MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • సచిన్, సెహ్వాగ్ రికార్డులు బ్రేక్.. షఫాలీ వర్మ కొత్త చరిత్ర

సచిన్, సెహ్వాగ్ రికార్డులు బ్రేక్.. షఫాలీ వర్మ కొత్త చరిత్ర

Shafali Verma : నేవీ ముంబైలో జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో షఫాలీ వర్మ 87 పరుగులతో చరిత్ర సృష్టించింది. టీమిండియా లెజెండరీ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ రికార్డులను బద్దలు కొట్టింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 02 2025, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫైనల్ లో షఫాలీ వర్మ చరిత్రాత్మక ఇన్నింగ్స్
Image Credit : X/@BCCIWomen

ఫైనల్ లో షఫాలీ వర్మ చరిత్రాత్మక ఇన్నింగ్స్

భారత యువ ఓపెనర్ షఫాలీ వర్మ ఆదివారం (నవంబర్ 2) నేవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 21 సంవత్సరాల వయసులోనే రికార్డుల మోత మోగించింది. 87 పరుగులు నాక్ తో షఫాలీ వర్మ భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసింది. 78 బంతుల్లో 87 పరుగులు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో 7 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి.

ప్రతికా రావల్ గాయంతో జట్టులోకి రిజర్వ్‌గా తీసుకున్న షఫాలీ వర్మ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. సెమీఫైనల్లో తక్కువ పరుగులు చేసినప్పటికీ, ఫైనల్లో ఆమె తన బ్యాటింగ్ ప్రతిభను చూపించింది.

25
స్మృతి మంధానతో షఫాలీ వర్మ రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యం
Image Credit : BCCI

స్మృతి మంధానతో షఫాలీ వర్మ రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యం

స్మృతి మంధాన, షఫాలీ వర్మ జోడీ ఫైనల్లో 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇది ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో భారత మహిళల జట్టుకు అత్యధిక ఓపెనింగ్ జంటగా నిలిచింది. అంతేకాదు, భారత క్రికెట్‌లో పురుషులు–మహిళలు కలిపి కూడా ఈ ఘనతను సాధించిన తొలి జంట వీరిదే.

గత రికార్డు 2017 ప్రపంచ కప్‌లో పూర్ణిమా రావ్, ఎస్ హరికృష్ణ జంట పేరిట 20 పరుగులు మాత్రమే. ఇప్పుడు మంధాన, షఫాలీ వర్మ జంట 104 పరుగులు చేసి ఆ రికార్డును బద్దలుకొట్టింది.

Related Articles

Related image1
ఇండియా vs ఆస్ట్రేలియా: అర్షదీప్, వాషింగ్టన్ సుందర్ కంగారెత్తించారు భయ్యా !
Related image2
మహిళల క్రికెట్ వరల్డ్ కప్ 2025: ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
35
ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన షఫాలీ వర్మ
Image Credit : Getty

ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన షఫాలీ వర్మ

షఫాలీ వర్మ 87 పరుగులు భారత్ తరఫున ప్రపంచ కప్ ఫైనల్లో సాధించిన అత్యధిక స్కోరు. 2017లో పూనమ్ రౌత్ ఇంగ్లాండ్‌పై 86 పరుగులు చేసి రికార్డు సృష్టించగా, ఇప్పుడు షఫాలీ వర్మ ఆ రికార్డును అధిగమించింది.

ఈ జాబితాలో గౌతమ్ గంభీర్ (97, 2011), ఎంఎస్ ధోనీ (91*, 2011) తర్వాత మూడో స్థానంలో షఫాలీ వర్మ నిలిచింది. ఆమెతో పాటు పూనమ్ రౌత్ (86, 2017), వీరేంద్ర సెహ్వాగ్ (82, 2003) తరువాతి స్థానాల్లో ఉన్నారు.

45
షఫాలీ వర్మ పై ప్రశంసల వర్షం
Image Credit : Getty

షఫాలీ వర్మ పై ప్రశంసల వర్షం

21 సంవత్సరాలు 278 రోజుల వయసులో ప్రపంచ కప్ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా షఫాలీ వర్మ రికార్డు సాధించింది. అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తారు. ఒకరు "ఈ ఇన్నింగ్స్‌ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది" అని రాస్తే, మరొకరు "పెద్ద స్టేజీలపై పెద్ద ప్లేయర్లు ఎలా ఆడాలో షఫాలీ వర్మ చూపించింది" అంటూ కామెంట్స్ చేశారు.

ఆమె అటాకింగ్ బ్యాటింగ్‌తో భారత ఇన్నింగ్స్‌కు బలమైన ఆరంభం లభించింది. మొదటి బంతినుండే ఆమె ధైర్యంగా ఆడుతూ, సౌతాఫ్రికా బౌలర్లపై దాడి ప్రారంభించింది. కేవలం 49 బంతుల్లోనే ఆమె హాఫ్ సెంచరీ పూర్తి చేసింది.

55
రికార్డుల మోత మోగించిన షఫాలీ వర్మ
Image Credit : X/@BCCIWomen

రికార్డుల మోత మోగించిన షఫాలీ వర్మ

షఫాలీ వర్మ ఫైనల్లో సెంచరీకి దగ్గరగా చేరినా, 28వ ఓవర్‌లో అవుట్ అయ్యింది. అయినా, ఆమె రికార్డుల మోత మోగించారు. ఆమె 87 పరుగులు భారత మహిళా ఆటగాళ్లలో ప్రపంచ కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అలాగే పురుషుల క్రికెట్‌లో సచిన్, సెహ్వాగ్ ల ఫైనల్ రికార్డులను కూడా ఆమె అధిగమించింది.

భారత జట్టుకు మొదటి వికెట్‌కి 104 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించి, తరువాత స్మృతి మంధాన ఔటయ్యాక జెమిమా రోడ్రిగ్స్‌తో కలిసి స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
మహిళల క్రికెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎలా చూడొచ్చు.? రీఛార్జ్ ఆప్ష‌న్స్ ఇవే
Recommended image2
T20 World Cup : రెండుసార్లు టీమిండియాను టీ20 విజేతగా నిలిపిన తోపు ప్లేయర్.. ధోని, కోహ్లీ కాదు, మరెవరు?
Recommended image3
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Related Stories
Recommended image1
ఇండియా vs ఆస్ట్రేలియా: అర్షదీప్, వాషింగ్టన్ సుందర్ కంగారెత్తించారు భయ్యా !
Recommended image2
మహిళల క్రికెట్ వరల్డ్ కప్ 2025: ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved