‌లలో 228 పరుగులతో రెండో స్థానానికి చేరాడు. అయితే గిల్ కంటే మెరుగైన స్ట్రైక్ రేట్ (158.33) తో కోహ్లీ పరుగులు రాబట్టాడు. ఇప్పటివరకు జరిగిన ఐపిఎల్ లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ అత్యధిక స్కోరు 69 నాటౌట్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్, ఐదు మ్యాచ్‌లలో 222 పరుగులు చేసి జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని అత్యధిక స్కోరు 63. పాటిదార్ సగటు 55.50, స్ట్రైక్ రేట్ 213.46. అతను రెండు హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు.

Related Articles

Related image1
IPL 2026: బ్యాటింగ్ చేయలేరు.. మళ్లీ వీరికి కెప్టెన్సీనా.? జట్టుకు భారంగా మారిన కెప్టెన్లు..
Related image2
IPL : ఆర్సిబి కెప్టెన్ పాటిదార్ మామూలోడు కాదు.. అతడి నెట్ వర్త్ ఎంతో తెలుసా..?
36
ఆరెంజ్ క్యాప్ రేసులో ఇద్దరు హైదరాబాద్ ప్లేయర్లు
Image Credit : Getty

ఆరెంజ్ క్యాప్ రేసులో ఇద్దరు హైదరాబాద్ ప్లేయర్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ క్లాసెన్ ఐదు మ్యాచ్‌లలో 224 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 62. క్లాసెన్ సగటు 44.80, స్ట్రైక్ రేట్ 142.97. అతను రెండు హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. హయ్యెస్ట్ రన్స్ రేసులో ఇతడు మూడో స్థానంలో ఉన్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ఐదు మ్యాచ్‌లలో 213 పరుగులు చేశాడు. కిషన్ అత్యధిక స్కోరు 91. అతని సగటు 42.60, స్ట్రైక్ రేట్ 190.17. కిషన్ రెండు హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఇతడిది ఐదో స్థానం. 

46
అదరగొడుతున్న పంజాబ్ ప్లేయర్లు
Image Credit : ANI

అదరగొడుతున్న పంజాబ్ ప్లేయర్లు

పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రభ్‌సిమ్రాన్ ఐదు మ్యాచుల్లో 211 పరుగులతో ఆరో స్థానంలో నిలిచాడు. ఇతడి అత్యధిక స్కోరు 80. ఈ పంజాబ్ కింగ్స్ ప్లేయర్ సగటు 70.33, స్ట్రైక్ రేట్ 172.95. ప్రభ్‌సిమ్రాన్ రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.

శ్రేయస్ అయ్యర్ ఐదు మ్యాచ్‌లలో 203 పరుగులు సాధించి ఏడో స్థానంలో ఉన్నాడు. మూడు హాఫ్ సెంచరీలు చేసిన శ్రేయస్ సగటు 67.66, స్ట్రైక్ రేట్ 1874.96. అతని అత్యధిక స్కోరు 80 నాటౌట్.

56
ఈ బుడ్డోడూ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు..
Image Credit : ANI

ఈ బుడ్డోడూ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు..

ఫామ్‌లోకి తిరిగి వచ్చిన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ జోస్ బట్లర్ ఐదు మ్యాచ్‌లలో 201 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 60. బట్లర్ సగటు 40.20, స్ట్రైక్ రేట్ 159.52. అతని ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యధిక పరుగుల ఆటగాళ్లలో ఇతడిది ఎనిమిదో స్థానం. 

తొమ్మిదో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ ఇప్పటివరకు 200 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 78. రెండు హాఫ్ సెంచరీలు చేసిన వైభవ్ సగటు 40.00, స్ట్రైక్ రేట్ 263.15.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్ రఘువంశీ ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసి ఇప్పటివరకు 190 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 52. రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రఘువంశీ సగటు 38.00, స్ట్రైక్ రేట్ 157.02. ప్రస్తుతం ఇతను పదో స్థానంలో ఉన్నాడు.

66
ఆరెంజ్ క్యాప్ రేసులో సంజూ స్థానమెంత..?
Image Credit : x@IPL

ఆరెంజ్ క్యాప్ రేసులో సంజూ స్థానమెంత..?

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజూ శాంసన్ అత్యధిక పరుగుల రేసులో వెనబడ్డాడు.. ప్రస్తుతం ఇతడు 11వ స్థానంలో ఉన్నాడు. సంజూ ఐదు మ్యాచ్‌లలో 185 పరుగులు చేశాడు. అతని సగటు 46.25, స్ట్రైక్ రేట్ 172.89. సంజూ అత్యధిక స్కోరు 115 నాటౌట్. ఈ ఐపిఎల్ లో ఇప్పటివరకు సెంచరీ చేసిన ఏకైన ఆటగాడు శాంసన్... కానీ అతడు ఆరెంజ్ క్యాప్ కు చాలా దూరంలో నిలిచాడు. 

అయితే గత రెండు మ్యాచుల్లో అద్భుతంగా ఆడిన శాంసన్ ఇవాళ (ఏప్రిల్ 18, శనివారం) సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో రాణిస్తే మళ్లీ టాప్ 10 లోకి వచ్చే అవకాశాలుంటాయి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
శుభ్‌మన్ గిల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rinku Singh: కేకేఆర్‌కు అతిపెద్ద సమస్యగా మారాడు ! ఏమైంది రింకూ భయ్యా
Recommended image2
Team India : రోహిత్ కంటే డేంజర్.. టీమిండియా ఓపెనర్లుగా ఆ నలుగురు కుర్రాళ్లు రెడీ
Recommended image3
IPL : ఆర్సిబి కెప్టెన్ పాటిదార్ మామూలోడు కాదు.. అతడి నెట్ వర్త్ ఎంతో తెలుసా..?
Related Stories
Recommended image1
IPL 2026: బ్యాటింగ్ చేయలేరు.. మళ్లీ వీరికి కెప్టెన్సీనా.? జట్టుకు భారంగా మారిన కెప్టెన్లు..
Recommended image2
IPL : ఆర్సిబి కెప్టెన్ పాటిదార్ మామూలోడు కాదు.. అతడి నెట్ వర్త్ ఎంతో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved