MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Mandhana : పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన పెళ్లి పై బిగ్ అప్డేట్

Mandhana : పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన పెళ్లి పై బిగ్ అప్డేట్

Smriti Mandhana Wedding : భారత క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం నవంబర్ 23న జరగాల్సి వుండగా, వాయిదా పడింది. తాజాగా డిసెంబర్ 7న పెళ్లి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఈవెంట్ కంపెనీ చేసిన పోస్టు వైరల్ గా మారింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 05 2025, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్ పెళ్లి ఎప్పుడు?
Image Credit : stockPhoto

స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్ పెళ్లి ఎప్పుడు?

టీమిండియా స్టార్ ప్లేయర్, స్మృతి మంధాన వ్యక్తిగత జీవితం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం చుట్టూ వివిధ ఊహాగానాలు చక్కర్లు కొడుతుతూనే ఉన్నాయి. నవంబర్ 23న జరగాల్సిన స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడడం పెద్ద సంచలనంగా మారింది. 

వాయిదాకు ముందు సంగీత్, మెహెందీ వంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు పూర్తయ్యాయి. సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలోనే, అనూహ్యంగా పెళ్లికి బ్రేక్ పడింది. స్మృతి మంధానా తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు.

25
పెళ్లి వాయిదాకు కారణమేంటి?
Image Credit : stockPhoto

పెళ్లి వాయిదాకు కారణమేంటి?

వివాహం వాయిదా పడిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మొదలైంది. ఎందుకు వాయిదా పడిందే విషయం పై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే పలాష్ ముచ్చల్ ఇతర అమ్మాయిలతో చాట్ చేసిన స్క్రీన్‌షాట్‌లు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. 

మరికొన్ని రిపోర్టుల ప్రకారం, పలాష్ ముచ్చల్, స్మృతి మంధానాను పెళ్లి చేసుకోవాలని బెదిరించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. పలాష్ నిజ స్వరూపం బయటపడిన తర్వాతే స్మృతి మంధానా పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారని కూడా పలు కథనాలు పేర్కొన్నాయి. 

ఈ పరిణామాల మధ్య స్మృతి మంధానా తండ్రి మాత్రమే కాకుండా, పలాష్ ముచ్చల్ కూడా ఆసుపత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. పెళ్లి వాయిదాకు ఆరోగ్య సమస్యలే కారణమని అప్పట్లో కుటుంబ సభ్యులు ప్రకటించారు.

Related Articles

Related image1
358 పరుగులు చేసినా టీమిండియా ఎందుకు ఓడిపోయింది?
Related image2
Joe Root : సచిన్ సాధించలేని రికార్డులు.. జో రూట్ అదరగొట్టాడు !
35
ఈవెంట్ కంపెనీ పోస్టు ఇచ్చిన క్లూ ఏంటి?
Image Credit : stockPhoto

ఈవెంట్ కంపెనీ పోస్టు ఇచ్చిన క్లూ ఏంటి?

పలాష్ ముచ్చల్ మోసం చేశారనే ఆరోపణల మధ్య, స్మృతి మంధానా వివాహం గురించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివాహం వాయిదా పడిన ఒక వారం తర్వాత 'క్రేయాన్స్ ఎంటర్‌టైన్‌మెంట్' అనే ఈవెంట్ కంపెనీ తన సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌ను షేర్ చేసింది.

ఈ పోస్ట్ ద్వారా, పలాష్ , స్మృతి మంధానాల వివాహం గురించి పెద్ద క్లూ ఇచ్చారు. పోస్ట్‌లో జంట పేర్లను నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఈ కంపెనీ స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్ వివాహం గురించే పరోక్షంగా చెబుతోందని నెటిజన్లు భావిస్తున్నారు. 

ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ పోస్ట్‌లో, "జీవితంలోని ప్రతి మ్యాచ్‌లోనూ మనం గెలిచి ఫైనల్ లైన్‌ను దాటలేము, కానీ క్రీడా స్ఫూర్తి ఎల్లప్పుడూ ముఖ్యం. మా బృందం సంతోషంగా, గర్వంగా శ్రమించింది. అది తప్పకుండా ప్రస్తావించదగిన విషయం. ఛాంపియన్స్, త్వరలో కలుద్దాం" అని పేర్కొంది. ఈ పోస్ట్ స్మృతి, పలాష్ వివాహం త్వరలో జరగవచ్చనే సూచన అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Krayonz Entertainment (@krayonzentertainment)

45
డిసెంబర్ 7న పెళ్లి? కుటుంబ సభ్యుల స్పందన ఏంటి?
Image Credit : Instagram

డిసెంబర్ 7న పెళ్లి? కుటుంబ సభ్యుల స్పందన ఏంటి?

అంతకుముందు, డిసెంబర్ 7న స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్ వివాహం జరగనుందని తెలుపుతూ ఒక వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మ్యారేజ్ న్యూస్‌పై ఇటు మంధానా కుటుంబ సభ్యులు, అటు ముచ్చల్ కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ వార్తలను వారు ఖండించారు.

పలాష్ ముచ్చల్ బంధువులు ఈ వార్తను పూర్తిగా తోసిపుచ్చారు. "డిసెంబర్ 7 పెళ్లి గురించి అధికారిక సమాచారం ఏమీ లేదు, వివాహం వాయిదా పడింది" అని వారు స్పష్టం చేశారు. స్మృతి మంధానా సోదరుడు శ్రవణ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.

55
ప్రస్తుత పరిస్థితి ఏంటి?
Image Credit : insta/palash_muchhal

ప్రస్తుత పరిస్థితి ఏంటి?

మొదట పెళ్లి వాయిదా పడటానికి కారణమైన స్మృతి మంధానా తండ్రి ప్రస్తుతం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినప్పటికీ, వివాహం గురించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. పెళ్లి గురించి తాజా అప్‌డేట్ ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. పలాష్ ముచ్చల్ వేరే మహిళలతో చేసిన చాట్స్, వివాదాలపై కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. అయినప్పటికీ, క్రికెటర్ స్మృతి మంధానా వివాహం గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
మహిళల క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎలా చూడొచ్చు.? రీఛార్జ్ ఆప్ష‌న్స్ ఇవే
Recommended image2
T20 World Cup : రెండుసార్లు టీమిండియాను టీ20 విజేతగా నిలిపిన తోపు ప్లేయర్.. ధోని, కోహ్లీ కాదు, మరెవరు?
Recommended image3
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Related Stories
Recommended image1
358 పరుగులు చేసినా టీమిండియా ఎందుకు ఓడిపోయింది?
Recommended image2
Joe Root : సచిన్ సాధించలేని రికార్డులు.. జో రూట్ అదరగొట్టాడు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved