MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • అయ్యో.! ఇలాగైతే టీమిండియా ఉమెన్స్‌కి కష్టమే.. ఫైనల్ మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరికో తెలుసా.?

అయ్యో.! ఇలాగైతే టీమిండియా ఉమెన్స్‌కి కష్టమే.. ఫైనల్ మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరికో తెలుసా.?

World Cup: ముంబై వేదికగా జరిగే 2025 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు భారత్, సౌతాఫ్రికా సిద్ధమయ్యాయి. అయితే ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. చిరుజల్లుల నుంచి భారీ వర్షం వరకు అవకాశం ఉన్నందున..

1 Min read
Author : Pavithra D
Published : Nov 02 2025, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 తుది దశకు
Image Credit : BCCI

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 తుది దశకు

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 తుది దశకు చేరుకుంది. నవీ ముంబై వేదికగా జరిగే ఫైనల్‌లో టీమిండియా సౌతాఫ్రికాతో తలపడనుంది. తొలి సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి సౌతాఫ్రికా ఫైనల్ చేరగా, రెండో సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేసింది.

25
ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు
Image Credit : BCCI

ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు

అయితే, ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం లేకున్నా, చిరుజల్లులైనా మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్ రోజు 30-60 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయించారు.

Related Articles

Related image1
IPL 2026: సంజూ శాంసన్ మాత్ర‌మే కాదు.. రాజస్థాన్ రాయల్స్‌ నుంచి ఐదుగురు ప్లేయ‌ర్లు అవుట్ !
Related image2
IPL 2026: ఢిల్లీకి సంజూ.. కేకేఆర్‌కు రాహుల్.. మెగా వేలంలోకి స్టార్ ప్లేయర్లు.. ఎవరెవరంటే.?
35
మ్యాచ్ రద్దయ్యే భారీ వర్ష సూచన..
Image Credit : BCCI

మ్యాచ్ రద్దయ్యే భారీ వర్ష సూచన..

ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే, ఆగిపోయిన ఓవర్ల నుంచే రిజర్వ్ డే అయిన సోమవారం ఆటను కొనసాగిస్తారు. ఒకసారి టాస్ వేస్తే, ఆ మ్యాచ్‌ను లైవ్‌గా పరిగణిస్తారు. దురదృష్టవశాత్తు, సోమవారం కూడా వర్షం పడే అవకాశం ఉన్నప్పటికీ, మ్యాచ్ రద్దయ్యే భారీ వర్ష సూచన అయితే లేదు.

45
రిజర్వ్ డే కూడా..
Image Credit : BCCI

రిజర్వ్ డే కూడా..

ఇది అభిమానులకు కొంత ఉపశమనం. ఒకవేళ రిజర్వ్ డే కూడా ఆట సాధ్యం కాకుండా మ్యాచ్ రద్దయితే, ఐసీసీ రూల్స్ ప్రకారం ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. రెండు రోజుల్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇరు జట్లు కనీసం 20 ఓవర్లు ఆడేలా చూస్తారు.

55
1983 సీన్‌ను మళ్లీ రిపీట్
Image Credit : BCCI

1983 సీన్‌ను మళ్లీ రిపీట్

అది కూడా సాధ్యం కాకపోతేనే మ్యాచ్‌ను రద్దు చేస్తారు. అయితే, ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి అయితే లేదు. ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. 1983 సీన్‌ను మళ్లీ రిపీట్ చేయాలని టీమిండియా ఉమెన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రికెట్
మహిళలు
మహిళల క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : బ్యాట్ పడితే కోట్లు.. ఫోజు కొడితే లక్షలు! టీ20 వరల్డ్ కప్ రిచెస్ట్ ప్లేయర్స్ వీళ్లే
Recommended image2
IND vs PAK : జై షా మైండ్ గేమ్.. దెబ్బకు ఏకాకిగా మారిన పాకిస్తాన్.. మైండ్ బ్లాక్ అంతే మరి !
Recommended image3
IND vs PAK : ఐసీసీ దెబ్బకు దారిలోకి వచ్చిన పాక్.. నవ్వులపాలవుతున్న నఖ్వీ డ్రామా
Related Stories
Recommended image1
IPL 2026: సంజూ శాంసన్ మాత్ర‌మే కాదు.. రాజస్థాన్ రాయల్స్‌ నుంచి ఐదుగురు ప్లేయ‌ర్లు అవుట్ !
Recommended image2
IPL 2026: ఢిల్లీకి సంజూ.. కేకేఆర్‌కు రాహుల్.. మెగా వేలంలోకి స్టార్ ప్లేయర్లు.. ఎవరెవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved