MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • భారత్ vs పాకిస్తాన్: సూపర్ సండే.. సూర్యకుమార్ కామెంట్స్ వైరల్

భారత్ vs పాకిస్తాన్: సూపర్ సండే.. సూర్యకుమార్ కామెంట్స్ వైరల్

IND vs PAK: ఆసియా కప్ 2025లో భారత్- పాకిస్తాన్ సూపర్-4 మ్యాచ్ కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 140 కోట్ల భారతీయులకు ఒక వాగ్దానం చేశారు. సూపర్ సండే కోసం సిద్ధంగా ఉండాలంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 21 2025, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాకిస్తాన్ తో మరో బిగ్ ఫైట్ కు సిద్ధంగా భారత్
Image Credit : Xtoxifyy18

పాకిస్తాన్ తో మరో బిగ్ ఫైట్ కు సిద్ధంగా భారత్

ఆసియా కప్ 2025 సూపర్-4 లో భాగంగా భారత్- పాకిస్తాన్ జట్టు మధ్య జరుగబోయే కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఈ ఉత్కంఠభరిత పోరు ఆదివారం (సెప్టెంబర్ 21) న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. 

మ్యాచ్ ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యకుమార్ 140 కోట్ల భారతీయులకు వాగ్దానం చేస్తూ.. ఈ మ్యాచ్‌ను చూసి అందరికీ థ్రిల్, ఆనందం కలుగుతుందని అన్నారు.

25
పాకిస్తాన్ పేరు ప్రస్తావించని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Image Credit : Getty

పాకిస్తాన్ పేరు ప్రస్తావించని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్‌లో మీడియా నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొత్తం సమయంలో ఆయన ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ పేరును ఒక్కసారికూడా ప్రస్తావించలేదు. ఈ మ్యాచ్‌తో ఆసియా కప్ లో భారత్ రెండోసారి పాకిస్తాన్ తో తలపడనుంది. 

సెప్టెంబర్ 14న జరిగిన తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై అద్భుత విజయాన్ని సాధించింది. ఆ గెలుపు తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాలను కూడా సూర్యకుమార్ ప్రస్తావించారు. “మేము గెలిచాం, అందుకే సంతోషం పంచుకున్నాం” అంటూ ట్రోల్స్ పై కూడా స్పందించారు.

Related Articles

Related image1
చివరి ఓవర్ లో శ్రీలంక పై బంగ్లాదేశ్ థ్రిల్లింగ్ విక్టరీ
Related image2
ఇదేం కొట్టుడు సామీ.. ఆస్ట్రేలియాను కంగారెత్తించారు ! స్మృతి మంధాన సునామీ బ్యాటింగ్
35
పాక్ తో మ్యాచ్.. సూర్యకుమార్ ఏమన్నారంటే?
Image Credit : X/@ICCAsiaCricket

పాక్ తో మ్యాచ్.. సూర్యకుమార్ ఏమన్నారంటే?

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “ఆదివారం రోజు ఎక్కువ మంది ప్రేక్షకులు మ్యాచ్‌ను వీక్షిస్తారు. వారు కూర్చుని ఆటను ఆనందించాలి. మేము మైదానంలో అదే ఉత్సాహం, అదే శక్తితో బరిలోకి దిగుతాం. మేము ఎప్పటికప్పుడు మా బెస్ట్ ను ఇవ్వడానికి ప్రయత్నిస్తాం” అని తెలిపారు. అలాగే, 140 కోట్ల భారతీయులకు “మీ సండే ప్రత్యేకం అవుతుంది” అని చెప్పాడు.

45
భారత జట్టు ప్రిపరేషన్‌పై సూర్య వ్యాఖ్యలు
Image Credit : Getty

భారత జట్టు ప్రిపరేషన్‌పై సూర్య వ్యాఖ్యలు

సూర్యకుమార్ భారత జట్టు ప్రిపరేషన్ గురించి కూడా మాట్లాడారు. “ఈ టోర్నమెంట్‌లో మా ప్రిపరేషన్ అద్భుతంగా ఉంది. ఇప్పటికే మూడు మంచి మ్యాచ్‌లు ఆడాం. మేము ఎప్పుడూ ఆడుతున్న ప్రస్తత మ్యాచ్‌పైనే దృష్టి పెడతాం. గత రెండు మూడు మ్యాచ్‌లలో అలవాటు చేసుకున్న మంచి పద్ధతులను కొనసాగిస్తాం. కేవలం ఒక మంచి మ్యాచ్ ఆడామని మనకు లాభం ఉండదు. మళ్లీ కొత్తగా మొదలు పెట్టాలి. ఆ రోజు ఎవరు బాగా ఆడతారో వారు గెలుస్తారు” అని వ్యాఖ్యానించారు.

55
భారత్-పాకిస్తాన్ రికార్డులు ఎలా ఉన్నాయి?
Image Credit : Getty

భారత్-పాకిస్తాన్ రికార్డులు ఎలా ఉన్నాయి?

ఆసియా కప్‌లో టీ20 ఫార్మాట్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ మూడింట గెలిచింది. దుబాయ్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడిన మూడు మ్యాచ్‌లలో రెండింటిలో భారత్ వియం సాధించింది. ఈ గణాంకాలు భారత జట్టుకు విశ్వాసాన్ని పెంచుతున్నాయి. అయితే కెప్టెన్ మాటల ప్రకారం, ప్రతి మ్యాచ్ కొత్తదే, కాబట్టి ఆటలో పూర్తి శక్తిని వినియోగించడం తప్పనిసరి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్
ఆసియా కప్ 2025
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Recommended image2
BCCI Central Contracts : డబ్బులు కట్.. గ్రేడ్ కట్.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఊహించని దెబ్బ
Recommended image3
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related Stories
Recommended image1
చివరి ఓవర్ లో శ్రీలంక పై బంగ్లాదేశ్ థ్రిల్లింగ్ విక్టరీ
Recommended image2
ఇదేం కొట్టుడు సామీ.. ఆస్ట్రేలియాను కంగారెత్తించారు ! స్మృతి మంధాన సునామీ బ్యాటింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved