MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • SA vs AFG : క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ క్లైమాక్స్.. రెండు సూపర్ ఓవర్లు.. గ్రేట్ విక్టరీ !

SA vs AFG : క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ క్లైమాక్స్.. రెండు సూపర్ ఓవర్లు.. గ్రేట్ విక్టరీ !

SA vs AFG : క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే పోరు ఇది.. క్లైమాక్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే ! టీ20 ప్రపంచకప్‌లో అఫ్ఘనిస్తాన్-సౌతాఫ్రికా మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ మొదట టైగా ముగిసింది. రెండు సూపర్ ఓవర్ల ఉత్కంఠ తర్వాత సఫారీ జట్టు విజేతగా నిలిచింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 11 2026, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బాబోయ్ ఏం మ్యాచ్ ఇది! డబుల్ సూపర్ ఓవర్‌తో నరాలు తెగే ఉత్కంఠ
Image Credit : Getty

బాబోయ్ ఏం మ్యాచ్ ఇది! డబుల్ సూపర్ ఓవర్‌తో నరాలు తెగే ఉత్కంఠ

టీ20 క్రికెట్ అంటేనే ఉత్కంఠ. అది కూడా ప్రపంచకప్ లో రెండు జట్లు అమీతుమీ తేల్చుకుంటుంటే ఆ మజాయే వేరు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం బుధవారం అటువంటి అద్భుతమైన పోరాటానికే సాక్ష్యంగా నిలిచింది. సౌతాఫ్రికా, అఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన గ్రూప్-డి మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఒక క్లాసిక్ థ్రిల్లర్‌గా నిలిచిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో స్కోర్లు టై కావడం, ఆపై జరిగిన మొదటి సూపర్ ఓవర్ కూడా డ్రాగా ముగియడం, చివరకు రెండో సూపర్ ఓవర్‌లో సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టడం.. నరాలు తెగే ఉత్కంఠను రేపింది.

26
సౌతాఫ్రికా భారీ స్కోరు.. డికాక్, రికెల్టన్ మెరుపులు
Image Credit : Getty

సౌతాఫ్రికా భారీ స్కోరు.. డికాక్, రికెల్టన్ మెరుపులు

టాస్ గెలిచిన అఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా ఓపెనర్, కెప్టెన్ ఎయిడెన్ మర్కరమ్ త్వరగానే అవుట్ అయినప్పటికీ, క్వింటన్ డికాక్ 59 పరుగులు, ర్యాన్ రికెల్టన్ 61 పరుగులతో అఫ్ఘాన్ బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 114 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒక దశలో స్కోరు 200 దాటుతుందని అనిపించినా, అఫ్ఘాన్ బౌలర్లు చివర్లో పుంజుకోవడంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అఫ్ఘాన్ బౌలర్లలో అజ్మతుల్లా 3 వికెట్లు పడగొట్టాడు.

Related Articles

Related image1
IND vs NAM : టీమిండియాలో 3 భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్ !
Related image2
IND vs PAK : జై షా మైండ్ గేమ్.. దెబ్బకు ఏకాకిగా మారిన పాకిస్తాన్.. మైండ్ బ్లాక్ అంతే మరి !
36
గుర్బాజ్ ఒంటరి పోరాటం.. ఆఖరి ఓవర్ హైడ్రామా
Image Credit : Twitter

గుర్బాజ్ ఒంటరి పోరాటం.. ఆఖరి ఓవర్ హైడ్రామా

188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘనిస్తాన్ పవర్‌ప్లేలో 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 84 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరి ఓవర్‌లో అఫ్ఘాన్ విజయానికి 13 పరుగులు కావాలి, చేతిలో ఒకే వికెట్ ఉంది. కగిసో రబాడా వేసిన ఈ ఓవర్‌లో నో-బాల్స్, వైడ్‌లు, నూర్ అహ్మద్ కొట్టిన సిక్సర్‌తో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే, చివరి బంతికి రెండో రన్ తీసే క్రమంలో ఫజల్ హక్ ఫారూఖీ రనౌట్ కావడంతో స్కోర్లు 187 వద్ద సమమై, మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.

46
మొదటి సూపర్ ఓవర్: అక్కడ కూడా డ్రా
Image Credit : Instagram/afghanistancricketboard

మొదటి సూపర్ ఓవర్: అక్కడ కూడా డ్రా

మొదటి సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్తాన్, లుంగీ ఎన్గిడి వేసిన ఓవర్‌లో 17 పరుగులు సాధించింది. అజ్మతుల్లా ఒక సిక్సర్, రెండు ఫోర్లతో చెలరేగాడు. 18 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా తరఫున ఫజల్ హక్ ఫారూఖీ బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాదడంతో ఈ సూపర్ ఓవర్ కూడా 17-17తో టై అయ్యింది. దీంతో ఫలితం కోసం రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది.

56
రెండో సూపర్ ఓవర్: కిల్లర్ మిల్లర్ షో
Image Credit : our own

రెండో సూపర్ ఓవర్: కిల్లర్ మిల్లర్ షో

నిబంధనల ప్రకారం రెండో సూపర్ ఓవర్‌లో సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. అజ్మతుల్లా వేసిన ఈ ఓవర్‌లో డేవిడ్ మిల్లర్ వరుసగా రెండు సిక్సర్లు బాది స్కోరును 23 పరుగులకు చేర్చాడు. 24 పరుగుల కఠిన లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘనిస్తాన్‌ను కేశవ్ మహారాజ్ తన స్పిన్ మాయాజాలంతో కట్టడి చేశాడు. అయితే, గుర్బాజ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి భయపెట్టినప్పటికీ, చివరికి అఫ్ఘాన్ 20 పరుగులే చేయగలిగింది. దీంతో సౌతాఫ్రికా 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.

66
పాయింట్ల పట్టికలో సఫారీలు టాప్
Image Credit : PTI

పాయింట్ల పట్టికలో సఫారీలు టాప్

ఈ విజయంతో సౌతాఫ్రికా గ్రూప్-డిలో అగ్రస్థానానికి చేరువలో ఉంది. అద్భుతమైన పోరాట పటిమ కనబరిచిన అఫ్ఘనిస్తాన్‌కు ఇది దురదృష్టకర ఓటమి అనే చెప్పాలి. ముఖ్యంగా గుర్బాజ్ చేసిన 84 పరుగులు, సూపర్ ఓవర్లలో అతని మెరుపులు అభిమానుల గుండెల్లో నిలిచిపోతాయి. మరోవైపు, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండి విజయాన్ని అందుకున్న సఫారీ జట్టు తమ టైటిల్ వేటను ఘనంగా కొనసాగిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cricketers Love stories : క్రికెట్ కింగ్స్.. బాలీవుడ్ క్వీన్స్ ! ఈ క్రేజీ జంటల గురించి మీకు తెలుసా?
Recommended image2
24 గంటల్లో 4గురు అవుట్.! టీ20 వరల్డ్‌కప్‌లో ఆ జట్లకు టెన్షన్.. టెన్షన్..
Recommended image3
ఎవడు మమ్మీ వీడు.! కేవలం 44 బంతుల్లోనే కాటేరమ్మ కొడుకు రికార్డు బద్దలు కొట్టేశాడు.. ఎవరంటే.?
Related Stories
Recommended image1
IND vs NAM : టీమిండియాలో 3 భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్ !
Recommended image2
IND vs PAK : జై షా మైండ్ గేమ్.. దెబ్బకు ఏకాకిగా మారిన పాకిస్తాన్.. మైండ్ బ్లాక్ అంతే మరి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved