MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • T20 World Cup : బ్యాట్ పడితే కోట్లు.. ఫోజు కొడితే లక్షలు! టీ20 వరల్డ్ కప్ రిచెస్ట్ ప్లేయర్స్ వీళ్లే

T20 World Cup : బ్యాట్ పడితే కోట్లు.. ఫోజు కొడితే లక్షలు! టీ20 వరల్డ్ కప్ రిచెస్ట్ ప్లేయర్స్ వీళ్లే

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో ఆడుతున్న అత్యంత ధనిక క్రికెటర్ల జాబితా విడుదలైంది. గ్లెన్ మాక్స్‌వెల్, హార్దిక్ పాండ్యా సహా టాప్ 10 కోటీశ్వరుల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 10 2026, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
T20 వరల్డ్ కప్ రిచెస్ట్ ప్లేయర్స్ : హార్దిక్ నుంచి సంజూ వరకు.. టాప్ 10 కోటీశ్వరుల లిస్ట్ ఇదే !
Image Credit : Getty

T20 వరల్డ్ కప్ రిచెస్ట్ ప్లేయర్స్ : హార్దిక్ నుంచి సంజూ వరకు.. టాప్ 10 కోటీశ్వరుల లిస్ట్ ఇదే !

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం అంతా టీ20 ప్రపంచకప్ ఫీవర్‌తో ఊగిపోతోంది. మైదానంలో ఆటగాళ్లు తమ బ్యాట్లతో, బంతులతో విన్యాసాలు చేస్తుంటే, మైదానం బయట వారి సంపాదన కూడా భారీ స్థాయిలో ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లు, ముఖ్యంగా ఐపీఎల్ వంటి భారీ టోర్నీల వల్ల క్రికెటర్ల ఆదాయం ఊహించని రీతిలో పెరిగింది. ఈ నేపథ్యంలో, ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న అత్యంత ధనిక ఆటగాళ్ల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లెన్ మాక్స్‌వెల్ నుంచి సంజూ శాంసన్ వరకు టాప్ 10 కోటీశ్వరుల వివరాలు గమనిస్తే..

211
1. గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా)
Image Credit : x

1. గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా)

ఈ జాబితాలో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ మొదటి స్థానంలో నిలిచారు. మాక్స్‌వెల్ నికర ఆస్తి విలువ సుమారు రూ. 116.2 కోట్లు. ఐపీఎల్‌లో భారీ ఒప్పందాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇతర టీ20 లీగ్‌ల ద్వారా ఆయన ఈ స్థాయిలో సంపాదిస్తున్నారు.

Related Articles

Related image1
IND vs NAM : టీమిండియాలో 3 భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్ !
Related image2
IND vs PAK : జై షా మైండ్ గేమ్.. దెబ్బకు ఏకాకిగా మారిన పాకిస్తాన్.. మైండ్ బ్లాక్ అంతే మరి !
311
2. హార్దిక్ పాండ్యా (భారత్)
Image Credit : x@bcci

2. హార్దిక్ పాండ్యా (భారత్)

భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన మొత్తం ఆస్తి విలువ రూ. 91.3 కోట్లు. ఐపీఎల్ కెప్టెన్సీ, భారీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా హార్దిక్ ఆదాయం గణనీయంగా పెరిగింది. భారత క్రికెట్‌లో అత్యంత విలువైన ఆటగాళ్లలో ఆయన ఒకరు.

411
3. జోస్ బట్లర్ (ఇంగ్లాండ్)
Image Credit : our own

3. జోస్ బట్లర్ (ఇంగ్లాండ్)

ఇంగ్లాండ్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ రూ. 83 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో నిలిచారు. ఐపీఎల్ సహా ఇతర అంతర్జాతీయ లీగ్స్ బట్లర్ ఆర్థిక స్థితిని మెరుగుపరిచాయి. వైట్ బాల్ క్రికెట్‌లో ఆయనకున్న క్రేజ్ ఆదాయంగా మారుతోంది.

511
4. జస్ప్రీత్ బుమ్రా (భారత్)
Image Credit : AFP

4. జస్ప్రీత్ బుమ్రా (భారత్)

ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా నికర ఆస్తి విలువ రూ. 74.7 కోట్లు. బుమ్రా బీసీసీఐ (BCCI) A+ కేటగిరీ కాంట్రాక్ట్‌లో ఉన్నారు. ఐపీఎల్ జీతం, ప్రముఖ బ్రాండ్లతో ఉన్న ఒప్పందాలు ఆయన ఆదాయానికి ప్రధాన వనరులు.

611
5. క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా)
Image Credit : Getty

5. క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా)

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ రూ. 66.4 కోట్ల ఆస్తులతో ఐదో స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాక్షికంగా తప్పుకున్నప్పటికీ, టీ20 లీగ్‌ల ద్వారా ఆయన సంపాదన తగ్గలేదు.

711
6. సూర్యకుమార్ యాదవ్ (భారత్)
Image Credit : Getty

6. సూర్యకుమార్ యాదవ్ (భారత్)

భారత టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ ఆస్తి విలువ కూడా రూ. 66.4 కోట్లు. ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉంటూ భారీ జీతం అందుకుంటున్నారు. తనదైన 360 డిగ్రీల ఆట తీరుతో బ్రాండ్ వాల్యూను కూడా పెంచుకున్నారు.

811
7. ఇషాన్ కిషన్ (భారత్)
Image Credit : AFP

7. ఇషాన్ కిషన్ (భారత్)

యువ ఆటగాడు ఇషాన్ కిషన్ అనతి కాలంలోనే భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఈయన నికర ఆస్తి విలువ రూ. 58.1 కోట్లు. ఐపీఎల్ వేలంలో భారీ ధర పలకడం, దూకుడుగా ఆడే బ్యాటింగ్ శైలి ఇషాన్‌ను కోటీశ్వరుల జాబితాలోకి చేర్చింది.

911
8. సంజూ శాంసన్ (భారత్)
Image Credit : Instagram/imsanjusamson

8. సంజూ శాంసన్ (భారత్)

కేరళ స్టార్ సంజూ శాంసన్ రూ. 53.9 కోట్ల ఆస్తితో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఐపీఎల్‌లో టాప్ శాలరీ అందుకునే ఆటగాళ్లలో సంజూ ఒకరు. ఆయనకు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ కారణంగా బ్రాండ్ వాల్యూ కూడా ఎక్కువే.

1011
9. టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా)
Image Credit : our own

9. టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా)

ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియా ప్లేయర్ టిమ్ డేవిడ్ నికర ఆస్తి విలువ రూ. 49.8 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫ్రాంచైజీ లీగ్స్ ఆడటం ద్వారా ఆయన ఈ సంపదను ఆర్జించారు.

1111
10. మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా)
Image Credit : Getty

10. మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా)

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ రూ. 45.7 కోట్ల నికర ఆస్తితో పదో స్థానంలో నిలిచారు. స్థిరమైన ప్రదర్శన, వివిధ దేశాల్లోని లీగ్స్ ఆడుతుండటం వల్ల స్టోయినిస్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
క్రీడలు
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : జై షా మైండ్ గేమ్.. దెబ్బకు ఏకాకిగా మారిన పాకిస్తాన్.. మైండ్ బ్లాక్ అంతే మరి !
Recommended image2
IND vs PAK : ఐసీసీ దెబ్బకు దారిలోకి వచ్చిన పాక్.. నవ్వులపాలవుతున్న నఖ్వీ డ్రామా
Recommended image3
T20 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను ఫోన్‌లో ఎలా చూడొచ్చు.? రీఛార్జ్ ఆప్ష‌న్స్ ఇవే
Related Stories
Recommended image1
IND vs NAM : టీమిండియాలో 3 భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్ !
Recommended image2
IND vs PAK : జై షా మైండ్ గేమ్.. దెబ్బకు ఏకాకిగా మారిన పాకిస్తాన్.. మైండ్ బ్లాక్ అంతే మరి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved