MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • INDW vs SAW: మహిళల ప్రపంచ కప్ 2025 ఛాంపియన్ గా భారత్

INDW vs SAW: మహిళల ప్రపంచ కప్ 2025 ఛాంపియన్ గా భారత్

INDW vs SAW: మహిళల ప్రపంచకప్ ఫైనల్లో భారత్ అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొట్టింది. సౌతాఫ్రికాను చిత్తుచేస్తూ ఛాంపియన్ గా నిలిచింది. షఫాలీ వర్మ బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ టీమిండియాను విజేతగా నిలబెట్టింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 03 2025, 12:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహిళల ప్రపంచ కప్ పైనల్ లో సౌతాఫ్రికాను చిత్తుచేసిన ఇండియా
Image Credit : X/BCCIWOMEN

మహిళల ప్రపంచ కప్ పైనల్ లో సౌతాఫ్రికాను చిత్తుచేసిన ఇండియా

మహిళల ప్రపంచ కప్ లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ సౌతాఫ్రికాను చిత్తచేసి భారత్ విజేతగా నిలిచింది. వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ కు దిగింది.

వర్షం కారణంగా పిచ్‌పై కొంత తేమ ఉన్నా, భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు ధైర్యంగా ఆడి జట్టుకు అద్భుతమైన ప్రారంభం అందించారు.

25
ఓపెనర్ల అద్భుత భాగస్వామ్యం
Image Credit : Getty

ఓపెనర్ల అద్భుత భాగస్వామ్యం

స్మృతి మంధాన 45 పరుగులు, షఫాలీ వర్మ 87 పరుగులతో మొదటి వికెట్‌కు 104 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న క్రమంలో స్మృతి అవుట్ అయింది. ఆ తర్వాత కూడా షఫాలీ తన దూకుడు కొనసాగించింది. ఫోర్లు, సిక్సర్లతో సౌతాఫ్రికా బౌలింగ్ ను చెడుగుడు ఆడుకుంది. సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో ఖాకా బౌలింగ్‌లో క్యాచ్ రూపంలో అవుట్ కావడంతో ఆమె అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది.

Related Articles

Related image1
షఫాలీ వర్మ: 15 ఏళ్లకే అరంగేట్రం.. కట్ చేస్తే చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్
Related image2
సచిన్, సెహ్వాగ్ రికార్డులు బ్రేక్.. షఫాలీ వర్మ కొత్త చరిత్ర
35
మిడిల్ ఓవర్లలో తడబడిన భారత జట్టు
Image Credit : Getty

మిడిల్ ఓవర్లలో తడబడిన భారత జట్టు

ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత జెమీమా రోడ్రిగ్స్ 24 పరుగులు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అయితే, మధ్యలో దీప్తి శర్మ 58 పరుగుల హాఫ్ సెంచరీ నాక్ తో అదరగొట్టారు. నిలకడగా ఆడి స్కోరు బోర్డు ముందుకు తీసుకెళ్లింది. ఆమెతో కలిసి కౌర్ నాలుగో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం అందించింది. 

ఆ తర్వాత రిచా ఘోష్ చివరలో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో చివర్లో వేగంగా ఆడుతూ 34 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 కీలక వికెట్లు పడగొట్టింది. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసిరినా, భారత బ్యాటర్ల జోరును ఆపలేకపోయారు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి, మహిళల ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది.

45
బౌలింగ్ లోనూ అదరగొట్టిన భారత్
Image Credit : Getty

బౌలింగ్ లోనూ అదరగొట్టిన భారత్

199 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా తమ ఇన్నింగ్స్ ను నిదానంగా ప్రారంభించింది. క్రీజులో కుదురుకున్న తర్వాత ఇద్దరు ఓపెనర్లు మంచి షాట్స్ తో స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. దూకుడు పెంచి ఆడుతున్న సమయంలో తాజ్మిన్ బ్రిట్స్ ను అమన్ జోత్ కౌర్ అద్భుతమైన త్రో తో రనౌట్ చేసింది. దీంతో సౌతాఫ్రికా 10 ఓవర్ లో 51 పరుగుల తొలి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత శ్రీచరణి బోష్ ను తన తొలి ఓవర్ లోనే డక్ గా పెవిలియన్ కు పంపింది.

55
షఫాలీ వర్మ, దీప్తి శర్మ ఆల్ రౌండ్ షో
Image Credit : Getty

షఫాలీ వర్మ, దీప్తి శర్మ ఆల్ రౌండ్ షో

ఈ మ్యాచ్ లో షఫాలీ వర్మ అద్భుతమైన ఆటతో అదరగొట్టారు. మొదట బ్యాటింగ్ లో, ఆ తర్వాత బౌలింగ్ లో దుమ్మురేపే ప్రదర్శన ఇచ్చారు. మొదట 87 పరుగుల కీలకమైన బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆడిన షఫాలీ వర్మ.. బౌలింగ్ సమయంలో కీలకమైన వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాకు షాకిచ్చింది. సూపర్ ఫామ్ లో ఉన్న సునే లూస్, మారిజాన్ కాప్ వికెట్లు తీసుకుంది. వీరిద్దరూ పెవిలియన్ కు చేరిన తర్వాత సౌతాఫ్రికా జట్టు వరుస గా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ 101 పరుగుల సెంచరీ నాక్ తో పోరాడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. సౌతాఫ్రికా 246 పరుగులకు ఆలౌట్ అయింది.

దీప్తి శర్మ మరోసారి తన ప్రతిభను చూపించారు. బ్యాటింగ్ లో 58 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ను ఆడింది. ఇక బౌలింగ్ లో దుమ్మురేపింది. 5 వికెట్లతో సత్తా చాటింది. 42వ ఓవర్ లో వరుసగా రెండు వికెట్లు తీసుకుంది. మ్యాచ్ ను పూర్తిగా భారత్ వైపు తీసుకువచ్చింది. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా దీప్తి నిలిచింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Recommended image2
BCCI Central Contracts : డబ్బులు కట్.. గ్రేడ్ కట్.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఊహించని దెబ్బ
Recommended image3
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related Stories
Recommended image1
షఫాలీ వర్మ: 15 ఏళ్లకే అరంగేట్రం.. కట్ చేస్తే చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్
Recommended image2
సచిన్, సెహ్వాగ్ రికార్డులు బ్రేక్.. షఫాలీ వర్మ కొత్త చరిత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved