MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • SA vs AFG: ఓడింది మ్యాచ్ మాత్రమే.. అందరి హృదయాలను గెలిచిన అఫ్ఘనిస్తాన్

SA vs AFG: ఓడింది మ్యాచ్ మాత్రమే.. అందరి హృదయాలను గెలిచిన అఫ్ఘనిస్తాన్

Afghanistan win hearts in Double Super Over: టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా చేతిలో అఫ్ఘనిస్తాన్ ఓడిపోయినా, తన అద్భుత పోరాటంతో ప్రపంచ క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 11 2026, 09:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఓడినా వీరులే.. తగ్గని అఫ్ఘన్ల పట్టుదల
Image Credit : X/ACBofficials

ఓడినా వీరులే.. తగ్గని అఫ్ఘన్ల పట్టుదల

క్రికెట్ అంటే కేవలం గెలుపోటములు మాత్రమే కాదు, అంతకు మించిన భావోద్వేగం అని అఫ్ఘనిస్తాన్ జట్టు మరోసారి నిరూపించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో మాత్రం అఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు నిలిచిపోయారు. డబుల్ సూపర్ ఓవర్ వరకు సాగిన ఈ పోరాటంలో అఫ్ఘాన్ ఆటగాళ్లు చూపిన ధైర్యం, ఆత్మవిశ్వాసం పరాకాష్టకు చేరాయి. చివరి బంతి వరకు పోరాడి ఓడిపోయిన ఆ జట్టు కన్నీళ్లు నేడు ప్రతి క్రికెట్ అభిమానిని కలచివేస్తున్నాయి.

26
సౌతాఫ్రికా భారీ స్కోరు.. అఫ్ఘన్ పట్టుదల
Image Credit : X/ACBofficials

సౌతాఫ్రికా భారీ స్కోరు.. అఫ్ఘన్ పట్టుదల

ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టుకు ర్యాన్ రికల్టన్ (61), క్వింటన్ డికాక్ (59)లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఒక దశలో స్కోరు 200 దాటుతుందని అనిపించినా, అఫ్ఘన్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 3 వికెట్లతో దక్షిణాఫ్రికా వేగాన్ని అడ్డుకోగా, కెప్టెన్ రాషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో 2 వికెట్లు తీసి సఫారీలను నియంత్రించాడు. డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్ వంటి హిట్టర్లు ఉన్నా, అఫ్ఘాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌పై పట్టు సాధించే ప్రయత్నం చేశారు.

Related Articles

Related image1
SA vs AFG : క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ క్లైమాక్స్.. రెండు సూపర్ ఓవర్లు.. గ్రేట్ విక్టరీ !
Related image2
SA vs AFG : 3 సార్లు గెలిచి.. చివరికి ఓడిపోయింది.. అఫ్గాన్ ఎక్కడ తప్పు చేసింది?
36
రహమనుల్లా గుర్బాజ్ ఒంటరి పోరాటం
Image Credit : X/ACBofficials

రహమనుల్లా గుర్బాజ్ ఒంటరి పోరాటం

లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి అఫ్ఘనిస్తాన్ పీకల్లోతూ కష్టాల్లో పడింది. కానీ ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. 42 బంతుల్లో 84 పరుగులు చేసి, స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఒకానొక దశలో మ్యాచ్ చేజారిపోతుందనుకున్న తరుణంలో గుర్బాజ్ ఇన్నింగ్స్ అఫ్ఘన్ ఆశలను సజీవంగా ఉంచింది. అతనికి తోడుగా చివర్లో నూర్ అహ్మద్ (15 నాటౌట్) వీరోచితంగా ఆడి స్కోరును సమం చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఫజల్హక్ ఫారూఖీ రనౌట్ అవ్వడం ఆఫ్ఘన్ శిబిరంలో తీవ్ర ఉద్వేగాన్ని నింపింది.

46
మొదటి సూపర్ ఓవర్: నరాలు తెగే ఉత్కంఠ
Image Credit : X/ACBofficials

మొదటి సూపర్ ఓవర్: నరాలు తెగే ఉత్కంఠ

సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్తాన్ 17 పరుగులు చేసింది. ఒమర్జాయ్ ఫోర్, సిక్సర్‌తో సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 18 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కూడా అదే స్థాయిలో బదులిచ్చింది. ట్రిస్టన్ స్టబ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాదడంతో మొదటి సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. ఇరు జట్ల ఆటగాళ్లలో టెన్షన్ స్పష్టంగా కనిపించింది. మైదానంలోని అభిమానుల గుండె చప్పుడు ఆగిపోయేంత ఉత్కంఠ నెలకొంది.

56
రెండో సూపర్ ఓవర్: వీరోచితంగా పోరాడి ఓడి..
Image Credit : X/ACBofficials

రెండో సూపర్ ఓవర్: వీరోచితంగా పోరాడి ఓడి..

రెండో సూపర్ ఓవర్‌లో దక్షిణాఫ్రికా 23 పరుగులు రాబట్టి అఫ్ఘనిస్తాన్‌కు కఠినమైన టార్గెట్ ను నిర్దేశించింది. 24 పరుగులు చేయాల్సిన తరుణంలో గుర్బాజ్ మళ్ళీ క్రీజులోకి వచ్చాడు. కేశవ్ మహారాజ్ వేసిన ఆ ఓవర్‌లో వరుసగా 3 సిక్సర్లు బాది విజయానికి అడుగు దూరంలో నిలిచాడు. చివరి బంతికి 5 పరుగులు కావాల్సిన సమయంలో గుర్బాజ్ క్యాచ్ అవుట్ అవ్వడంతో ఆఫ్ఘన్ కల చెదిరిపోయింది. అప్పటివరకు గెలుపు కోసం శ్రమించిన గుర్బాజ్ మైదానంలోనే కుంగిపోవడం చూసి అభిమానుల కళ్లు చెమర్చాయి.

66
నెట్టింట వైరల్ అవుతున్న గుర్బాజ్ కన్నీళ్లు
Image Credit : X/ACBofficials

నెట్టింట వైరల్ అవుతున్న గుర్బాజ్ కన్నీళ్లు

నెట్టింట వైరల్ అవుతున్న గుర్బాజ్ కన్నీళ్లు వైరల్ గా మారాయి. ఈ ఓటమితో అఫ్ఘనిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితికి చేరుకున్నా, వారు చూపించిన తెగువను ఎవరూ మర్చిపోలేరు. దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టును డబుల్ సూపర్ ఓవర్ వరకు నెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. రషీద్ ఖాన్ నాయకత్వంలో ఈ చిన్న జట్టు చూపిన పోరాట పటిమ మిరాకిల్ కంటే తక్కువేమీ కాదు. మ్యాచ్ గెలిచింది దక్షిణాఫ్రికానే కావొచ్చు, కానీ అందరి హృదయాలను మాత్రం అఫ్ఘనిస్తాన్ గెలుచుకుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
Super Over Records : టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు ఎన్ని సూపర్ ఓవర్లు జరిగాయి?
Recommended image2
Double Super Over : డబుల్ సూపర్ ఓవర్ అంటే ఏమిటి? ఐసీసీ కొత్త రూల్స్ ఏంటి?
Recommended image3
SA vs AFG : 3 సార్లు గెలిచి.. చివరికి ఓడిపోయింది.. అఫ్గాన్ ఎక్కడ తప్పు చేసింది?
Related Stories
Recommended image1
SA vs AFG : క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ క్లైమాక్స్.. రెండు సూపర్ ఓవర్లు.. గ్రేట్ విక్టరీ !
Recommended image2
SA vs AFG : 3 సార్లు గెలిచి.. చివరికి ఓడిపోయింది.. అఫ్గాన్ ఎక్కడ తప్పు చేసింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved